20/03/2024
మజ్జిగ చలివేంద్రం 2024 సేవకు ఆహ్వానం
ది.07.4.2024 నుంచి 06.05.2024 వరకు
నమస్కారం...భక్తమహాశయులకు విజ్ఞప్తి !
మజ్జిగ చలివేద్రం దాత సుఖీభవ 🙏
శ్లో|| అన్నోదక సమం దానం న ద్వాదశ్యా: పరం వ్రతం..
అన్నదానం, చలివేంద్రం దానాలను మించిన దానం,
ద్వాదశీ వ్రతాన్ని మించిన వ్రతం, వేంకటేశ సమం దైవం కలియుగంలో లేదు అని శాస్త్ర వచనం.
"మానవసేవే మాధవసేవ - గోసేవే గోవిందుని సేవ " అంటూ గత 5 సంవత్సరాలుగా దాతలు సహకారం తో చల్లని మజ్జిగ చలివేంద్రం సేవ నెలరోజులు నిర్వహించబడుచున్నది. ఈ సంవత్సరం ది.07.04.2024 నుంచి 06.05.2024 వరకూ చింతలూరు శ్రీ నూకాంబికా అమ్మవారి జాతరకు విచ్చేసే తీర్థ యాత్రీకుల దాహార్తిని తీర్చుటకొరకు దాతలు సహకారం తో మన చింతలూరు గోపరంధామం గోశాల & అన్నదానం ట్రస్టు వారిచే శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామని ఇందుమూలంగా తెలియపరుస్తున్నాము. సుమారు 75 వేల మంది తీర్థయాత్రీకులకు సరిపడే మజ్జిగ చలివేంద్రం నిర్వహణ అంచనా వ్యయం సుమారు రూ.2,25,000/- (300 పెరుగు బకెట్లు).
ఈ మజ్జిగ చలివేంద్రం నెలరోజుల నిర్వహణ కొరకు ఆసక్తిగల దాతలు నుంచి విరాళాలు కోరుచున్నాము. ఆసక్తి గల దాతలు యథాశక్తిన పెరుగు బకెట్ రూపంలో విరాళాలు అందించి సహకరించవలసిందిగా ప్రార్థన.
ఇన్ని సంవత్సరాలు ఎందరో దాతలు ప్రతీ సంవత్సరం శ్రీ నూకాలమ్మవారి జాతరకు ఎండలను సైతం లెక్కచేయకుండా చింతలూరు వచ్చే యాత్రీకులకు ఈ చలివేంద్రం ద్వారా చల్లని మజ్జిగ అందిస్తున్నారు. ఈ సందర్భంగా విరాళాలు అందిస్తున్న దాతలకు - సేవకులకు అనేకానేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.
పెరుగుతున్న ఎండల దృష్ట్యా ఈ సంవత్సరం సుమారు 300 పెరుగు బకెట్లు ను మజ్జిగచేసి ఈ చలివేంద్రం నిర్వహించడం జరుగుతుంది. ఒక్కో పెరుగు బకెట్ కు రూ.750/- ఖర్చు అవుతుంది దీనితో సుమారు 250-300 మంది దాహార్తులు మజ్జిగగా త్రాగుతారు. ఇలా యధాశక్తిన మీ శక్త్యానుసారం పెరుగు బకెట్ రూపంలో విరాళాలు అందించి ఈ చలివేంద్రం నిర్వహణకు ప్రోత్సాహం అందించవలసిందిగా కోరుచున్నాము.
ఈ చలివేంద్రం 30రోజులు నిర్వహించబడుతుంది. 75 వేలకు పైన తీర్థయాత్రీకులకు, బాటసారులకు మండు వేసవిలో దాహం తీరుస్తుంది. ది.07.04.2024 నుంచి 06.05.2024 వరకూ నిర్వహించబడుతుంది.
మానవాళికి మహోపకారం ఈ చలివేంద్రం సేవ.
చలివేంద్రం నిర్వహణ దాత! సుఖీభవ!
మరిన్ని వివరాలకు సంప్రదించండి : 9398635959,9490710837, 8639022884, 8309815685.
మీ విరాళాలు నేరుగా ట్రస్టు అకౌంట్ లో జమ చేయగలరు.
For Google pay : 9398635959
UPI ID : 9398635959@okbizaxis
Goparamdhamam Gosala & Annadanam Trust
Current A/c no: 919020061556750
Axis Bank Ltd.
ALAMURU branch
ALAMURU
EAST GODAVARI Dist
IFSC: UTIB0000353
Mobile: 9398635959
E-mail : [email protected]
Note : ఆడిట్ కొరకు దయచేసి విరాళాలు అందించిన దాతలు తమ వివరాలను వాట్సాప్ లేదా మెసేజ్ చేసి తెలుపగలరు.
చలివేంద్రం నిర్వహణ గత 5 సంవత్సరాల పాత చిత్రాలను ఈ ఆల్బమ్ లో వీక్షించగలరు :
https://photos.app.goo.gl/eZTAD4herPKkC9on8