Indian pharmacist Association-IPA-Andhra Pradesh

Indian pharmacist Association-IPA-Andhra Pradesh Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Indian pharmacist Association-IPA-Andhra Pradesh, Community Service, RAMALAYAM Street OLD TOWN, Anaparthi.

This Group only for Pharmacy Profession graduates , D.Pham., B.Pham., M Pharm., Pharma D, PhD Candidates and support for Pharmacist,Pharma industry Employees,Students ,Jobs Information,Medical Help Line ,Educational Details and Pharmacy related News

17/07/2025

17/07/2025

Walk-in Interview on 11th August (Sunday) @ Eco Paradise Resort Rangpo.Swiss Garnier Genexiaa Sciences Pvt Ltd (Sikkim).
07/08/2024

Walk-in Interview on 11th August (Sunday) @ Eco Paradise Resort Rangpo.

Swiss Garnier Genexiaa Sciences Pvt Ltd (Sikkim).

07/02/2023
13/01/2023

#ఫార్మసీ_రిజిస్ట్రేషన్_మరియు_రెన్యువల్_సమస్యలపై_వినతిపత్రం_అందించిన #ఇండియన్_ఫార్మసిస్ట్_అసోసియేషన్_ఆంధ్రప్రదేశ్_రాష్ట్ర_అధ్యక్షులు_నల్లమిల్లి_ఆదిరెడ్డి*

గుంటూరు లో ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ మరియు రెన్యువల్ సమస్యలపై రిజిస్ట్రార్ రామమూర్తి గారికి ఇండియన్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు నల్లమిల్లి ఆదిరెడ్డి వినతిపత్రం అందచేయడం జరగింది . ఫార్మసిస్టులు వారి రెన్యువల్స్ మరియు రిజిస్ట్రేషన్ లో జాప్యం జరగుతుంది అని, రాష్ట్రం నలుమూలల నుండి ఎంతో మంది విద్యార్థులు , ఉద్యోగస్తులు , ఫార్మసిస్టులు తరుచూ ఆంధ్ర ప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది అని ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారని , ఫార్మసిస్ట్ లు ఎదుర్కొంటున్న సమస్యలు ను ప్రభుత్వం వెంటనే పరిష్కారానికి కృషి చెయ్యాలని కోరడం జరిగింది. రాష్ట్రంలో ఫార్మసీ చట్టం తూచా తప్పకుండా అమలు అయ్యేలా , ఫార్మసీ కౌన్సిల్ ఎలక్షన్స్ జరిపించి రాజ్యాంగబద్ధంగా ఒత్తిడి తీసుకొస్తామని ఉద్యమాలు చేస్తాము అవసరమైతే ప్రాణత్యాగం అయిన చేస్తాం అని తెలపడం జరగింది

While saying this, although compounders doesn't exists these days, it is adversely remarked on   by .  strongly condemn ...
30/08/2022

While saying this, although compounders doesn't exists these days, it is adversely remarked on by .

strongly condemn this derogatory remarks by and ask for unconditional apology from him on this.

are https://t.co/zS748ceGrm

30/08/2022

About Pharma.D

డాక్టర్స్ డే శుభాకాంక్షలు              మందులు రోగాన్ని నయం చేస్తాయి.. డాక్టర్లు మాత్రమే రోగాల్ని నయం చేయగలుగుతారు... కోవ...
01/07/2022

డాక్టర్స్ డే శుభాకాంక్షలు మందులు రోగాన్ని నయం చేస్తాయి.. డాక్టర్లు మాత్రమే రోగాల్ని నయం చేయగలుగుతారు... కోవిడ్ సందర్బంగా వైద్య సేవలు అందించిన డాక్టర్లకు ధన్యవాదములు. ఈ యజ్ఞంలో చాలామంది ప్రాణాలను కాపాడి మరణించిన డాక్టర్లకు జోహార్లు... డాక్టర్స్ డే సందర్బంగా కడపలోని కొంత మంది డాక్టర్స్ ను ,, ఇండియన్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ సన్మానించడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమాన్ని రాష్ట్ర కోశాధికారి మద్దెల. సురేష్ బాబు,, IPA జిల్లా అధ్యక్షులు కోట. సుబ్బారావు, జిల్లా కోశాధికారి P.సుధాకర్, నగర కమిటీ అధ్యక్షులు v. ఉమామహేశ్వర్రావు గారు, శోభా ఫార్మసిస్ట్,,నాగజ్యోతి M.. కడప టౌన్ రిటైల్ అసోసియేషన్ సెక్రటరీ మస్తాన్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.. సన్మానితులు :::: Dr. Dinash గ్యాస్ట్రో Dr. Niranjan reddy కార్డిలజీ Dr. Krishna kishore సర్జరీ Dr. Hemanth చిల్డ్రన్స్ Dr. Ganesh న్యూరో Dr. Anil kumar reddy ఆర్థో

Please share valuable information ...మిత్రులారా!  పైన పోస్ట్ లోని  సర్క్యులర్ సారాంశం ఏమిటంటే...ఇది 13.6.2022 న జాయింట్ ...
14/06/2022

Please share valuable information ...

మిత్రులారా!

పైన పోస్ట్ లోని సర్క్యులర్ సారాంశం ఏమిటంటే...

ఇది 13.6.2022 న
జాయింట్ డైరెక్టర్, DCA, గుంటూరు,
AD, ఒంగోలు గార్ల ద్వారా
ఒంగోలు DI గారికి
వాట్సప్ ద్వారా అందిన సమాచారం.

బీహార్ రాష్టంలోని గయా పట్టణంలో ఆ రాష్ట్ర పోలీసు + DCA చేపట్టిన తనిఖీల్లో బయటపడిన FAKE మందులు ఏమిటంటే...

డైక్లోఫినాక్ ఇంజెక్షన్ లు 25 లక్షలు...
10 లక్షల విలువైన కోడిన్ సిరప్ FAKE నిల్వలు బయటపడ్డాయట.

(బ్రాండ్ నేమ్, కాంబినేషన్, బ్యాచ్ నెంబర్ మొదలగు సమాచారం పై సర్క్యులర్ లో చూడండి.)

ఆ బ్యాచ్ కు చెందిన మందులు మీవద్ద ఎవరిదగ్గరైనా ఉంటే వెంటనే అమ్మకాలు ఆపివేసి మార్కెట్ లో ఉంటే వెంటనే ఆ మందులను వెనక్కు తెప్పించి, ఆ వివరాలను డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఆఫీసులో అందించాలని సారాంశం.

# # # # # #

ఆ ఫేక్ మందులు ఏ ఏ రాష్ట్రాల్లో, ఏ ఏ జిల్లాల్లో, ఏ ఏ కెమిస్ట్ లు, డాక్టర్ల దగ్గర ఉన్నాయో తెలియదు.
అసలు ఈ పాటికి ఉన్నాయో అయిపోయినాయో కూడా తెలియదు.

బీహార్ నుండి మన జిల్లాకు వచ్చే మధ్యలో ఎన్ని పట్టణాల్లో డెలివరీ ఇచ్చుకుంటా వచ్చారో...

పట్టు బడరు. పట్టు బడిన వారికి కఠిన శిక్షలు ఉండవు. కోర్టులో సాగుతూనే ఉంటాయి కేసులు.

ఏదేమైనా ....మీదగ్గరుంటే ఆ మందులు ఉంటే వెంటనే DI ఆఫీసుకు సమాచారం పంపండి.

ఇట్లు...
శ్రీధర్ పావులూరి

*ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షులుగా మంటూ పటేల్*- శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఇండియన్ ఫార...
10/04/2022

*ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షులుగా మంటూ పటేల్*

- శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఇండియన్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లమిల్లి ఆది రెడ్డి , డాక్టర్ శివ కుమార్ తేజావత్

ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన మంటూ పటేల్ గారికి శుభాకాంక్షలు తెలిపిన ఇండియన్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నల్లమిల్లి ఆదిరెడ్డి , డాక్టర్ శివ కుమార్ తేజావత్
గుజరాత్ కి చెందిన మంటూ పటేల్ ఉన్నత విద్యను పూర్తి చేసి గుజరాత్ లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి మరియు ఇండియన్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ గుజరాత్ రాష్ట్ర అధ్యక్షులుగా ఫార్మసీ చట్టాల కోసం ఆయన చేసినటువంటి కృషి గొప్పది అన్నారు, మంటూ పటేల్ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఫార్మసీ చట్టాల కోసం కృషి చేయాలని శ్రీ నల్లమిల్లి ఆది రెడ్డి , డాక్టర్ శివ కుమార్ తేజావత్ కోరారు . ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఫార్మసీ చట్టాలు నిర్వీర్యంపై పోరాడుతున్న తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఫార్మసిస్ట్ కు అండగా ఉండాలని , ఫార్మసీ చట్టాలు అమలయ్యేలా కృషి చేయాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నల్లమిల్లి ఆదిరెడ్డి డాక్టర్ శివ కుమార్ నూతనంగా ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షులుగా నియమితులైన మంటూ పటేల్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఐ పి ఎ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నల్లమిల్లి ఆది రెడ్డి గారు మాట్లాడుతూ మంటూ పటేల్ గుజరాత్ ఫార్మసీ కౌన్సిల్ అధ్యక్షులుగా ఉన్న సమయంలో నిర్ణయాత్మక మార్పులు చేశారని ఫార్మసిస్ట్ లు అభివృద్ధి పురోగతికి కృషి చేశారని ఆయన కొనియాడారు ఆయన చేసినటువంటి నిర్ణయాత్మక మార్పుల వల్లనే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కి అధ్యక్షుడిగా నియమితులయ్యారు కొనియాడారు. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లో కూడా నిర్ణయాత్మక మార్పులు తెచ్చి ఫార్మసీ రంగం అభివృద్ధి కొరకు కృషి చేయాలని కోరారు
ఈ సందర్భంగా తెలంగాణ ఐ. పి. ఎ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శివ కుమార్ తేజావత్ మాట్లాడుతూ అతి తక్కువ సమయంలోనే గుజరాత్ లో ఫార్మసీ చట్టాల కోసం అమలయ్యే విధంగా కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తిని ఆ రాష్ట్రంలో ఫార్మసీ సమస్యల మీద విద్యార్థులకు ఫార్మా శిష్యులకు అండగా నిలుస్తూ ఆయన చేసినటువంటి కృషి ఎనలేనిది ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేశారు

19/03/2022

#ఇండియన్_ఫార్మసిస్ట్_అసోసియేషన్ #ఆంధ్ర_ప్రదేశ్_కడప_జిల్లా
రాష్ట్ర కోశాధికారి సురేష్ బాబు గారు , కడప జిల్లా అధ్యక్షులు కొన సుబ్బారావు గారు వారి టీమ్ సభ్యులు ఆధ్వర్యంలో

కడప లో జరగిన #ఫార్మసీ_యాట్_1948
#డైమండ్_జూబ్లీ_సెలబ్రేషన్స్_ఫంక్షన్ లో రాష్ట్ర స్థాయి మీటింగ్ సుమారు 700 ఫార్మసిస్ట్ ల మధ్య వైభవంగా జరిగింది

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వివిధ ఫార్మసీ రంగం చెందిన రాష్ట్ర అధ్యక్షులు మరియు నాయకులు ఫార్మసీ రంగం అభివృద్ధి కొరకు మీరు ఇచ్చినటువంటి ముఖ్యమైన సందేశాలు సలహాలు సూచనలు కు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ...

ఈ ప్రోగ్రాం ని రాష్ట్ర స్థాయి లో ఫార్మసీ రంగం గర్వపడే విధంగా మా ఐ.పి.ఏ సురేష్ బాబు గారికి , సుబ్బా రావు గారికి మరియు జిల్లా నాయుకులకు నా తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ....

రాష్ట్రం లో ఫార్మసీ యాక్ట్ అమలు అవ్వాలంటే ప్రతి ఫార్మసిస్ట్ వారి సర్టిఫికేట్ రెంట్ ఇవ్వడం మానేసి మనలో చైతన్యం కలగాలి అని తద్వారా మన ఫార్మసీ వృత్తి అభిరుద్ది పడేవిదంగ కూడా కృషి చెయ్యాలి అని , డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చదివిన వాళ్ళని జనరల్ డ్యూటీ డాక్టర్స్ గా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో నియమించాలని , మందులు పంపిణీ చేసే ప్రతి గవర్నమెంట్ స్కీం లో పూర్తి స్థాయిలో ఫార్మాసిస్ట్ లకు గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ,
ఫార్మా కంపెనీలో ఫార్మసిస్ట్ లకు మాత్రమే అత్యధిక ఉద్యోగాల నియమించాలని ఇండియన్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లమిల్లి ఆదిరెడ్డి గారు కోరడం జరిగింది

Address

RAMALAYAM Street OLD TOWN
Anaparthi
533342

Alerts

Be the first to know and let us send you an email when Indian pharmacist Association-IPA-Andhra Pradesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Indian pharmacist Association-IPA-Andhra Pradesh:

Share