23/06/2026
కనిపించని దేవుణ్ణి నేను ఎప్పుడూ నమ్మలేదు..
ఎందుకంటే ఒక్కసారి కూడా కనిపించలేదు కనుక..
కానీ మహమ్మారి కబలించి ఊపిరి అవిరైపోయే బతుకులకు ప్రాణం పోస్తున్న మహర్షిని చూసాను..
కొన్ని వేల కోట్లు ఉన్నా..కోటల్లో పుట్టి పెరిగినా..
కాలికి మట్టి అంటని కోట్లాదిపతి అయినా..
ప్రజా సేవయే తన జీవన గమనంగా మార్చుకున్న ఓ మహా మనిషిని చూసాను..
ప్రాణం పోతుందేమో అన్న భయం జాడల నుంచి ప్రాణం పోసి మరీ సంతోషంగా ఇంటికి సాగనంపే మహా ఋషిని చూసాను..
ఆసుపత్రి ఆవరణని అమ్మకోసం కట్టిన కోవెలగా..మార్చి
ఆశ్రయం కోసం వచ్చిన పేదోడికి అన్నీ తానై నిలిచిన వాడిగా..
కళ్ళ ఎదుటే కల్లా కపటం తెలియని పసి వాళ్ళ చిరునవ్వుల్లో తన తల్లిని చూసుకుంటూ..
సమాజానికి తాను అందిస్తున్న సేవలలో..
మనిషి రూపంలో ఉన్న *నిజమైన దైవ స్వరూపాన్ని చూసాను*
జై బాలయ్య..జై జై బాలయ్య