Anaparthi Village of Destiny

Anaparthi  Village of Destiny The Destination Never Ends until reach the Goal and successful motivation stories Anaparthy

05/04/2026

వైద్య వృత్తిలోని అక్రమాలను ప్రశ్నిస్తూ, ఒక డాక్టర్ తన మొదటి రోజే ఉద్యోగానికి రాజీనామా చేసిన సాహసోపేత నిర్ణయం నిజంగా గర్వించదగ్గ విషయం. రోగుల ప్రాణాలతో వ్యాపారం చేసే వ్యవస్థను ఎండగట్టడం మనందరికీ స్ఫూర్తిదాయకం.
మానవత్వం మంటగలుస్తున్న ఈ రోజుల్లో, నైతిక విలువలకు కట్టుబడి తన స్వరాన్ని వినిపించిన ఈ వైద్యురాలిని అభినందించాల్సిందే. నిజాయితీ గల సమాజం కోసం మనం కూడా ఇలాంటి అన్యాయాలను ఎదిరించడం ఎంతో అవసరం.
Doctor

ఏపీ రాజధానికి అమరావతి.. మావిగన్.. ఏ పేరు బాగుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి
01/04/2026

ఏపీ రాజధానికి అమరావతి.. మావిగన్.. ఏ పేరు బాగుంది?
మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి

05/02/2026

#శ్రీ_చిదంబరం_గారు చిత్రం తో మంచి విజయాన్ని సాదించాలి అని కోరుకుంటూ

సినిమా అంటే ప్యాషన్ తో ఉన్న
కొత్త యువత కు అవకాశాలు కలిపిస్తూ
కొత్త వారిని ప్రోత్సహిస్తూ

ఎపుడు ప్రజల మనిషిగా తీసిన 5 చిత్రాలుకు కొత్త వారికీ అవకాశం కలిపించిన మంచి మనసున్న వ్యక్తి

కరోనా లాంటి విపత్కర సమయంలో ఎంతో మందికి అన్నదానం చేసి ఆకలి తీర్చిన #అన్నదాత

ప్రతిభ ఉన్న నిరుపేద విద్యార్థులకు చదువు నిమ్మితం
ఆర్థిక సహాయం చేసిన #విద్యాదాత

దివ్యాంగులకు వృద్ధులకు అనాధలకు పేద రోగులకు సేవలందించిన #నిస్వార్థ_సేవకులు

శ్రీ చక్ర ఆయిల్స్ అధినేత #చింతా_గోపాల_కృష్ణ_రెడ్డి_గారు మరియు
నూతన ప్రొడ్యూసర్ #చింతా_వినీష_రెడ్డి గారికి
శుభాకాంక్షలు తెలియజేస్తూ

మీ
డాక్టర్ నల్లమిల్లి ఆది రెడ్డి
వ్యవస్థాపకులు
రైజింగ్ హ్యాండ్స ఫర్ హోప్ అనపర్తి

05/02/2026
ప్రసిద్ధ ఆర్థోపెడిక్‌ డాక్టర్‌ సుంకర వెంకట ఆదినారాయణరావు(96) ఐదున్నర దశాబ్దాల కాలంలో ఆయన 3 లక్షలకు పైగా పోలియో ఆపరేషన్లు...
19/01/2026

ప్రసిద్ధ ఆర్థోపెడిక్‌ డాక్టర్‌ సుంకర వెంకట ఆదినారాయణరావు(96) ఐదున్నర దశాబ్దాల కాలంలో ఆయన 3 లక్షలకు పైగా పోలియో ఆపరేషన్లు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 989 శిబిరాలు నిర్వహించారు. పోలియో ఆపరేషన్లతోపాటు ఇతర చికిత్సలు అందించేందుకు విశాఖలో ప్రేమ ఆస్పత్రిని నెలకొల్పారు. ఇక్కడకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది వచ్చి చికిత్స పొందేవారు. దేశంలోనే ఎముకల వైద్యంలో ఆయన ప్రఖ్యాతి పొందారు. పోలియో వ్యాధిగ్రస్తుల పాలిట దేవుడిగా మారారు. పేదలకు ఉచిత వైద్య సేవలందించే డాక్టరుగా గుర్తింపు పొందారు. 1939 జూన్‌ 30న పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సుంకర శేషమ్మ, కనకం దంపతులకు ఆయన జన్మించారు. తల్లిదండ్రులు స్వాతంత్య్ర సమరయోధులు. నలుగురు కుమారుల్లో ఆయన మూడో సంతానం.

తండ్రి న్యాయవాది కూడా. భీమవరం సర్పంచ్‌గానూ పనిచేశారు. భీమవరంలో పాఠశాల విద్య, విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌, ఆర్థోపెడిక్‌ సర్జరీలో ఎంఎస్ (ఆర్థోపెడిక్స్‌) పూర్తి చేశారు. జర్మనీ వెళ్లి. మైక్రోవస్కులర్‌, హ్యాండ్‌ సర్జరీ అంశాలలో శిక్షణ పొందారు. తిరిగి వచ్చాక విశాఖలోనే వైద్య సేవలు ప్రారంభించారు. ఆంధ్రా మెడికల్‌ కళాశాలలో ట్యూటర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్‌గా పనిచేశారు. విశాఖలోని కింగ్‌ జార్జి ఆసుపత్రిలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, సివిల్‌ సర్జన్‌గా పనిచేశారు. రాణీ చంద్రమణి దేవి హాస్పిటల్‌లో రిహాబిలిటేషన్‌ సెంటర్‌కు సూపరింటెండెంట్‌గా పనిచేశారు. క్రీడలలో ఆసక్తితో వ్యక్తిగత విభాగాలలో విజేతగా నిలిచేవారు. ఆయన సతీమణి ఆర్‌.శశిప్రభను కూడా వైద్యురాలే. ఆయన 1988లో ప్రధానమంత్రి జాతీయ అవార్డు, మద్రాసు తెలుగు అకాడమీ అవార్డు, మహావీర్‌ ఫౌండేషన్‌ జాతీయ అవార్డు, ‘నేషనల్‌ అవార్డు ఫర్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌-2013’, 2014లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ నుంచి జాతీయ అవార్డును అందుకున్నారు. దేశ, విదేశాల్లోనూ ఖ్యాతి పొందారు. ప్రస్తుతం ఆయన విశాఖలో ప్రీ పోలియో సర్జికల్‌ అండ్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ మేనేజింగ్‌ ట్రస్టీగా, ప్రేమ గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ అండ్‌ ఇనిస్టిట్యూషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌గా కొనసాగుతున్నారు.

20/12/2025

అంబేద్కర్ కోనసీమ జిల్లా : రామచంద్రపురం

రామచంద్రపురం ఓ ప్రయివేట్ స్కూల్ లో 10వ తరగతి చదువుతున్న బాలిక మృతి....

పసలపూడి గ్రామానికి చెందిన నల్లమిల్లి సిరి (14) స్థానిక ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి చదువుతోంది..

స్కూల్లో ఉండగానే సృహ తప్పి పడిపోవడంతో హుటా హుటిన ఏరియా ఆసుపత్రి కి తరలించిన స్కూల్ సిబ్బంది...

అప్పటికే బాలిక మృతి చెందినట్లు దృవీకరించిన వైద్యులు...

గుండె పోటు తో మరణించినట్లు భావిస్తున్న వైద్యులు...

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రామచంద్రపురం పోలీసులు....

07/12/2025

No. 19
Vote for pharmacy association
Nallamilli Adi reddy

స్క్రబ్ టైఫస్ అనేది ఓరియెంటియా సుత్సుగాముషి అనే బాక్టీరియా వల్ల వచ్చే ఒక తీవ్రమైన జ్వరం. ఈ వ్యాధి సోకిన లార్వల్ మైట్స్ క...
02/12/2025

స్క్రబ్ టైఫస్ అనేది ఓరియెంటియా సుత్సుగాముషి అనే బాక్టీరియా వల్ల వచ్చే ఒక తీవ్రమైన జ్వరం. ఈ వ్యాధి సోకిన లార్వల్ మైట్స్ కరవడం ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. సాధారణ జ్వరం, జలుబు, వణుకు నల్లని మచ్చ, దద్దుర్లు ఉంటే వైద్యులను సంప్రదించాలి.
స్క్రబ్ టైఫస్ అంటే ఏమిటి?
స్క్రబ్ టైఫస్ అనేది ఓరియంటియా సుట్సుగముషి (Orientia tsutsugamushi) అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే అంటువ్యాధి. ఈ బ్యాక్టీరియా చిగ్గర్స్ అని పిలువబడే, నల్లి (మైట్) తరహాలో ఉండే అతి చిన్న పురుగుల లార్వాల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఈ పురుగులు (చిగ్గర్స్) సాధారణంగా పొదలు, గడ్డి, అటవీ ప్రాంతాలు, తోటలు, చెత్తాచెదారం ఉన్న ప్రదేశాలలో కనిపిస్తాయి. పొలాల్లో పనిచేసేవారు.. తోటల పెంపకందారులు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
దద్దుర్లు, తీవ్రమైన జ్వరం:
ఈ వ్యాధి సోకినప్పుడు లక్షణాలు సాధారణంగా కీటకం కుట్టిన 6 నుంచి 21 రోజులలోపు (సగటున 10-12 రోజులు) కనిపిస్తాయి. అయితే సరైన సమయంలో గుర్తించకపోతే.. తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్క్రబ్ టైఫస్‌కు చికిత్స అందించడంలో ఆలస్యం ప్రాణాంతకం కావచ్చని అంటున్నారు. జ్వరం లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స ప్రారంభిస్తే.. స్క్రబ్ టైఫస్ మరణాల రేటు 2% కన్నా తక్కువగా ఉంటుంది. చికిత్స ఆలస్యం అయినప్పుడు మరణాల శాతం 6% నుంచి 30% వరకు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ వ్యాధికి యాంటీ బయాటిక్స్ ప్రధాన చికిత్స. ముఖ్యంగా డాక్సీసైక్లిన్ (Doxycycline) ను అన్ని వయసుల వారికి సిఫార్సు చేస్తారు. చికిత్స ప్రారంభించిన 24 నుంచి 48 గంటలలోపు రోగులు కోలుకోవడం మొదలవుతుంది. అయితే.. వ్యాధి మళ్లీ రాకుండా ఉండేందుకు యాంటీ బయాటిక్ కోర్సును పూర్తిగా తీసుకోవడం చాలా ముఖ్యం. గర్భిణీ స్త్రీలలో అజిత్రోమైసిన్ (Azithromycin)ను ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు.
ఏపీలో ఆందోళనకరం:రాష్ట్రవ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతున్నప్పటికీ.. కొన్ని జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. చిత్తూరు (379), కాకినాడ (141), విశాఖపట్నం (123) జిల్లాల్లో కేసుల సంఖ్య అధికంగా నమోదైంది. చాలామంది డాక్టర్లు జ్వరం వచ్చినప్పుడు మొదట డెంగీ, మలేరియా పరీక్షలు చేయించి, జ్వరం తగ్గకపోతేనే స్క్రబ్ టైఫస్ గురించి ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు అందుబాటులో లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో సరైన సమయానికి కేసులు గుర్తించడం కష్టమవుతోంది.

 #అనపర్తి పరిసర ప్రాంతాలు ప్రజలు కు 24/7 అందుబాటులో ఏ.సి అంబులెన్స్ సేవలు**Cell- 9059554108* , *9032554108* #సత్య_సాయి_అ...
30/11/2025

#అనపర్తి పరిసర ప్రాంతాలు ప్రజలు కు 24/7 అందుబాటులో ఏ.సి అంబులెన్స్ సేవలు*

*Cell- 9059554108* , *9032554108*

#సత్య_సాయి_అనపర్తి_అంబులెన్స్_సర్వీసెస్
#ఎ.సి*

అత్యవసర సమయంలో ప్రతి ఒక్కరకి ఉపయోగపడే సమాచారం*దయచేసి అందరు షేర్ చేయండి*

 #ఉచిత_సర్జరీ_లు  #డిసెంబర్ 1  #నుండిఅనపర్తి రమాదేవి హాస్పిటల్ వారి 6వ వార్షికోత్సవ సందర్బంగా ఉచిత సర్జరీలు చేయబడును (కే...
29/11/2025

#ఉచిత_సర్జరీ_లు #డిసెంబర్ 1 #నుండి

అనపర్తి రమాదేవి హాస్పిటల్ వారి 6వ వార్షికోత్సవ సందర్బంగా ఉచిత సర్జరీలు చేయబడును
(కేవలం మత్తు డాక్టర్ మరియు మందులకు మాత్రమే తీసుకోబడును )

మరిన్ని వివరాల కోసం సంప్రదించండి

రమాదేవి హాస్పిటల్
ఓల్డ్ రాము డాక్టర్ హాస్పిటల్ క్యాంపస్
ధరణికోట , అనపర్తి

9133391310
9133391311
9133391303

Address

Anaparthi
533342

Telephone

+919533252222

Website

Alerts

Be the first to know and let us send you an email when Anaparthi Village of Destiny posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share