BRS Australia

Call Directions Website

BRS Australia Official BRS Party Australia Chapter

Thank you, Kalvakuntla Taraka Rama Rao - KTR Anna, for your wonderful birthday wishes to our BRS Australia Youth Wing Co...
14/10/2026

Thank you, Kalvakuntla Taraka Rama Rao - KTR Anna, for your wonderful birthday wishes to our BRS Australia Youth Wing Convenor, Vinay Sunny Goud. Your kind wishes mean a great deal to us, are truly appreciated, and have greatly motivated the entire BRS Australia team. 🙏💗
BRS Australia BRS Party
Kasarla Nagender Reddy Sairam UppuKasarla Nagender Reddy - KNR

Happy Birthday  Sunny Goud
13/10/2026

Happy Birthday Sunny Goud

12/10/2026
12/10/2026

సింగరేణి కార్మిక గర్జన! ✊🏻

సింగరేణిని నిలువునా దోచుకుంటూ, కార్మికుల పొట్టకొడుతున్న దగాకోరు కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ సమరభేరి.

కార్మిక సోదరులారా తరలిరండి..
హక్కుల కోసం గళమెత్తండి!

🗓️ తేదీ: 14 అక్టోబర్ 2026
​🕔 సమయం: సాయంత్రం 5:00 గంటలకు
​📍 గోదావరిఖని

Happy Birthday Vishwamithra Manthripragada
11/10/2026

Happy Birthday Vishwamithra Manthripragada

బీఆర్ఎస్ ఆస్ట్రేలియాBRS Australia నాయకులు విశ్వామిత్ర మంత్రి ప్రగడ గారి జన్మదిన వేడుకల్లో పాల్గొని, శుభాకాంక్షలు అందించి...
10/10/2026

బీఆర్ఎస్ ఆస్ట్రేలియాBRS Australia నాయకులు విశ్వామిత్ర మంత్రి ప్రగడ గారి జన్మదిన వేడుకల్లో పాల్గొని, శుభాకాంక్షలు అందించిన డాక్టర్ రసమయి బాలకృష్ణ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏

ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియాకు విచ్చేసిన డాక్టర్ రసమయి బాలకృష్ణ గారు, బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది.

బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ వేడుకలు ఆత్మీయతకు, ఐక్యతకు ప్రతీకగా నిలిచాయి. 💗

జై తెలంగాణ! జై బీఆర్ఎస్! ✊💗

Happy Birthday Surya Rao
08/10/2026

Happy Birthday Surya Rao

ఆస్ట్రేలియాలో గులాబీ జోరు.. మల్లారెడ్డి మీట్ అండ్ గ్రీట్‌లో కేటీఆర్ వీడియో సందేశంత్వరలో మెల్‌బోర్న్‌కు వస్తా.. తెలంగాణ, ...
30/09/2026

ఆస్ట్రేలియాలో గులాబీ జోరు.. మల్లారెడ్డి మీట్ అండ్ గ్రీట్‌లో కేటీఆర్ వీడియో సందేశం

త్వరలో మెల్‌బోర్న్‌కు వస్తా.. తెలంగాణ, తెలుగు ప్రజలను కలుస్తా: కేటీఆర్

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. ఆస్ట్రేలియా పర్యటనకు విచ్చేసిన మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డితో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా వ్యవస్థాపక అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. మెల్‌బోర్న్‌లోని తెలంగాణ, తెలుగు ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు గుడ్డిగా నమ్మవద్దని సూచించారు. కాళేశ్వరం సహా గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, కార్యక్రమాలపై వాస్తవాలను తెలుసుకున్న తర్వాతే స్పందించాలని ఆయన కోరారు.

బీఆర్ఎస్ ఆస్ట్రేలియా వ్యవస్థాపక అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియా, యూట్యూబ్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను నిజమని నమ్మకుండా ఫ్యాక్ట్ చెకింగ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. “ఏది నిజం? ఏది అబద్ధం?” అనే విషయాన్ని ప్రజలు స్వయంగా నిర్ధారించుకోవాలని కోరారు. రాజకీయ అంశాలపై వచ్చే ఫేక్ న్యూస్, నిరాధారమైన ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీడియో కాల్ ద్వారా మెల్‌బోర్న్‌లోని తెలంగాణ, తెలుగు ప్రజలను ఉద్దేశించి సందేశం అందించారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా తెలంగాణ ప్రజలు తమ కుటుంబ సభ్యులు, మిత్రులు, సమాజంలోని వారితో తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించాలని, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించాలని కేటీఆర్ కోరారు.

అలాగే త్వరలో మెల్‌బోర్న్‌కు వచ్చి తెలంగాణ, తెలుగు ప్రజలతో ప్రత్యక్షంగా సమావేశమై వారిని కలుస్తానని కేటీఆర్ తెలిపారు. కేటీఆర్ వీడియో సందేశంతో కార్యక్రమంలో ఉత్సాహం మరింత పెరిగింది.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకులు సాయిరాం ఉప్పు, వినయ్ సన్నీ గౌడ్, ఉదయసింహా రెడ్డి, విశ్వామిత్ర, మంత్రిపగడ, సూర్యారావు, జాబ్ అడ్డ సంజు, రాకేష్ యాదవ్ ల తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. మెల్‌బోర్న్‌లోని వివిధ తెలుగు, తెలంగాణ సంఘాల నాయకులు, మహిళలు, యువతీ యువకులు, ప్రవాస భారతీయులు, బీఆర్ఎస్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మాజీ మంత్రి మల్లారెడ్డితో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఆస్ట్రేలియాలోని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందని నిర్వాహకులు తెలిపారు.

Address

Melbourne, VIC
3000

Alerts

Be the first to know and let us send you an email when BRS Australia posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share