Thalassemia Welfare Society Telangana

  • Home
  • Thalassemia Welfare Society Telangana

Thalassemia Welfare Society Telangana EMERGENCY APPEAL FOR BLOOD DONATION camp or individual blood donors for thalassemia patients shortag

06/01/2024

Nilofer cafe owner Sri Babu Rao about Thalassemia

ఈరోజు చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రభుత్వ విప్ గారిని క్యాతన్ పెళ్లి క్యాంపు నివాసములో కాసర్ల రంజిత్ కుమ...
29/09/2023

ఈరోజు చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రభుత్వ విప్ గారిని క్యాతన్ పెళ్లి క్యాంపు నివాసములో కాసర్ల రంజిత్ కుమార్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తలసేమియా వెల్ఫేర్ సొసైటీ గారు కలిసి
తెలంగాణ రాష్ట్రంలోని సుమారు 5,000 వేల మంది తలసేమియా,సికిల్ సెల్, హిమోఫిలియా వ్యాధిగ్రస్తులకు వికలాంగుల సదరం సర్టిఫికెట్లు ఇవ్వాలి అని కేటీఆర్ గారికి వ్రాసిన వినతి పత్రాన్ని శ్రీ బాల్క సుమన్ ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగినది.

అక్టోబర్ నెల 1వ తేదీన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ గారు మందమర్రి పట్టణానికి వచ్చేస్తున్న సందర్భంగా తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్ కుమార్ తెలంగాణ రాష్ట్రంలో గల సుమారు 5000 మంది తలసేమియా ,సికిల్ సెల్, హిమోఫిలియా రక్త క్షీణిత జబ్బులు కలవారికి డిజబులిటీ బిల్లు 2016 ప్రకారంగా తల సేమియా సికిల్ సెల్ హిమోఫిలియా గల వ్యాధిగ్రస్తులకు వికలాంగుల సదరం సర్టిఫికెట్లు ఇప్పించాలని రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఎం.ఎస్ నెంబర్ 5 తేదీ 13.06.2018 ప్రకారంగా వికలాంగుల సదరన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని వినతి పత్రాన్ని ఇవ్వాలని కేటీఆర్ ను కలవడానికి (కలిపించడానికి) అనుమతి ఇవ్వాలని క్యాతన్ పెళ్లి క్యాంపు కార్యాలయంలో ఈరోజు శ్రీ బాల్క సుమన్ గారిని కలవడం జరిగినది.

ఈ సందర్భంగా బాల్క సుమన్ గారు నాతో (కాసర్ల రంజిత్ కుమార్) మాట్లాడుతూ తల సేమియా సికిల్ సెల్ హిమోఫిలియా పిల్లలు రక్త క్షీణిత జబ్బు కలవారు చిన్నపిల్లలు కావున ప్రజలలో తొక్కేసేలాటలో ప్రమాదాలు జరగవచ్చు వాతావరణ ఎండ వాన లో ఇబ్బందుల కు గురికాకుండా . కేటీఆర్ గారికి రాసిన వినతి పత్రాన్ని నాకు ఇవ్వమని శ్రీ బాల్క సుమన్ గారు కోరడం జరిగినది. తలసేమియా, సికిల్ సెల్, హిమోఫిలియా వారి వికలాంగుల సదరం సర్టిఫికెట్లు జీవో ఎం.ఎస్ నెంబర్ 5 తేదీ 13-6- 2018 ప్రకారంగా వికలాంగుల సదరం సర్టిఫికెట్లు ఇవ్వాలని ఈ వ్యాధిగ్రస్తుల సమస్యలన్నీ పరిష్కరించాలని నేనే( బాల్క సుమన్ గారు) కేటీఆర్ గారితో స్వయంగా మాట్లాడి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు కావున ఈరోజు కాసర్ల రంజిత్ కుమార్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాసిన వినతి పత్రాన్ని శ్రీ బాల్క సుమన్ ప్రభుత్వ విప్ గారికి వినతి పత్రము ఇవ్వడం జరిగినది.
ఈ సందర్భంగా కాసర్ల రంజిత్ కుమార్ బాల్క సుమన్ గారికి మా యొక్క తల సేమియా సికిల్ సెల్ హిమోఫిలియా వ్యాధిగ్రస్తుల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కేటీఆర్ పర్యటనలో ఇబ్బందులకు గురి కావద్దని మా సంక్షేమం కోసం మా సమస్యలు పరిష్కరిస్తామని కేటీఆర్ గారి దృష్టికి తీసుకు వెళ్తానని తెలిపినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుచున్నాము.

ఇట్లు

కాసర్ల రంజిత్ కుమార్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తలసేమియా వెల్ఫేర్ సొసైటీ
సెల్ 8179497231

08/09/2023
ఈరోజు తేదీ 01.09.23 శ్రీరాంపూర్ ఏరియా  జిఎం శ్రీ సంజీవరెడ్డి గారిని కలిసి తలసేమియా, సికిల్ సేల్ వ్యాధిగ్రస్తుల కొరకు రక్...
01/09/2023

ఈరోజు తేదీ 01.09.23 శ్రీరాంపూర్ ఏరియా జిఎం శ్రీ సంజీవరెడ్డి గారిని కలిసి తలసేమియా, సికిల్ సేల్ వ్యాధిగ్రస్తుల కొరకు రక్తదాన శిబిరాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగినది.

శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి కాలిరిస్ కంపనీ లిమిటెడ్ శ్రీ జి.యం సంజీవరెడ్డి గారికి తలసేమియా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు, మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని నిరుపేదలకు, గర్భిణీ స్త్రీలకు కిడ్నీ డయాలసిస్ బాధితులకు అత్యవసర శాస్త్ర చికిత్స వారికి రక్తము దొరకక మంచిర్యాల రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు లో రక్తము కొరత తీవ్రంగా ఉన్నదని జిల్లా కలెక్టర్ గారు శ్రీరాంపూర్ ఏరియా జిఎం కు లేఖ ద్వారా ఆదేశాలు జారీ చేయడం జరిగినది.
ఈ లేఖను మంచిర్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి ద్వారా శ్రీరాంపూర్ జిఎం గారికి వినతి పత్రము ఇవ్వడం జరిగినది.

ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో 800 మంది తల సేమియా సికిల్ సేల్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు వీరికి జీవితాంతము ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తము ఎక్కించాలి వీరికి ఉచితంగా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ద్వారా అందజేయడం జరుగుతుంది మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పటల్ లోని రక్తం అవసరం ఉన్న ప్రతి పేషెంట్ కు కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది ఇప్పుడు రక్తం కొరత తీవ్రంగా ఉన్నదని జిఎం గారికి వివరిస్తూ వారం రోజులలో రక్తదాన శిబిరాలు నిర్వహించి ఈ వ్యాధిగ్రస్తులను ఆదుకోవాలని కోరడం జరిగినది.

దీనికి స్పందించిన జిఎం జిఎం గారు మాట్లాడుతూ గనుల వారీగా డిపార్ట్మెంట్ల వారిగా రక్తదాన శిబిరాలు నిర్వహించి వ్యాధిగ్రస్తులను ప్రభుత్వ ఆసుపత్రిలోని నిరుపేదలను గర్భిణీ స్త్రీలను ఆదుకుంటామని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో రక్తం కొరత లేకుండా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది వారం రోజుల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ రక్తదాన శిబిరాలు గతంలో మాదిరిగా రెగ్యులర్ గా నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా బ్రాంచ్ చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు కాసర్ల శ్రీనివాస్ ,తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు తేదీ 01-09-2023 మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తా వద్ద గల మయూరి మల్టీ హాస్పిటల్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన...
01/09/2023

ఈరోజు తేదీ 01-09-2023 మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తా వద్ద గల మయూరి మల్టీ హాస్పిటల్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యాన్ని మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ కుమార్ గారిని తలసేమియా,సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల కొరకు ఉచిత మెరుగైన వైద్యం కోసం 2D ఎకో టెస్టులు సామాజిక సేవలో భాగంగా ఉచితంగా చేయాలని మంచిర్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ యాజమాన్యం కలవడం జరిగినది. మంచిర్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి మరియు జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యుడు కాసర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ తలసేమియా,
సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు తరచూ రక్తం ఎక్కించుకుంటారు కాబట్టి శరీరంలో ఐరన్ పేర్కొపోయి ఐరన్ ప్రభావం పడుతుంది కాబట్టి 2D ఎకో టెస్ట్ ద్వారా ఐరన్ ఓవర్ లోను తెలుస్తోంది కావున మెరుగైన వైద్యం కోసం 2D ఎకో గుండె పరీక్ష ఉచిత క్యాంపు నిర్వహించాలని జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి ,రెడ్ క్రాస్ సొసైటీ మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు కాసర్ల శ్రీనివాస్ కోరడం జరిగినది. దీనికి హాస్పటల్ యాజమాన్యం వారు సానుకూలంగా స్పందించి అతి త్వరలో విడతలవారీగా 2D ఎకో గుండె పరీక్ష నిర్వహిస్తామని హామీ ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో మయూరి మల్టీస్పెషల్టి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ కుమార్ డాక్టర్ గోపాలకృష్ణ సుబ్బారాబహత్ , తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్ కుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది.

సికిల్ పై సమరం నమస్తే తెలంగాణ పేపర్ మంచిర్యాల జిల్లా 29.06.23
29/06/2023

సికిల్ పై సమరం నమస్తే తెలంగాణ పేపర్ మంచిర్యాల జిల్లా 29.06.23

Kasarla Srinivas State Vice President Thalassemia Welfare Society Telangana  received GOLD PLATED SILVER MADELS ,SILVER ...
09/05/2023

Kasarla Srinivas State Vice President Thalassemia Welfare Society Telangana received GOLD PLATED SILVER MADELS ,SILVER MADELS & Certificate of Merit Motivated Blood Donors and Blood Donation Camps issued by Hon'ble Governor of Telangana State and Presented by Sri.B.Rahul IAS Hon'ble Addl.Collector of Mancherial District and Sri.Madhusudan Nayak IAS Addl.Collector of Mancherial district On the Occasion of World Thalassemia day and World Red Cross Day

Kasarla Ranjith kumar State joint Secretary Thalassemia Welfare Society Telangana received Certificate of Merit Motivate...
09/05/2023

Kasarla Ranjith kumar State joint Secretary Thalassemia Welfare Society Telangana received Certificate of Merit Motivated Blood Donors and Blood Donation Camps and Memento issued by Hon'ble Governor of Telangana State and Presented by Sri.B.Rahul IAS Hon'ble Addl.Collector of Mancherial District and Sri.Madhusudan Nayak IAS Addl.Collector of Mancherial district On the Occasion of World Thalassemia day and World Red Cross Day

May 8th World Thalassemia day Paper Articles
08/05/2023

May 8th World Thalassemia day Paper Articles

*Only you can save Nerella Pandu from the grips of Thalassemia!* Raju wants to raise funds for his son Nerella Pandu to ...
05/04/2023

*Only you can save Nerella Pandu from the grips of Thalassemia!*

Raju wants to raise funds for his son Nerella Pandu to fight Thalassemia. Your donation can guide them to reach their fund goals. Please help.

*Read More:* http://impactguru.com/s/eZexhz

*NEFT / IMPS / RTGS*

Account number: 2223330076538919
Account name: Nerella Pandu
IFSC code: RATN0VAAPIS
Bank Name: RBL Bank

*UPI Handle:*
assist.nerella14@icici

Address

TX

Alerts

Be the first to know and let us send you an email when Thalassemia Welfare Society Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Thalassemia Welfare Society Telangana:

  • Want your organization to be the top-listed Non Profit Organization?

Share