Health Education & Living for the Poor Society

Health Education & Living for the Poor Society HELP is a non-profit charity Organization founded by students of Vallapuram, India to help & guide the students,farmers & needy people of our Village.

22/03/2026

Students please listen carefully...

17/12/2025

ఏదైనా గ్రామంలోకి వెళ్లి ఒక రైతుని ‘మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్య ఏమిట’ని అడగండి.

వ్యవసాయానికి కూలీలు దొరకడం లేదు అంటారు.

పట్టణంలోకి వెళ్లి ఒక హోటల్ యజమానిని అడగండి. కుక్స్, వెయిటర్స్, ఫ్రంట్ ఆఫీస్ పనులు చేయడానికి సరైన వ్యక్తులు దొరకడం లేదు అంటారు.

”అసలు ఈశాన్య భారతదేశం వారు ఉండబట్టి సరిపోయింది. లేకపొతే పెద్ద క్రైసిస్ వచ్చివుండేది!" అని ఒక హోటల్ యజమాని అంటున్నాడు.

భవన నిర్మాణ దారుణ్ని అడగండి ‘ప్లంబర్లు, ఫిట్టర్లు మొదలైన వారు దొరకడం లేదు!’ అంటారు.

మారిషస్ వాళ్ళకు అక్కడ ‘పురోహితుడు, కుక్ కావాలి, దొరకడం లేదు సాయం చెయ్యండి!’ అని వారు అడుగుతున్నారు. ఒక పక్క దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా వుంది అంటున్నారు.

మరోపక్క అన్ని రంగాల్లో సరైన నైపుణ్యం ఉన్న వ్యక్తులు దొరకడంలేదు అని ఆయా రంగాల్లో నిపుణులు చెబుతున్నారు. ఈ వైరుధ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

హోటల్స్ లో దోశ మాస్టర్ కు ఇరవై ముప్పై వేలు ప్రారంభ జీతం వుంది.

అదే ఇంజనీర్ లు పది వేల జీతానికి కూడా క్యూలో నిల్చుంటున్నారు. సమస్య ఎక్కడ వుంది అంటే అందరికి వైట్ కాలర్ జాబ్ లే కావాలి. జీతం ఎక్కువ వస్తుంది అని కాదు.

చాలా సెమి స్కిల్ల్డ్ జాబ్స్ కు రెండు మూడు రెట్లు ఎక్కువ జీతం వస్తుంది.

ఈరోజు ప్రభుత్వ టీచర్ ప్రారంభ జీతం దాదాపు 50 వేలు. అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన డాక్టర్ { సర్జన్} జీతం నలభై వేలు. మన వారు ఒక్కో జాబ్ కు ఒక్కో సోషల్ స్టేటస్ అంటగట్టేసారు. ఇంజనీర్ డాక్టర్ అంటే గొప్ప అని టీచర్ అంటే ఏదో పనికి రాని జాబ్ అని.

ప్లంబర్, ఫిట్టర్ లాంటి పనులు చేస్తున్నాను అంటే పెళ్లికి అమ్మాయి కూడా దొరకని పరిస్థితి.

అంతెందుకు పురోహిత్యం చేసే వారికి విదేశాల్లో చాల డిమాండ్ వుంది. అయినా పురోహిత్యపు పెళ్లికొడుకు అంటే పెళ్ళికి అమ్మాయిలు ముందుకు రాని స్థితి.

కంప్యూటర్ ఇంజనీర్ అని చెప్పుకొంటూ ఆరు నెలలుగా జీతాలు ఇవ్వక పోయినా కేవలం ప్రెస్టేజ్ కోసం పని చేసేవారు వున్నారు.

అదే…. హోటల్ లో కుక్ గా వెయిటర్ గా చెయ్యమంటే నామోషీ. తలతీసినట్టు ఫీల్ అవుతారు.

ఇదే మనవారు అమెరికాకు వెళితే అక్కడ హోటల్ లో పనిచెయ్యడానికి సిద్ధపడుతారు...
అంటే ఇక్కడ మారాల్సింది సామజిక దృక్పధం.

దొంగతనం, అడుక్కోవడం తప్ప ఏ పని చేసినా తప్పులేదు. అన్ని పనులు గొప్పవే.

మీ మనసుకు నచ్చిన ఫీల్డ్ ఎంచుకోండి.

అతిచిన్న ఉద్యోగమైనా పరవాలేదు. చేతినిండా పని ఉండాలి, ఎంతో కొంత ఆదాయం ఉండాలి.
చేస్తున్న పనిపై మనసు లగ్నం చెయ్యాలి. అంచెలంచెలుగా ఎదగాలి.

పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలి. పాన్ డబ్బా పెట్టుకొన్నా పరవా లేదు. కర్రీ షాప్ పెట్టుకొన్నా పరవా లేదు... "మీరే రాజు... మీరే మంత్రి..." డిప్రెషన్ శుద్ధ అనవసరం.

ఆత్మ విశ్వాసం, కృషి, పట్టుదల, మారిన పరిస్థితులకు అనుగుణంగా మారడం..!

04/09/2025

  vs   vs   FEE comparison and admission process check here 👇
18/04/2025

vs vs FEE comparison and admission process check here 👇

ఐఐటీ Vs ఎన్​ఐటీ Vs ఐఐఐటీ మధ్య అడ్మిషన్, ఫీజుల వివరాలిలా!

Pamban Bridge: పాంబన్‌ సేతు నిర్మాణంలో సేనాధిపతి.. ఇంజినీరింగ్‌ ఇన్‌ఛార్జిగా విజయనగరం కుర్రాడు | vizianagaram-young-engi...
06/04/2025

Pamban Bridge: పాంబన్‌ సేతు నిర్మాణంలో సేనాధిపతి.. ఇంజినీరింగ్‌ ఇన్‌ఛార్జిగా విజయనగరం కుర్రాడు | vizianagaram-young-engineer-was-involved-in-the-construction-of-the-pamban-bridge

తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో నిర్మించిన పాంబన్‌ వంతెనను ప్రధాని మోదీ ఆదివారం జాతికి అంకితం చ....

27/03/2025

Current problems in our Education system

21/03/2025

👉 ఇంటర్ తర్వాత విద్యార్ధులు... చేయడానికి అవకాశం ఉన్న ఉన్నతమైన 113 కోర్సులు ఇవే...

001. ఏరోనాటికల్ ఇంజనీరింగ్
002. ఏరోస్పేస్ ఇంజనీరింగ్
003. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్
004. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్
005. ఆస్ట్రోనమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్
006. ఆటోమొబైల్ ఇంజనీరింగ్
007. బయో మెడికల్ ఇంజనీరింగ్
008. బయో టెక్నాలజీ ఇంజనీరింగ్
009. సెరామిక్స్ ఇంజనీరింగ్
010. కెమికల్ ఇంజనీరింగ్
011. సివిల్ ఇంజనీరింగ్
012. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
013. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
014. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
015. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్
016. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్
017. ఇంస్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్
018. మ్యాన్యుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
019. మెరైన్ ఇంజనీరింగ్
020. మెకానికల్ ఇంజనీరింగ్
021. మెడికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
022. మెటాలర్జీ
023. మెటరాలజీ
024. మైనింగ్ ఇంజనీరింగ్
025. నావల్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్
026. ఫిజికల్ సైన్సెస్
027. పాలీమర్ ఇంజనీరింగ్
028. రోబోటిక్స్
029. టెక్స్‌టైల్ ఇంజనీరింగ్
030. అగ్రికల్చర్ సైన్స్
031. బయోలాజికల్ సైన్స్
032. బయోటెక్నాలజీ
033. కంప్యూటర్ అప్లికేషన్స్
034. కంప్యూటర్ సైన్స్
035. సైబర్ సెక్యూరిటీ
036. ఎర్త్ సైన్స్ / జాగ్రఫీ
037. ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్
038. ఫిషరీస్
039. ఫ్లోరికల్చర్/హార్టికల్చర్
040. ఫుడ్ టెక్నాలజీ
041. ఫారెస్ట్రీ
042. ఓషియనోగ్రఫీ
043. స్టాటిస్టికల్ సైన్స్
044. వెటర్నరీ సైన్సెస్
045. వైల్డ్ లైఫ్ బయాలజీ
046. జువాలజీ
047. ఆయుర్వేద బీఏఎంఎస్
048. డెంటల్ బీడీఎస్
049. హోమియోపతి
050. న్యాచురోపతి
051. ఫార్మసీ
052. సిద్ధ
053. యునానీ
054. ఆంత్రోపాలజీ
055. ఆర్కియాలజీ
056. ఆర్ట్ రిస్టోరేషన్
057. క్యూరేషన్
058. ఎడ్యుకేషనల్/వొకేషనల్ స్కూల్ కౌన్సిలర్
059. మాన్యుమెంట్స్ అండ్ స్కల్ప్చర్‌ రిస్టోరేషన్
060. మ్యూసియాలజీ
061. ఫిజియోథెరపీ
062. రిహ్యాబిలిటేషన్ సైకాలజీ
063. రిహ్యాబిలిటేషన్ థెరపీ
064. సోషల్ వర్క్
065. స్పెషల్ ఎడ్యుకేటర్
066. స్పీచ్ లాంగ్వేజ్ అండ్ హియరింగ్
067. లా
068. అడ్వర్టైజింగ్
069. జర్నలిజం
070. మాస్ కమ్యూనికేషన్
071. పబ్లిక్ రిలేషన్స్
072. ఆర్ట్ డైరెక్షన్
073. కొరియోగ్రఫీ
074. డైరెక్షన్
075. ఫిల్మ్/డ్రామా ప్రొడక్షన్
076. ఫైన్ ఆర్ట్స్
077. పర్ఫామింగ్ ఆర్ట్స్
078. వోకల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్
079. యానిమేషన్
080. సినిమాటోగ్రఫీ
081. కమ్యూనికేషన్ డిజైన్
082. డిజైన్
083. గ్రాఫిక్ డిజైనింగ్
084. ఫోటోగ్రఫీ
85. యాక్చురియల్ సైన్సెస్
086. బ్యాంక్ మేనేజ్‌మెంట్
087. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
088. బిజినెస్ మేనేజ్‌మెంట్
089. కాస్ట్స్ అండ్ వర్క్స్ అకౌంట్స్
090. చార్టర్డ్ అకౌంటెన్సీ
091. చార్టర్డ్ ఫైనాన్షియల్ అనాలిసిస్
092. ఈవెంట్ మేనేజ్‌మెంట్
093. హాస్పిటల్ మేనేజ్‌మెంట్
094. హోటల్ మేనేజ్‌మెంట్
095. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్
096. ఇన్స్యూరెన్స్
097. లాజిస్టిక్స్ అండ్ సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్
098. మేనేజ్‌మెంట్
099. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్
100. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్
101. కార్పొరేట్ ఇంటెలిజెన్స్
102. డిటెక్టీవ్
103. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రీషియన్
104. ఫారిన్ లాంగ్వేజెస్
105. హోమ్ సైన్స్
106. ఇంటీరియర్ డిజైనింగ్
107. లిబరల్ స్టడీస్
108. లైబ్రరీ సైన్సెస్
109. మాంటెస్సరీ టీచింగ్
110. న్యూట్రీషియన్ అండ్ డైటెటిక్స్
111. ఫిజికల్ ఎడ్యుకేషన్
112. స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్
113. టూరిజం అండ్ ట్రావెల్.

విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం రూపొందించిన బుక్‌ లెట్‌ లో సీ.బీ.ఎస్.ఈ(CBSE) ప్రధానంగా వివరించిన 113 కోర్సులు ఇవి.

ఇవే కాకుండా అనేక రంగాల్లో అనేక కోర్సులు ఉన్నాయి.

అయితే విద్యార్థుల అభిరుచికి తగ్గట్టుగా కోర్సులు ఎంచుకుంటే కెరీర్ బాగుంటుంది.

Sunita Williams: సునీత వచ్చేసింది | Sunita Williams and other three Astronauts return to Earth
19/03/2025

Sunita Williams: సునీత వచ్చేసింది | Sunita Williams and other three Astronauts return to Earth

కేప్‌ కెనావెరాల్‌: మహా ఉత్కంఠకు తెరపడింది. సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌).....

Welcome home   ! 9 months in space and an epic adventure that truly inspired us all❤️  garu and   sir, we thank you for ...
19/03/2025

Welcome home ! 9 months in space and an epic adventure that truly inspired us all❤️

garu and sir, we thank you for your incredible contributions to space exploration! Salute to your grit, grace, and patience 🫡

🚀

Children stories: ఇస్తున్నారా... కథల విటమిన్లు | special-story-on-stories-for-children
15/03/2025

Children stories: ఇస్తున్నారా... కథల విటమిన్లు | special-story-on-stories-for-children

పిల్లల ఆరోగ్యం కోసం వ్యాక్సిన్లు వేయిస్తాం. బలహీనంగా ఉంటే విటమిన్లు అందిస్తాం. మరి వారి మానసిక వికాసం కోసం ఏం ఇ....

Dear Entire Team,(Those who were involved directly or indirectly in achieving this.. ) I am truly grateful and proud of ...
06/03/2025

Dear Entire Team,

(Those who were involved directly or indirectly in achieving this.. )

I am truly grateful and proud of each one of you for your incredible effort in building a house for someone in need. Your generosity, teamwork, and unwavering dedication have turned a dream into reality.

Raising funds and seeing the project through to completion is not just an achievement it is a testament to your kindness and commitment to making a difference.

This success is not just about building a house; it is about building hope, compassion, and a stronger bond among us.

Thank you for your selfless contributions and for proving that together, we can create meaningful change.

Let’s continue to inspire and uplift others!

With deep appreciation,
HELP Society
Health Education & Living for the Poor Society

02/03/2025

Please follow this tips

Address

Vizianagaram

Alerts

Be the first to know and let us send you an email when Health Education & Living for the Poor Society posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Health Education & Living for the Poor Society:

Share