Telangana Sagara Sangham

Telangana Sagara Sangham The members of Sagara (Uppara) community are the descendants of Emperor Sagara of Suryavamsha spread throughout the Country and all over the world.

During the Satya yuga king Sagara performed a horse sacrifice to prove his supremacy. On seeing this, Indra, the Lord of heaven, became fearful so he decided to steal the horse. He left the horse at the ashram of Kapiladeva, who was in deep meditation. King Sagara’s 60 000 sons were sent to find the horse. When they found the horse at the ashram of Kapila muni, they tought that he stole the horse

and decided to attack them. Great rishi was disturbed in his meditation so he opened one eye and burned all the 60 000 sons to ashes. When king Sagara heared what happend to his sons, he sent his grandson Amsuman to get the horse back. Kapiladeva returned the horse and told the king that his sons were burned because they disturbed his meditation. He said that they could be saved if the goddess Ganga descended to earth and bathed them in her waters. King Sagara’s great great grandson, Bhagiratha did great tapasya to free the sons of king Sagara. Pleased with his tapasya, mother Ganga agreed to come down to the earth. She told him that her force would be too great for the earth to handle, and that she needed someoone to buffer the fall. King Bhagiratha them started to worship Lord Shiva. Being pleased with his worship Lord Shiva agreed to accept the powerful force of the descending river on his head. King Bhagiratha then preceded the holy river with his chariot and ripped open a gorge to allow her to flow. The river followerd the king to Ganga Sagar at the Bay of Bengal, where was the ashram of Kapiladev. The Ganga then bathed the remains of the king Sagara’s 60 000 sons and returned them to their eternal position. By
Sagara Community

ప్రతిభ పురస్కారాలు
28/10/2025

ప్రతిభ పురస్కారాలు

*సగర సంఘం రాష్ట్ర అధ్యక్షునికి అరుదైన గౌరవం*  *శేఖర్ సగర కు డాక్టరేట్ అవార్డ్ ను ప్రధానం చేసిన అమెరికా కాలిఫోర్నియా గ్లో...
04/10/2025

*సగర సంఘం రాష్ట్ర అధ్యక్షునికి అరుదైన గౌరవం*

*శేఖర్ సగర కు డాక్టరేట్ అవార్డ్ ను ప్రధానం చేసిన అమెరికా కాలిఫోర్నియా గ్లోబల్ యూనివర్సిటీ*

*డాక్టర్ ఉప్పరి శేఖర్ సగర కు శుభాకాంక్షలు తెలిపిన సగర సంఘం నాయకులు*

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: విద్యార్థి దశ నుంచి ఎబివిపి, ఆర్.ఎస్.ఎస్ లో నేర్చుకున్న క్రమశిక్షణ, కార్యదీక్ష, జర్నలిస్ట్ గా 25 సంవత్సరాల ప్రయాణంలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా, జార్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (TUWJ) రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గా, తన తల్లిదండ్రుల పేరుమీద నెలకొల్పిన బుచ్చమ్మోళ్ళ వెంకటమ్మ పరమయ్య మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గా పేద విద్యార్థులకు చేసిన సేవలు, తెలంగాణ సగర కులాన్ని జాగృతం చేయడంలో గత 11 సంవత్సరాలుగా నిర్విరామంగా చేస్తున్న సేవలను గుర్తించి అమెరిక క్యాలీపోర్నియా గ్లోబల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అవార్డ్ ను ప్రధానం చేసింది. దేశ రాజధాని ఢిల్లీ నోయిడా మయూరి విహార్ లోని హోటల్ హాలిడే ఇన్ లో శనివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ హాలీవుడ్ హీరో రాహుల్ రాయ్ చేతుల మీదుగా అవార్డును అందజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఉప్పరి శేఖర్ సగర కు సగర సంఘం రాష్ట్ర నాయకులు, జిల్లాల నాయకులు, బీసీ సంఘం నాయకులు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.

Telangana Sagara Sangham బతుకమ్మ పాట 2025
24/09/2025

Telangana Sagara Sangham బతుకమ్మ పాట 2025

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

https://ssgnews6.blogspot.com/2025/09/blog-post_22.html
23/09/2025

https://ssgnews6.blogspot.com/2025/09/blog-post_22.html

🌸 తెలంగాణ సగర మహిళా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు 🌸 లింక్‌ను పొందండి Facebook X Pinterest ఈమెయిల్‌ ఇతర యాప్‌లు - సెప్టెంబర...

వరంగల్లో జన్మించిన అనిశెట్టి రజిత గారు...ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్ ప్రోత్సాహంతో మలిదశ ఉద్యమంలో పాల్గొని అనేక బహిరంగ సభల్ల...
12/08/2025

వరంగల్లో జన్మించిన అనిశెట్టి రజిత గారు...ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్ ప్రోత్సాహంతో మలిదశ ఉద్యమంలో పాల్గొని అనేక బహిరంగ సభల్లో తన ఉపన్యాసాలతో ప్రజలను ఉద్యమం వైపు ఆకర్షితులు అయ్యేలా చేశారు.

అనిశెట్టి రజిత గారి రచనలు :

గులాబీలు జ్వలిస్తున్నాయి (కవిత్వం 1994)
నేనొక నల్లమబ్బునవుతా (కవిత్వం 1997)
చెమటచెట్టు (కవిత్వం 1999)
ఓ లచ్చవ్వ (దీర్ఘకవిత 2005)
ఉసురు (కవిత్వం 2002)
గోరంతదీపాలు (నానీలు 2005)
దస్తఖత్‌ (హైకూలు2005)
అనగనగా కాలం (కవిత్వం 2005)
మట్టిబంధం (కథా సంపుటి 2006)
నన్హే ఓ నన్హే
మార్కెట్‌ స్మార్ట్‌ శ్రీమతి
ఈమె సంపాదకత్వంలో వెలువడిన రచనలు:

వెతలే కథలై
ఊపిరి
జిగర్‌
ఉద్విగ
ఆకాశపుష్పం
ముజఫర్‌నగర్‌ మారణకాండ
అగ్నిశిఖ
పోలవరం-ప్రాణాంతక ప్రమాదం మొదలైనవి.

వీరు 1992లో కాకతీయ విశ్వవిద్యాలయంలో బోధనేతర సిబ్బంది విభాగంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. నేటికి తన సేవలను అందిస్తూనే ఉన్నారు. 1977లో కాళోజీతో సాహిత్య పరిచయం ఏర్పడి అనేక మెళకువలను నేర్చుకుంది. వీరు ఉద్యోగినిగా తన సేవలను అందిస్తూనే అనేక సంస్థల వివిధ హోదాలలో చురుకుగా పాల్గొంటున్నది.

వీరితో తో అనుబంధమున్న సంస్థలు:

సావిత్రిబాయిపూలే చారిటబుల్‌ ట్రస్ట్‌, విశాఖపట్నం - ఛీఫ్ అడ్వయిజర్
ముక్త తెలంగాణ ఉమెన్స్‌ కలెక్టివ్ - అడ్వయిజర్
తెలంగాణ ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక - కార్యదర్శి
రుద్రమ ప్రచురణలు - ఫౌండర్

అవార్డ్స్ :
1984 :జవహర్‌లాల్‌ నెహ్రూ మెమోరియల్‌ ట్రస్ట్‌, న్యూఢిల్లీ వారి అవార్డు
వరంగల్ జిల్లా ఆల్‌ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ - పంచరత్న సాహిత్య అవార్డు
2001: డాక్టర్‌ మలయశ్రీ ప్రగతిశీల సాహిత్య పురస్కారం
2001: భారతీయ దళిత సాహిత్య అకాడమీ వారి వీరాంగన సావిత్రీబాయి పూలే ఫెలోషిప్‌ అవార్డు
2003: జైమినీ అకాడమీ, ఉత్తర్ ప్రదేశ్ వారి ఆధ్వర్యంలో సుభద్ర కుమారి చౌహాన్‌ సమాన్న్‌ పురస్కార్‌

ఇంతటి గొప్ప రచయిత్రి ఉద్యమ నాయకురాలు వెళ్లిపోవడం సాహితీ రంగానికి తీరని లోటు.వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నాను.

_*భగీరథుడి పట్టుదల అందరిలో ఉండాలి*__*గంగను దివి నుంచి భూమికి దింపిన మహా తపస్వి భగీరథుడని భగీరథుడి సహనం పట్టుదల ప్రతి ఒక్...
30/05/2025

_*భగీరథుడి పట్టుదల అందరిలో ఉండాలి*_

_*గంగను దివి నుంచి భూమికి దింపిన మహా తపస్వి భగీరథుడని భగీరథుడి సహనం పట్టుదల ప్రతి ఒక్కరిలోనూ ఉండాలని వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు పేర్కొన్నారు*_

_*శుక్రవారం వనపర్తి పట్టణంలోని మర్రికుంటలో నూతనంగా ఏర్పాటుచేసిన ఏకశిల భగీరథ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు*_

_*ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భగీరథుడి పట్టుదల మనందరిలోన ఉండాలని మనం చేపట్టే పనులను పూర్తి చేసే వరకు వదిలిపెట్టకూడదని ఎమ్మెల్యే సూచించారు*_

_*తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించబోతుందని అందులో సగరులకు సైతం*_ _*రాజకీయపరమైన అవకాశాలు రాబోతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు*_

_*కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక వనపర్తి నియోజకవర్గంలో జిల్లా స్థాయి నామినేటెడ్ పదవికి మన సగర సోదరుడైన గోవర్ధన్ సాగర్ ను నియమించామని ఎమ్మెల్యే తెలిపారు*_

_*దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ YS రాజశేఖర్ రెడ్డి హయాంలోని సగరులకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించిన ప్రభుత్వం ఏకైక కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే గుర్తులు చేశారు*_

_*సగరుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారితో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుందామని మీ సంఘంలోని ముఖ్యులు మాట్లాడుకునే సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు*_

_*వనపర్తి పట్టణంలోని సగరుల కోసం కళ్యాణ మండపాన్ని సంబంధించి నివేదికలు తయారు చేయాలని ఎమ్మెల్యే సంఘం నాయకులకు సూచించారు*_

*ఈ కార్యక్రమంలో రాష్ట్ర సగర సంగం అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర, జిల్లా అడక్ కమిటీ కన్వీనర్ మోడల తిరుపతయ్య సాగర్ , జిల్లా గ్రంధాల అధ్యక్షుడు గోవర్ధన్ సగర, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యం సాగర్ , రాష్ట్ర గౌరవ అధ్యక్షులు హరికిషన్ సాగర్ , రాష్ట్ర గౌరవ సలహాదారులు ఆర్బి ఆంజనేయులు, రాష్ట్ర సగర సంగం ఉపాధ్యక్షులు చిలుక సత్యం సాగర్ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి, మరికుంట సగర అధ్యక్షులు చీర్ల ఆంజనేయులు ,రాష్ట్ర మహిళా మాజీ అధ్యక్షురాలు మహేశ్వరి సగర, గ్రేటర్ హైదరాబాద్ సగర సంఘం అధ్యక్షులు మోడల రవి సగర,ప్రధాన కార్యదర్శి ఆవుల వెంకట్రాములు సగర,కోశాధికారి దిండి రామస్వామి సగర,గ్రేటర్ హైదరాబాద్ యువజన సంఘం అధ్యక్షులు ఎర్రంశెట్టి సీతారాం సగర,నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు సగర, గద్వాల జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ సగర, వనపర్తి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి పల్లె సత్యనారాయణ సాగర రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చీర్ల విష్ణు సగర, మాజీ కౌన్సిలర్ చీర్ల సత్యం సగర, వనపర్తి జిల్లా మాజీ ఉపాధ్యక్షులు చీర్ల జనార్ధన్ సగర, ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రావుల నాగరాజు సాగర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు చిలుక జ్యోతి, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి చీర్ల జ్యోతి,గొబ్బూరి చంద్రాయుడు సగర ఛీర్ల నాగేంద్రం సగర, టౌన్ యూత్ అధ్యక్షులు చీర్ల మహేష్ సాగర్, మర్రికుంట ప్రధాన కార్యదర్శి చీర్ల రాజు సగర కోశాధికారి మో డల శివసాగర్ ఉపాధ్యక్షులు యాదగిరి సాగర్ పట్టణ మాజీ అధ్యక్షులు చీర్ల పెదనాగులు సగర,. ప్రధాన కార్యదర్శి చీర్ల రాజు. గౌరవ అధ్యక్షులు చీర్ల నాగేంద్రం. కోశాధికారి మోడల్ శివ. ఉపాధ్యక్షులు మోడల్ యాదగిరి. చీర్లనాగ స్వామి. చీర్ల జనార్ధన్. చీర్ల శ్రీనివాసులు. చీర్ల అయ్యన్న చీర్ల సత్యం చీర్ల నాగరాజు. మహేష్. గుంటి సుధాకర్. గుంటి మహేష్. రాజు.ఛీర్ల శాంతన్న సగర, తదితరులు పాల్గొన్నారు...*

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణ సగర సంఘం నిర్వశిస్తున్న శ్రీ శ్రీ శ్రీ భగీరత జయంతి 2025
03/05/2025

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణ సగర సంఘం నిర్వశిస్తున్న శ్రీ శ్రీ శ్రీ భగీరత జయంతి 2025

తెలంగాణ ప్రభుత్వం మరియు తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ నిర్వహించే భగీరత జయంతి ఉత్సవ ఆహ్వానము  Telangana Sagara Sangham T...
03/05/2025

తెలంగాణ ప్రభుత్వం మరియు తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ నిర్వహించే భగీరత జయంతి ఉత్సవ ఆహ్వానము

Telangana Sagara Sangham Telangana Sagara Sangham Shekar Sagara Uppari Satyam Sagar Gowrakka Suresh Sagar Mahender Sagar Sai Ganesh Sagar Lavanya Sriram Sagara Askani Maruthy Sagar Sravanthi Gandla Narlakanti Narendar Sagar

News Paper Clips
06/04/2025

News Paper Clips

06/04/2025

*శ్రీరాముడి చెంత సగరులకు గుర్తింపు*🚩🚩

*రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు సురేష్ సగర కృషి, పట్టుదల ఫలితంతో పట్టు వస్త్రాలు తలంబ్రాల అందజేతకు అధికారిక ప్రకటన*🚩🚩

*అధికారిక ప్రకటనకు కారణమైన సురేష్ సగర, స్రవంతి సగరలకు రాష్ట్ర సగర సంఘం తరపున అభినందనలు*💐💐

సర్వ జగత్తుకు ఆదర్శప్రాయుడైన భగవాన్ శ్రీ రాముడి సేవలో వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న *సగర జాతికి గుర్తింపు లభించింది.* *భగీరథుని వంశం, శ్రీరాముని వారసత్వం మాదే* అని గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో సగర సంఘం నాయకత్వం చేసిన కృషి ఫలితం నేడు లభించింది. భాగ్యనగరం నుంచి అయోధ్య వరకు పాదయాత్ర చేసి ఒక చరిత్ర సృష్టించిన తెలంగాణ సగర సంఘం యువజన విభాగం అధ్యక్షులు *శ్రీ మర్క సురేష్ సగర సంకల్పం* తో గత సంవత్సరం రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులతో పాటు *ఐదుగురు బృందం భాగ్యనగరం నుంచి భద్రాచలం వరకు పాదయాత్ర* నిర్వహించిన విషయం మనకు అందరికీ తెలిసిందే. శ్రీరాముని వారసులుగా ప్రతి సంవత్సరం భద్రాచలంలో జరుగుతున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, వడిబియ్యం అందించే ఆనవాయితీ సగరులకు కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించి చేసిన కృషి ఫలితంగా గత సంవత్సరం *రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీమతి కొండ సురేఖ గారు* అప్పటి *కమిషనర్ కు సిఫారసులు చేయడం జరిగింది* కానీ గత సంవత్సరం అప్పుడే ఎన్నికల కోడ్ రావడంతో అధికారికంగా మనకు ప్రభుత్వం ప్రకటన చేయలేదు. ఈ సంవత్సరం మన రాష్ట్ర సంఘం చేసిన ప్రయత్నంలో మరోసారి మన *రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు శ్రీ మర్క సురేష్ సగర* పట్టుదలతో మన సంకల్పం నెరవేరాలని గత పది రోజుల క్రితం మరోసారి హైదరాబాదు నుంచి భద్రాచలం వరకు పాదయాత్ర ప్రారంభించి విజయవంతంగా ముగించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర సంఘం నాయకత్వం అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రయత్నాలను కొనసాగించింది. మన రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు *శ్రీమతి గాండ్ల స్రవంతి సగర* ప్రభుత్వంలో ఉన్న కీలకమైన నాయకులతో సంప్రదించి *వారి చొరవతో విశేషమైన ప్రయత్నం కొనసాగించారు.* మన రాష్ట్ర సంఘం ముఖ్య సలహాదారులు *శ్రీ ఆర్ బి ఆంజనేయులు సగర* గారు కూడా తనకు ఉన్న పరిచయాలతో ఉన్నతాధికారులతో దేవాదాయ శాఖ అధికారులకు చెప్పించడం కూడా జరిగింది.
అందరి కృషి ఫలితంగా శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో రేపు ఉదయం జరగబోయే *శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి* *సగరుల తరపున మన రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు శ్రీ మరక సురేష్ సగర నవీన సగర దంపతుల* చేత స్వామివారికి *పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అందజేసే ఆనవాయితీని* ఈరోజు సాయంత్రం స్వామివారికి జరిగిన ఎదుర్కోలు సందర్భంగా *రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో భద్రాచలం ఆలయ కమిటీ ఈవో సూచన మేరకు ఆలయ ప్రధాన అర్చకులు బహిరంగంగా ప్రకటన చేశారు.*

*ఇది సగరుల విజయం*
ఈ ప్రకటన రావడానికి అనేకమంది ప్రయత్నం చేయడంలో ఉన్నప్పటికీ కీలకంగా మన *యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మర్క సురేష్ సగర సంకల్పం, కృషి, పట్టుదల ప్రధాన కారణంగా నిలిచాయి.* మరోవైపు ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో తనకున్న సంబంధాలతో *విశేషంగా కృషిచేసిన మన రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి గాండ్ల స్రవంతి సగర కృషి కూడా ప్రధాన కారణమయ్యింది.*

*సురేష్ సగర, స్రవంతి సగర లకు రాష్ట్ర కమిటీ నుంచి ప్రత్యేక అభినందనలు.*

*ఇకముందు భద్రాచలంలో జరిగే ప్రతి ఏటా కళ్యాణ మహోత్సవానికి సగరులుగా రాష్ట్ర సగర సంఘం తరఫున పట్టు వస్త్రాలు తలంబ్రాలను ఇచ్చే ఆనవాయితీని కొనసాగిద్దాం.*

ఈరోజు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అందించే కార్యక్రమంలో రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు *శ్రీ మర్క సురేష్ సగర దంపతులు వారి కుటుంబం* తో పాటు రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు *శ్రీమతి గాండ్ల స్రవంతి సగర దంపతులు* రాష్ట్ర యువజన సంఘం కోశాధికారి *శ్రీ సందుపట్ల సాయి గణేష్ సగర* లు పాల్గొన్నారు.

*జై సగర..🚩* *జై భగీరథ..🚩* *జై శ్రీరామ్..🚩*

Address

Anjaiah Nagar, Gachibowli, Hyderabad/
Balanagar
500032

Alerts

Be the first to know and let us send you an email when Telangana Sagara Sangham posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telangana Sagara Sangham:

Share