04/10/2026
🌿 అభిమాని ఫౌండేషన్ – బొబ్బిలి 🌿
20 ఏళ్ల సేవా ప్రస్థానం
🩸 2009లో గిరిజనుల కోసం రక్తదాన సేవకు శ్రీకారం
గిరిజన ప్రాంతాల్లో సరైన అవగాహన లేకపోవడం, రక్తహీనత వంటి సమస్యల కారణంగా అనేకమంది మరణాల బాట పడుతున్నారని వివిధ పత్రికలలో వార్తలు రావడం గుర్తించాము. గుమ్మలక్ష్మీపురం ప్రాంత సీనియర్ వైద్యులు Dr. ప్రభాకర రావు గారి సూచనల తీసుకోవడం జరిగినది.
2009లో గిరిజన ఉప ప్రణాళిక ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటు, ప్రత్యేకంగా గిరిజనుల కోసం రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశాము.
పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయానికి ప్రతి సోమవారం వచ్చే గిరిజనులకు రక్తలేమి నివారణకై అవగాహన కల్పించాము. అవసరమైన సమయంలో గిరిజనులకు బ్లడ్ బ్యాంకుల ద్వారా ఉచితంగా రక్తం అందేలా అధికారులు చర్యలు తీసుకునేందుకు కూడా కృషి చేశాము.
🩸 పార్వతీపురం పరిధిలో అనేక రక్తదాన శిబిరాలు నిర్వహించి, ఏరియా ఆసుపత్రిలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తనిధిలో రక్త నిల్వలు అందుబాటులో ఉండేలా మా వంతు సహకారం అందించాము.
యువతలో రక్తదానం పట్ల చైతన్యం, సేవా స్ఫూర్తి పెంపొందించేందుకు కృషి చేశాము. రక్తదాన శిబిరాల నిర్వహణకు అవసరమైన సహకారం అందిస్తూ, మరెందరో యువతను ఈ సేవలో భాగస్వాములను చేశాము.
❤️ ఒక యూనిట్ రక్తం… ఒక ప్రాణానికి ఆశాకిరణం.
🩸 రక్తదానం చేద్దాం – ప్రాణాలను కాపాడుదాం.
రెడ్డి రాజగోపాల్ నాయుడు
ఫౌండర్, అభిమాని ఫౌండేషన్ – బొబ్బిలి