SFI Anantapur

SFI Anantapur student organization study strugle

28/08/2026
ఈరోజు సాక్షి దినపత్రికలో అనంతపురం జిల్లాలో శ్రీ చైతన్య విద్యాసంస్థల విద్య మాఫియా దోపిడీ కి వ్యతిరేకంగా ప్రత్యేక ఆర్టికల్...
14/06/2026

ఈరోజు సాక్షి దినపత్రికలో అనంతపురం జిల్లాలో శ్రీ చైతన్య విద్యాసంస్థల విద్య మాఫియా దోపిడీ కి వ్యతిరేకంగా ప్రత్యేక ఆర్టికల్ రాయడం జరిగింది
SFI జిల్లా ప్రధాన కార్యదర్శి
ఓతురు పరమేష్

12/06/2026

"The Chaitanya educational institutions operating in violation of government regulations should be sealed. Appropriate action must be taken against those managing the Sri Chaitanya ATP-3 shifting at the CBSE Chaitanya School without the requisite governmental approvals. Furthermore, an inquiry is warranted regarding the lack of punitive measures against Chaitanya educational institutions for collecting fifty thousand rupees from students' parents under the pretext of 'CAT booking.' Institutions found to be soliciting funds from parents for school building construction prior to its commencement should be immediately sealed."

"These statements were made by SFI District General Secretary Oturu Paramesh during a media address at a student organizations' demonstration held in front of the Sri Chaitanya CBSE School in Anantapur."

11/06/2026

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న చైతన్య విద్యాసంస్థలు సీజ్ చేయాలి

కాట్ బుకింగ్ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి 50 వేల రూపాయలు వసూలు చేస్తున్న చైతన్య విద్యాసంస్థలపై చర్యలు ఎందుకు లేవు

పాఠశాల భవనం నిర్మాణం కాకముందే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్న చైతన్య విద్యాసంస్థలను సీజ్ చేయాలి

అనంతపురం జిల్లా డీఈఓ కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది

08/06/2026

అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల తినే మధ్యాహ్న భోజనంలో పథకాన్ని కాంట్రాక్టర్లు కు అప్పగించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది

స్మార్ట్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలీ ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుకూలంగా ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనం మెస్ చార్జీలు పెంచాలని

మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచాలి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించాలని ఎస్ఎఫ్ఐ, మధ్యాహ్న భోజనం కార్మికులుCITU ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించి జిల్లా కలెక్టర్ ఆనంద్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది

SFI పోరాట ఫలితంగా
07/06/2026

SFI పోరాట ఫలితంగా

గుత్తి పట్టణంలో బిసి సంక్షేమ హాస్టల్ ఏర్పాటు చేయాలి పాఠశాల నుంచి హాస్టల్ 3KM  దూరం దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ బస్సు ఏర్పా...
04/06/2026

గుత్తి పట్టణంలో బిసి సంక్షేమ హాస్టల్ ఏర్పాటు చేయాలి

పాఠశాల నుంచి హాస్టల్ 3KM దూరం దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ బస్సు ఏర్పాటు

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించి ఆర్డిఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది

*విషయం*:- గుత్తి మండల కేంద్రంలో బీసీ సంక్షేమ హాస్టల్ ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతూరు పరమేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ యాదవ్,వెంకటేష్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో వెనకబడిన ప్రాంతంలో గుత్తి పట్టణం ఒకటి ఈ ప్రాంతంలో ఎక్కువమంది వలసల వెళుతూ ఉంటారు గుత్తి పట్టణం కర్నూలు జిల్లా సరిహద్దు ప్రాంతం కావడం వల్ల ఎక్కువమంది విద్యార్థులు గుత్తి పట్టణానికి చదువుకోవడానికి వస్తూ ఉంటారు ఇలాంటి గుత్తి పట్నంలో పాఠశాల కు అనుబంధంగా బిసి సంక్షేమ హాస్టల్ లేకపోవడం చాలా దౌర్భాగ్యమైన విషయం గుత్తి మండల కేంద్రంలో గర్ల్స్ హైస్కూల్లో దాదాపుగా 1000 మందికి పైబడి విద్యార్థినిలు చదువుతూ ఉంటారు గుత్తి కోట పాఠశాలలో ఎక్కువమంది విద్యార్థులు ఉంటారు ఇలాంటి ప్రధానమైన మండల కేంద్రంలో బీసీ సంక్షేమ హాస్టల్ లేకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు మరి కొంతమంది పాఠశాలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎస్టి సంక్షేమ హాస్టల్లో ఉండి చదువుతున్నారు ఈ ఎస్టీ సంక్షేమ హాస్టల్లో మూడో తరగతి నుంచి పదవ తరగతి వరకు దాదాపు 250 మంది విద్యార్థులు ఉంటున్నారు విద్యార్థులు హాస్టల్ నుండి పాఠశాలకు బయలుదేరాలంటే ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు ప్రారంభిస్తే హాస్టల్ కీ పోవడానికి మూడు కిలోమీటర్లు రావడానికి మూడు కిలోమీటర్లు రోజుకు దాదాపు ఆరు కిలోమీటర్ల దూరం నడిచి పాఠశాల విద్యను అభ్యసించవలసిన పరిస్థితి గుత్తి మండల కేంద్రంలో విద్యార్థినిలకు ఏర్పడింది పాఠశాల నుండి హాస్టల్ కి వెళ్లే సందర్భంలో సింగల్ రోడ్డు కావడం వలన ముళ్ళపదలో కంపచెట్లు రహదారి సరిగా లేకపోవడం వలన రహదారి మధ్యలో మద్యం సేవించిన వారు ఆకతాయిలు యూటీజింగ్ ర్యాగింగ్ చేయడం వల్ల విద్యార్థినిలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ ఇబ్బందులు అధికారులు దృష్టిలో ఉంచుకొని అనేకమార్లు స్థానిక ప్రజాప్రతినిధులకు ఆర్టీసీ అధికారులకు మరియు సంక్షేమ శాఖ అధికారులు ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయాలని వినతి పత్రాలు అందజేసినప్పటికీ అధికారులు ఏమాత్రం స్పందించడం లేదు ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని గర్ల్స్ హై స్కూల్ పక్కనే గతంలో బీసీ బాయ్స్ హాస్టల్ ఉండేది అనేక కారణాలు వలన బీసీ హాస్టల్ మూసి వేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి భవనం ఖాళీగా ఉన్నది అధికారులు చొరవ తీసుకొని గర్ల్స్ హై స్కూల్ పక్కన (గుత్తి పోలీస్ స్టేషన్ పక్కన) ఖాళీగా ఉన్న భవనంలో బీసీ గర్ల్స్ హాస్టల్ లో ఏర్పాటు చెయ్యాలి విద్యార్థులకు రక్షణ కల్పించాలి అదేవిధంగా పేద మధ్యతరగతి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చదువుకోవడానికి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ధను, చిన్న,సాయి, మురళి, చందు,సంతోష్ తదితరు నాయకులు పాల్గొన్నారు

Address

Anantapur

Telephone

+919949951084

Website

Alerts

Be the first to know and let us send you an email when SFI Anantapur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share