20/08/2026
మగటపల్లి ఆగస్టు 20.డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మగటపల్లి గ్రామంలో *నామన ఫౌండేషన్* ఆధ్వర్యంలో 16 నిరుపేద కుటుంబాలకు ప్రతి నెల నిత్యావసర మరియు కూరగాయలు పంపిణి కార్యక్రమంలో భాగంగా ఆగస్టు నెలకు సంబందించిన నిత్యవసర వస్తువులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ *నామన ఫౌండేషన్ చైర్మన్ శ్రీ నామన రాంబాబు* గారు అందజేశారు. ఈ సందర్బంగా నామన మాట్లాడుతూ నామన ఫౌండేషన్ వ్యవస్థాపకులు *స్వర్గీయ శ్రీమతి నామన కృష్ణవేణి* జ్ఞాపకార్థం మా కుమార్డ్ *డాక్టర్ వినోద్ (డి యం కార్డియాలజిస్ట్ యు.ఎస్.ఏ)* సహకారంతో ప్రతినెల నిరుపేద కుటుంబాలకు నిత్యవసర మరియు కాయగూరలు పంపిణీ చేయడం జరుగుతుందని, అలాగే నిరుపేదలకు వైద్యo మరియు ప్రతిభవంతులైన నిరుపేద పిల్లలను ఉన్నత విద్య చదివించడo మొదలగు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం *నామన ఫౌండేషన్* ఉద్దేశమని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఈదరాడ పి ఏ సి ఎస్ చైర్మన్ బోలిశెట్టి జగదీష్ కుమార్ బోలిశెట్టి ఏసుబాబు నామన నాగేశ్వరావు కుంపట్ల బాబ్జి గోగి గోపాలకృష్ణ చెల్లింగి సింహాచలం యలంగి బాబూజీ యలంగి ప్రసాద్ కట్టా చంటి భూపతి శ్రీనివాస్ సరెళ్ల సత్యనారాయణ కుంచే శ్రీనివాస్ బొంతు రవి వర్మ నామన రమేష్ నామన ఆంజనేయ స్వామినాయుడు చెల్లిబోయిన రామకృష్ణ బోలిశెట్టి మాధవ నామన నానారు మందపాటి రాము నామన ఏడుకొండలు నామన శ్రీనివాస్ నామన తాతాజీ వడ్లపాటి పెద్దిరాజు బోలిశెట్టి బాబీ తదితరులు పాల్గొన్నారు.