24/02/2022
LAW OF LIBERT- 4.
Now the works of the flesh are manifest, and they are these: adultery, fornication, uncleanness, lasciviousness, Galatians 5:19.
idolatry, witchcraft, hatred, quarreling, rivalry, wrath, strife, seditions, heresies, Galatians 5:20.
envying, murders, drunkenness, revelings, and such like. About these things I tell you again, as I have also told you in times past, that those who do such things shall not inherit the Kingdom of God. Galatians 5:21.
For the earnest expectation of the creature waiteth for the manifestation of the sons of God Romans 8:19.
For the creature was made subject to vanity, not willingly, but by reason of Him who hath subjected the same in hope,
Romans 8:20.
because the creature itself also shall be delivered from the bo***ge of corruption into the glorious liberty of the children of God Romans 8:21.
But whoso looketh into the perfect law of liberty and continueth therein, he being not a forgetful hearer but a doer of the work, this man shall be blessed in his deed. James 1:25.
as free, and not using your liberty as a cloak for maliciousness, but as the servants of God. 1.Peter 2:16.
Let not sin therefore reign in your mortal body, that ye should obey it in the lusts thereof. Romans 6:12.
Now the Lord is that Spirit; and where the Spirit of the Lord is, there is liberty. 2.Corinthians 3:17.
But we all, with uncovered face beholding as in a glass the glory of the Lord, are changed into the same image, from glory to glory, even as by the Spirit of the Lord. 2.Corinthians 3:18.
TELUGU VERSION FOLLOWS.
శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. గలతీయులకు 5:19,20&21.
దేవుని కుమారుల ప్రత్యక్షతకొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. రోమీయులకు 8:19.
ఏలయనగా సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణకలదై, రోమీయులకు 8:20.
(ఆదికాండము 3:17-19, ఆదికాండము 5:29, ప్రసంగి 1:2.)
స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా వ్యర్థపరచబడెను. రోమీయులకు 8:21.
అయితే స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును.
యాకోబు 1:25.
స్వతంత్రులై యుండియు దుష్టత్వమును కప్పి పెట్టుటకు మీ స్వాతంత్ర్య మును వినియోగపరచక, దేవునికి దాసులమని లోబడి యుండుడి. 1 పేతురు 2:16.
కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి. రోమీయులకు 6;12.
ప్రభువే ఆత్మ ప్రభువుయొక్క ఆత్మయెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. 2 కొరింథీయులకు 3:17.
మన మందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలిక గానే మార్చబడుచున్నాము. 2 కొరింథీయులకు 3:18.
(నిర్గమకాండము 16:7, నిర్గమకాండము 24:17.).
"LORDJESUSSAVESYOU" 24-02-2022.