03/07/2025
పత్రికా ప్రచురణార్థం ప్రసారార్థం
జులై 9 జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మిక కర్షక ప్రజలు జయప్రదం చేయాలి
సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక ప్రజాసంఘాల సమావేశం పిలుపు
సిఐటియు జిల్లా అధ్యక్షులు రాపర్తి రాజు
~~~~~~~~~~~~~~~~~~~~~~~
జనగామ : కార్మిక వ్యతిరేక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి డిమాండ్ చేస్తూ జూలై 9 జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను. కార్మికులు రైతులు కూలీలు ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు రాపర్తి రాజు కోరారు
గురువారం జిల్లా కేంద్రంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో సిఐటియు రైతు సంఘం వ్యవసాయ సంఘం ప్రజాసంఘాల జిల్లా సమావేశం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గంగాపురం మహేందర్ అధ్యక్షతన జరిగింది
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు రాపర్తి రాజు మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలపైన కార్మిక కర్షక వివిధ తరగతి ప్రజలు ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు
నాలుగు లేబర్ కోడలు కార్మికులకు ఉరితాలుగా మారనున్నాయని వెంటనే రద్దు చేయాలని అన్నారు స్వాతంత్రం పూర్వం కార్మికులు సాధించుకున్న చట్టాలను రద్దు చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు
పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక చట్టాలను మార్చడం సిగ్గుచేయడానికి విమర్శించారు 8 గంటల పని దినాన్ని 12 గంటలకు మార్చడం అంటే కార్మికులను వారి శ్రమను తీవ్రంగా దోపిడీ చేస్తూ వెట్టి చాకిరి చేయించుకోవడమేనని అన్నారు నరేంద్ర మోడీ నిత్యవసర సరుకులు ధరలు పెంచి ప్రజలపై బారాలు వేస్తున్నారని అన్నారు రైతులకు కూలీలు కార్మికులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ విధానం రద్దుచేసి, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి అని అన్నారు ఉద్యోగ భద్రత కల్పించాలి. 8 గంటల పని దినాన్ని అమలు చేయాలని కోరారు బోనస్, ఇఎస్ఐ చట్టాలలో వేతన సీలింగ్ పరిమితిని పెంచాలని అన్నారు
తెలంగాణ రాష్ట్ర 2వ పిఆర్సిలో కనీస వేతనం రూ.26,000/-లుగా నిర్ణయించాలని.
డిమాండ్ చేశారు జులై 9 జరిగే దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో మండల కేంద్రాలు జిల్లా కేంద్రాల్లో జరిగే నిరసన ప్రదర్శనలు అన్ని రంగాల కార్మికులు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి భూక్య చందు నాయక్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి అజ్మీర సురేష్ తదితరులు పాల్గొన్నారు