UTF Bapatla

UTF Bapatla This is Bapatla District Page of APUTF

12/04/2026

విశ్వం వయస్సు 13.82 (సుమారు 1400 కోట్ల సంవత్సరాలు)బిలియన్ సంవత్సరాలు
భూమి వయస్సు 4.54 (450 కోట్ల సంవత్సరాలు)బిలియన్ సంవత్సరాలు
మానవ ఆవిర్భావం 2,00,000 సంవత్సరాలు.
దైవ భావన 10,000 సంవత్సరాలు.
దేవతా భావన 8,000 సంవత్సరాలు.
వైదిక మతం 3,500 సంవత్సరాలు.
జోరాస్త్రినియం 4000 సంవత్సరాలు.
జుడాయిజం 4000 సంవత్సరాలు.
బౌద్ధం 2,600 సంవత్సరాలు.
కన్ఫ్యూియనిజం 2,500 సంవత్సరాలు.
టావోయిజం 2,400 సంవత్సరాలు.
క్రైస్తవం 2,000 సంవత్సరాలు.
ఇస్లాం 1200 సంవత్సరాలు.
సిక్కుమతం 400 సంవత్సరాలు.
షిరిడి సాయిబాబా 100 సంవత్సరాలు.
ఈ సంఖ్యలను చూసి ఆలోచించండి.
దైవ భావన పుట్టి కేవలం పదివేల సంవత్సరాలు మాత్రమే అవుతుంది. కానీ విశ్వం ఆవిర్భావము చెంది సుమారు1400 కోట్ల సంవత్సరాలు అయింది. భూమి ఆవిర్భావం చెంది 450 కోట్లు అవుతుంది.
కానీ మతాలన్నీ విశ్వాన్ని మా దేవుడే సృష్టించాడు అని చెప్పుకోవడం ప్రజలను మోసగించడం అవుతుంది.
ఈ మతాలు చెప్పిన మాటలు ఎలా నమ్ముతున్నారు?
ఇలా వారి వారి మతాలను ప్రజల్లో వ్యాప్తి చేయడానికి, లేనిపోని కట్టు కథలను,కల్పిత కథలను అల్లి ప్రజలను మోసగించి,
వారి పబ్బం గడుపు కుంటున్నారు. కష్టం చేయకుండా శ్రమించకుండా సోమరిపోతుల్లాగా సకల సుఖాలు అనుభవిస్తున్నారు.
ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహిస్తే మంచిది.
ప్రజలు ఇప్పటికే మూఢాచారాల్లో ,అజ్ఞానంలో మూర్ఖత్వంతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మెదళ్ళలో పట్టిన బూజు దులుపుకుంటే మత చెత్తను తీసివేయకుంటే బతుకులు వ్యర్థం అవుతాయి......

ఆదియాల శంకర్

25/03/2026

Celebrating my 3rd year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉

55, అంతకు పైబడిన వయసు వారికి నాలుగు మంచి మాటలు. ఆచరిస్తే సుఖంగా ఉంటారు ☺️😊 . లేదంటే... 😢😢
23/06/2025

55, అంతకు పైబడిన వయసు వారికి నాలుగు మంచి మాటలు.
ఆచరిస్తే సుఖంగా ఉంటారు ☺️😊 .
లేదంటే... 😢😢

15/02/2025
25/01/2025

అమానుష శ్రమదోపిడీ

▪️పనిగంటల పెంపు ప్రతిపాదనపై సిఐటియు.
▪️కార్మికుల రక్తాన్ని, స్వేదాన్ని పీల్చేస్తున్నారని మండిపాటు
▪️తగ్గుతున్న వేతనాలు… పెరుగుతున్న కార్పొరేట్‌ లాభాలు
▪️వారానికి ఐదు రోజులు, 35 గంటలే పని ఉండాలని డిమాండ్‌.

వారానికి 90 పనిగంటలు ఉండాలంటూ ఎల్‌ అండ్‌ టి అధిపతి ఎస్ఎన్‌ సుబ్రమణ్యం చేసిన వ్యాఖ్య తీవ్ర దుమారాన్ని రేపుతోంది. పలు కార్మిక సంఘాలు ఆ వ్యాఖ్యలను ఖండించాయి.

వారానికి 70 పనిగంటలు ఉండాలంటూ 2023లో ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి చేసిన చేసిన ప్రతిపాదనకు కూడా ఇలాగే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

ఎల్‌ అండ్‌ టి అధిపతి చేసిన తాజా వ్యాఖ్యపై సిఐటియు మండిపడింది. కార్పొరేట్‌ శక్తులు పోటీ పడుతూ కార్మికుల రక్తాన్ని, స్వేదాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయని సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌ సేన్‌ ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్మికుల పనిగంటలను పెంచేందుకు మోడీ నేతృత్వంలోని మతతత్వ-కార్పొరేట్‌ ప్రభుత్వంతో బడా కార్పొరేట్‌ సంస్థల అధిపతులు చేయి కలిపారని సిఐటియు విమర్శించింది.

వారానికి ఐదు రోజుల పనిదినాలు,35 పనిగంటలు మాత్రమే ఉండాలని డిమాండ్‌ చేసింది. ఇప్పటికే పెంచిన పనిగంటలు కార్మికుల ఆరోగ్యం, సామాజిక జీవనంపై ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

‘ఇంత జరుగుతున్నా అమానుషమైన పని పరిస్థితులతో ఉద్యోగాలలో కోత పెట్టేందుకు, కార్మిక ఖర్చులను తగ్గించు కునేందుకు కార్పొరేట్‌ వర్గం పైశాచిక కసరత్తు జరుపుతోంది. తమ లాభాల కోసం ఖర్చులు తగ్గించుకోవాలని అనుకుంటోంది.

సమర్ధత-ఉత్పాదకత ముసుగులో కార్మికుల శ్రమను మరింతగా దోచుకోవాలని చూస్తోంది. వీరి ప్రయత్నాల కారణంగా 2022లో 11,486 ఆత్మహత్యలు జరిగాయని క్రైమ్‌ బ్యూరో రికార్డులే చెబుతున్నాయి’ అని తపన్‌ సేన్‌ ఆ ప్రకటనలో తెలిపారు.

‘చైనా, యూరప్‌, అమెరికా వంటి ఉత్పాదక దేశాలతో పోలిస్తే అధికారిక రంగంలో శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులు సైతం ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తోంది. కార్మికుల నుండి ఆమానవీయంగా శ్రమను దోచుకుంటున్నారు.

జోడించిన నికర విలువలో (వస్తువు లేదా సేవ విలువ నుంచి దాని ఉత్పత్తి ఖర్చును తీసివేయగా వచ్చింది) వేతనాల వాటా పడిపోవడం శ్రమ దోపిడీని సూచిస్తోంది.

1990-91లో వేతనాల వాటా 27.64 శాతం ఉంటే 2022-23 నాటికి 15.94 శాతానికి తగ్గింది. అదే సమయంలో నికర లాభాల వాటా 19.06 శాతం నుండి 51.92 శాతానికి పెరిగింది’ అని తపన్‌సేన్‌ వివరించారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి విధేయత చూపుతున్న కార్పొరేట్‌ సంస్థలు ఒక దాని వెంట ఒకటిగా పనిగంటలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు.

లేబర్‌ కోడ్లను ఇంకా నోటిఫై చేయకపోయినా బిజెపి పాలిత రాష్ట్రాలతోపాటు కొన్ని బిజెపి యేతర పార్టీల పాలనలోని రాష్ట్రాలు కూడా పనిగంటలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రయత్నాలను ప్రతిఘటించాలని తపన్‌ సేన్‌ ఆ ప్రకటనలో కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు

ఒకడు రుద్రాక్షమాలికలు నెత్తికి జుట్టి        శివుమూర్తియై భూమి కవతరించుఒక డూర్య్ధపుండ్రంబు లురువుగా దగిలించి        శివ...
04/11/2024

ఒకడు రుద్రాక్షమాలికలు నెత్తికి జుట్టి
శివుమూర్తియై భూమి కవతరించు
ఒక డూర్య్ధపుండ్రంబు లురువుగా దగిలించి
శివలింగమును జూచి చీదరించు
ఒకడు రెండును గాని వికటవేషము దాల్చి
పైవారి మీద సవాలు సేయు
ఒకడు గంజాయి దమ్ముకు దాసుడై పోయి
బూడిదగురవడై పుట్టివచ్చు

మనుజులార మాది ఘనమైన మతమని
ఒకడు తరిమి తరిమి యుగ్గడించు
పెక్కుమతము లిట్లు పేచీలు సాగింప
మార్గమేది యైకమత్యమునకు

భావం: ఒకడు రుద్రాక్షమాలల్ని నెత్తికి చుట్టి సాక్షాత్తు శివమూర్తిలాగా భూమికవతరిస్తాడు, ఇంకొకడూర్ధ్వ పుండ్రాలు (నిలువుబొట్టు) ధరించి శివలింగాన్ని చూచి చీదరించుకొంటాడు; మరొకడు పై రెండుగాకుండా వికట వేషమొకటి వేసి, వాళ్ళిద్దరి మీద సవాలు చేస్తాడు, ఇంకొకడు గంజాయి దమ్ముకు దాసుడైపోయి బూడిద గురవడై పుట్టుకొస్తాడు; ఒకడు - ఓ మనుజులారా! మాదే గొప్ప మతమనీ, తక్కినవి నీచమైనవనీ, బల్లగుద్ది, తరిమి- తరిమిచెపుతాడు. ఈ రకంగా మతాలన్నీ పేచీలుపెట్టి సమాజాన్ని అతలాకుతలం చేస్తుంటే,
ఐకమత్యానికిక మార్గమేది?

- గబ్బిలము ; గుఱ్ఱం జాషువా.

ముఖ్యమంత్రి గారికి ఉపాధ్యాయుల సమస్యలు వివరిస్తున్న యుటిఎఫ్ రాష్ట్ర నాయకత్వం మరియు పిడిఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్ రావు ...
13/09/2024

ముఖ్యమంత్రి గారికి ఉపాధ్యాయుల సమస్యలు వివరిస్తున్న యుటిఎఫ్ రాష్ట్ర నాయకత్వం మరియు పిడిఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్ రావు గారు

*కామ్రేడ్ సీతారం ఏచూరి మృతిపట్ల యూటీఎఫ్ సంతాపం*
12/09/2024

*కామ్రేడ్ సీతారం ఏచూరి మృతిపట్ల యూటీఎఫ్ సంతాపం*

12/09/2024

జోహార్ కామ్రేడ్ సీతారాం ఏచూరి

Address

Addanki
Addanki
523201

Website

Alerts

Be the first to know and let us send you an email when UTF Bapatla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category