25/08/2024
అంతర్జాతీయ వాల్బాల్ పోటీల్లో విరిసిన ఆణిముత్యాలు.
నేపాల్ దేశంలోని ఫోఖ్రా పట్టణంలో వాల్ బాల్ అంతర్జాతీయ పోటీలు ఇండియన్ వాల్ బాల్ అసోసియేషన్ నిర్వహించగా ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని కడప జిల్లా క్రీడాకారులు ముగ్గురు క్రీడాకారులు అంతర్జాతీయ పోటీలకు ఎంపిక అయ్యారు. నేపాల్,బాంగ్లాదేశ్, భూటాన్,ఇండియన్ దేశాలనుoచి సుమారుగా 200 మంది క్రీడాకారులు హాజరు కాగా మినీ సబ్ జూనియర్ 14. బిభాగంలో టి.కె.అభినాయ్ మంచి ప్రతిభ కనపరిచి నేపాల్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 10 - 6 పాయింట్స్ తో అభినాయ్ గెలుపొంది బంగారు పతకం సాధించాడు. అలాగే.సబ్ జూనియర్ వాల్ బాల్ పోటీల్లో ఆకుల శ్రీకాంత్ ఫైనల్లో భూటాన్ తో తలపడగా 15-10 పాయింట్స్ తో గెలుపు పొంది బంగారు పతకం సాధించాడు. జూనియర్ 19.విభాగంలో తలరి నర్సింహ రావు మంచి ప్రతిభ కనపరిచి బాంగ్లాదేశ్ తో ఫైనల్ తలపడి 12-15 పాయింట్స్ తో గెలుపొంది బంగారు పతకం సాధించాడు. వీరిని వాల్ బాల్ ఇండియన్ అసోసియేషన్ అధ్యక్షులు ఆశిష్ గారు వాల్ బాల్ ఇండియన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నందు సింగ్ కౌరి మరియు ఆంధ్రప్రదేశ్ వాల్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చందన అన్వర్ బాషా గారు క్రీడకారుని అభినందించారు. కడప జిల్లా వాల్ బాల్ ప్రధాన కార్యదర్శి మునీల ప్రసాద్ గారు క్రీడాకారుల పట్ల సంతోషం వ్యక్తపరిచి అభినందించారు.వీరి కోచ్ గా యమ్. సంతోష్ కుమార్ వ్యవహరించారు వీరికి ఆంధ్రప్రదేశ్ వాల్బాల్ అసోసియేషన్ తరపున ప్రధాన కార్యదర్శి మరియు కడప జిల్లా కార్యదర్శి అభినందానాలు తెలిపారు.