21/08/2025
కాళీ అమ్మ ప్రత్యేక సాధన రహస్యం
(గురు–శిష్య సంభాషణ)
శ్లోకం:
||కలౌ కాళీ కలౌ కాళీ కలౌ కాళీతు కేవలా|
సాధితా కాలనాదేన ప్రత్యక్షా కాళీకా కలౌ||
వివరణ::
కలౌ– కలియుగంలో
కాళీ – మహాకాళీ దేవి
కేవలా – ఏకైకంగా, ఇతరుల్లేని
సాధితా – సాధన చేయబడిన
కాలనాథేన – కాలభైరవుని అనుగ్రహం ద్వారా
ప్రత్యక్షా – ప్రత్యక్ష దర్శనం ఇచ్చే
కాళీకా – కాళీకాదేవి
కలౌ – కలియుగంలోనే
తాత్పర్యం:
కలియుగంలో మహాకాళీ మాత్రమే ప్రత్యక్ష దర్శనం ప్రసాదించే ఏకైక దేవత. కాలభైరవ స్వామి అనుగ్రహంతో, మంత్ర సాధనతో సాధకుని మనస్సు, ప్రాణ, చిత్తం శుద్ధి చెంది, ఆమె సిధ్ధి లభిస్తుంది.
గురు–శిష్య సంభాషణ:
శిష్యుడు: గురుదేవా, కలియుగంలో ఎందుకు మహాకాళీనే ప్రత్యక్ష దర్శనం ఇస్తారని అంటారు?
గురు: శాస్త్రం చెబుతున్నది — ఇతర యుగాలలో ఇతర దేవతలు త్వరితసిద్ధి ఇస్తారు, కాని కలియుగంలో మాయా, అజ్ఞానం, క్షిప్రవృత్తి ఎక్కువగా ఉన్నందున, దాన్ని భేదించగలిగే శక్తి మహాకాళీదే. ఆమె కాలనాధుని (కాలభైరవుని) సహకారంతో త్వరగా ప్రత్యక్షమవుతుంది.
శిష్యుడు: కాలనాధుని పాత్ర ఏమిటి?
గురు: కాలభైరవ స్వామి "కాలనాథ" — సమస్తకాలాధిపతి. కాళీ తల్లి కాలరూపిణి, ఆయన అనుబంధశక్తి. కాళీ సాధనలో కాలభైరవ స్వామి ధ్యానం, న్యాసం తప్పనిసరి. ఇది తంత్రంలో "భైరవి–భైరవ యోగం" అంటారు.
శిష్యుడు: కాళీ ప్రత్యక్ష సాధన విధానం ఎలా ఉంటుంది?
గురు: శాస్త్రోక్త విధానం ఇలా —
1. కాలం: అష్టమి ఆదివారం అమావాస్య రోజుల్లో గురుముకంగా దీక్ష ప్రారంభించాలి మూడు మండలాలపాటు దీక్ష చేయాలి. ఇంటిలో దేవాలయాలలో మఠాలలో పీఠాలలో నదీ తీరాల వద్ద అనుకూలం.
2. స్థానం: ఈశాన్య దిశకు ముఖం చేసి, కృష్ణవర్ణ వస్త్రం, కృష్ణాసనం.
3. మంత్రం:
శ్రీ లక్ష్మీ గణపతి మంత్రం రోజు మూడు మాలలు, కాలభైరవ మంత్రం రోజు ఐదు మాలలు, అమ్మా మంత్రం రోజు 30 మాలలు
- గుప్తమంత్రం — ఓం క్రీం కాళీకాయై నమః. ( ఈ ఒక్క మంత్రమే కాకుండా మహోన్నతమైనటువంటి మహా మంత్రాలు ఇంకా గురుపరంపరలో చాలానే ఉన్నాయి మీరు వాటిలో ఏదైనా అభ్యాసం చేయొచ్చు)
4. న్యాసం: తంత్రప్రామాణిక కాళీ మంత్ర న్యాసం చేయాలి.
5. ధ్యానం: ఓం కాళీ మహాకాళి రుద్రాలంకృతం, రక్తవస్త్రధారిణీ, శిరమాలికాభూషితం, కర్పూరసుగంధదేహం, హసంతీ, భక్తానుగ్రహదాక్షిణ్యం.
6. జపసంఖ్యా: కనీసం మూడు లక్షల 86000 జపాలు. గురుపరంపర మంత్రసి ప్రకారం
7. హోమం: జపాంతరంలో నారీ కేల ముక్కలతో, రావి మారేడు జువ్వి జమ్మి నేరేడు సమిధులతో నల్ల నువ్వులు, ఎర్ర గులాబీ లేదా ఎర్రమంత్రాల పుష్పాలతో హోమం.
శిష్యుడు: ఫలప్రాప్తి ఎంతకాలంలో?
గురు: తంత్రంలో చెప్పిన ప్రకారం, కలియుగంలో కాళీ సాధన 108 రోజుల్లో నుంచే సూచనలిస్తుందని, సిధ్ధి సాధారణంగా 6 నెలల నుండి 1 సంవత్సరంలో వస్తుందని చెప్పబడింది — కానీ ఇది గురుకృప, భైరవానుగ్రహం ఆధారంగా మరింత త్వరగా కూడా జరగవచ్చు.
శిష్యుడు: కాళీ ప్రత్యక్షం ఎలా తెలుస్తుంది?
గురు: రాత్రి జపంలో వెలుగు, దేహంలో శక్తి ప్రవాహం, మంత్రస్వరానికి సమాధి స్థితి, కలల్లో దేవీ దర్శనం, ఆజ్ఞాచక్రంలో నీలకాంతి దీప్తి — ఇవన్నీ మొదటి సూచనలు. ఆ తర్వాత ప్రత్యక్ష రూపంలో దర్శనం, ఆజ్ఞల ప్రసాదం వస్తాయి.
తంత్ర ప్రామాణిక మూలాలు:
కాళికా పురాణం, అధ్యాయాలు 61–65
మహానిర్వాణతంత్రం, ఉమామహేశ్వర సంభాషణ
కాళీ తంత్రం, కాళీ ప్రత్యక్ష సాధన విధి పటలం
॥ జై మా కాళీ ॥
కలియుగంలో సత్వరసిద్ధి ప్రసాదయిత్రి, కాలనాథ సహచారిణి, భక్తానుగ్రహకారిణి మహాకాళీకే నమః
మీ అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ కాలభైరవ గురు సంస్థాన మఠం రాజమండ్రి.