CITU MTM

CITU MTM సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

07/09/2021

గిరిజన హక్కుల కార్యకర్త.. క్రైస్తవ సన్యాసి స్టాన్ స్వామి మృతిపై కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కృష్ణా జిల్లా కమిటీ విచారం వ్యక్తం వస్తుంది. జార్ఖండ్ రాష్ట్రంలో మారుమూల ప్రాంతంలో ఆదివాసీలు మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం స్టాన్ స్వామి ఎన్నో ఉద్యమాలు చేశారు. స్టాన్ స్వామి కి బీమా కోరేగావ్ కుట్రకేసులో ప్రమేయం ఉందంటూ గత సంవత్సరం అక్టోబర్ నెలలో వుపచట్టం క్రింద స్టాన్ స్వామి ని అరెస్ట్ చేసి ఉగ్రవాద ముద్ర వేయడం జరిగింది. 84 సంవత్సరాల వృద్ధుడు శరీరావయవాలు సహకరించిన అటువంటి వ్యక్తిని బిజెపి ప్రభుత్వం అక్రమ అరెస్టు చేసి ప్రభుత్వం ఏ విధమైన విచారణ నిర్వహించకుండా తొమ్మిది నెలల పాటు జైలు నిర్భదించడం జరిగింది. స్టాన్ స్వామి చేసిన నేరం ఏమిటని కెవిపిఎస్ ప్రశ్నిస్తుంది. ఆదివాసీల అభివృద్ధి కోసం పాటుపడటం ఆయన చేసిన నేరమా? స్టాన్ స్వామి భీమా కోరేగావ్ గ్రామాన్ని ఎనాడు సందర్శించిన దాఖలాలు లేవు. అటువంటి ఆయన్ని భీమాకోరేగావ్ కుట్రలో ఇరికించడం పెద్ద కుట్ర బీమా కోరేగావ్ కేసులో అరెస్టు కాబడిన మేధావుల అందరిని బేషరతుగా విడుదల చేయాలని,స్టాన్ స్వామి మృతిపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ అంశంపై వుపచట్టాన్ని ఎత్తివేయాలి అని కుల వివక్ష పోరాట సమితి కృష్ణా జిల్లా కమిటీ డిమాండ్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో కుల వివక్ష పోరాట సమితి జిల్లా కార్యదర్శి రాజేష్, అధ్యక్షులు కొడాలి శర్మ జిల్లా సిఐటియు నాయకులు ఎం పోలినాయుడు,మాదల వెంకటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, జయరావు, వ్యవసాయ కార్మిక నాయకులు కొల్లాటి శ్రీనివాసరావు, ఎస్ఎఫ్ఐ నాయకులు పవన్,ఎల్ఐసి యూనియన్ నాయకులు కిషోర్, చంద్రబాబు, పౌర సంక్షేమ సంఘం నాయకులు యూనస్ తదితరులు పాల్గొన్నారు.

*పట్టణ ప్రజలపై భారాలు మోపేఆర్డినెన్స్,జీవోలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు మచిలీపట్నం బుట్ట...
12/02/2020

*పట్టణ ప్రజలపై భారాలు మోపే
ఆర్డినెన్స్,జీవోలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు మచిలీపట్నం బుట్టయిపేట సెంటర్లో జీఓ కాపీలను దగ్ధం చేయటం జరిగింది.*
మున్సిపల్ చట్టాలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన 16 నెంబర్ ఆర్డినెన్స్ ప్రజలపై ఆస్థి పన్నులు ,నీటి చార్జీలు,డ్రైనేజీ చార్జీలను భారీగా పెంచే 196,197,198
జీవోలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసేరు.

10/12/2020
10/10/2020
10/10/2020

Address

New York, NY

Telephone

+19177609039

Website

Alerts

Be the first to know and let us send you an email when CITU MTM posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to CITU MTM:

Share