S.S Akshaya Seva Samithi

Call Directions Contact the organization

S.S Akshaya Seva Samithi non profit Organization

కాలభైరవ స్వామి దేవస్థానం ,పుష్పగిరి గిరివలయం.90 30 65 66 67
09/09/2026

కాలభైరవ స్వామి దేవస్థానం ,పుష్పగిరి గిరివలయం.
90 30 65 66 67

09/08/2026
*బహుళ అష్టమి పూజా (కాలభైరవ అష్టమి,శతభిష నక్షత్రం  కాలభైరవ స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన రోజు)  8/6/2026 (సోమవారం)..* ...
05/06/2026

*బహుళ అష్టమి పూజా (కాలభైరవ అష్టమి,శతభిష నక్షత్రం కాలభైరవ స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన రోజు) 8/6/2026 (సోమవారం)..*

*మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం కలదు...*

భక్తులు అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటున్నాము

*కాలభైరవ స్వామి దేవస్థానం,*

*పుష్పగిరీ, గిరివలయం.*
*90 30 65 66 67*

14/05/2026

16/5/2026 శనివారం (వైశాఖ అమావాస్య)

*కాలభైరవ స్వామి దేవస్థానం పుష్పగిరి గిరివలయం..*

*వైశాఖ అమావాస్య పూజ..* (శనివారం రోజు).. *ఉదయం 8గంటలకు*

*కాలభైరవ స్వామి దేవస్థానం వద్ద వైశాఖ అమావాస్య సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు జరుగును ..🙏🙏🙏🙏..*

*భక్తులకు మధ్యాహ్నం అన్నప్రసాదం కలదు*

కాలభైరవ స్వామి వారికి (మినప వడ)గారెల మాల సమర్పించడం వల్ల గ్రహ దోషాలు మరియు అపమృత్యు భయాలు తొలగుతాయని నమ్మకం.

*భక్తులు అభిషేకం కార్యక్రమములో పాల్గొనధలచినవారు సంప్రదించండి...*

*ప్రతినెలా కాలభైరవ అష్టమి ,అమావాస్య, అష్టమి, పౌర్ణమి నాడు ప్రత్యేక పూజలు జరుగును తదుపరి అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించబడును...*

*శ్రీపాద శ్రీ వల్లభ అక్షయ సేవ సమితి.*
*90 30 65 66 67*

09/03/2026

11/3/2026 *కాలాష్టమి పూజా..* (బుధవారం రోజు).. *ఉదయం 8గం*

*కాలభైరవ స్వామి దేవస్థానం పుష్పగిరి గిరివలయం..*

*మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాదం కార్యక్రమం కలదు (అన్నదానం)*

కాలభైరవ స్వామి దేవస్థానం వద్ద అష్టమి సందర్భంగా పూజా కార్యక్రమాల జరుగును ..🙏🙏🙏🙏..*

విశేష కార్యసిద్ధి కాలభైరవ దీపపూజ , హారతి సేవ,పూల అలంకరణ సేవా,
నిమ్మకాయల మాల సేవా.
వడమాల సేవా. *(109 మినప వడలు)* పంచామృత అభిషేకం సేవా,ప్రత్యక్షంగా పాల్గొనేవారు సంప్రదాయ దుస్తులు ధరించి రావలెను).

*అత్యంత శక్తివంతమైన కాలభైరవ కంకాల హారతి స్వయానా భక్తుల చేతులమీదుగా స్వామి వారికి హారతి ఇచ్చే అవకాశం కలదు*

*అన్నదాన సేవా: అన్నదానం అంటే జీవం,ఒక పవిత్రమైన పుణ్యకార్యం,అన్నదానం మన భారతీయ సనాతన ధర్మంలో సంస్కృతిలో, ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఎల్లపుడు ఒక ముఖ్యభాగం...*

*శ్రీపాద శ్రీ వల్లభ అక్షయ సేవ సమితి.*
90 30 65 66 67

విజయవాడ, 3/3/2026*రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సేవా పురస్కారం**(WORLD WILD LIFE) అంతర్జాతీయ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా శ్...
03/03/2026

విజయవాడ, 3/3/2026

*రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సేవా పురస్కారం*

*(WORLD WILD LIFE) అంతర్జాతీయ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా శ్రీపాద శ్రీ వల్లభ అక్షయ సేవా సమితి జంతువులకు చేస్తున్న సేవా కార్యక్రమం లో బాగముగా గౌ౹౹ ఉపముఖ్యమంత్రివర్యులు (అటవీ శాఖ మాత్యులు) కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చేత్తులమీదుగా ఈరోజు మీ అంద్దరి సహకారంతో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సేవా పురస్కారం అందుకోవడం జరిగినది.....*

*శ్రీపాద శ్రీ వల్లభ అక్షయ సేవా సమితి.*
*90 30 65 66 67*

04/02/2026

అందరికి 🙏🙏🙏🙏 విన్నపము...

మహాశివరాత్రి పండుగ రోజు కాలభైరవ స్వామి దేవస్థానం వద్ద స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ....

1000 మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది....

ఈ సేవా కార్యక్రమాలకు మీ అందరి సహకారం ఏంతగానో అవసరం ఉన్నది కావున ప్రతి ఒక్కరు స్పందించి ఈ సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకవెళ్తారని ... దిగ్విజయంగా నిర్వహించి ఈ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొన వలసినదిగా కోరుకుంటున్నాము....🙏🙏🙏

90 30 65 66 67

14/01/2026

*18-1-2026.... ఆదివారం అమావాస్య* చాలా మంచి శక్తివంతమైన రోజు..

కాలభైరవ స్వామి దేవస్థానం పుష్పగిరి గిరివలయం. 18/1/2026 ఆదివారం అమావాస్య.. ప్రత్యేక పూజాకార్యక్రమాలు మరియు అన్నదానం నిర్వహించబడును..

కాలమును శాసించువాడే కాలభైరవుడు..

ఈ కాలభైరవ అష్టమి నాడు...
దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వారు..
అప్పుల వలన ఇబ్బంది పడేవారు.
కోరిన కోర్కెలు తీరని వారు...
కాలభైరవ స్వామిని పూజించడం వలన మేలు కలుగుతుంది...

*కూష్మాండ దీపం..*

ముందుగా 2డు ప్లేట్స్ తీసుకొని వాటిలో కళ్లు ఉప్పు,నవధాన్యలు వేసి పూవులు ఉంచి..
ఒక బూడిద గుమ్మడికాయ తీసుకొని మధ్యకు కోసి. దానిలో గింజలు గుజ్జు తీసివేసి.. ఒరిజినల్ నువ్వుల నూనె వేసి ఆ గుమ్మడికాయ చుట్టూ పసుపు పూసి, కుంకుమ బొట్లు పెట్టి .. ఎర్రని వత్తి , నల్లని వత్తివేసి దీపం వెలిగించి.. కాలభైరవ స్వామి ముందు ఉంచి . రెండు గుమ్మడి దీపాలు వెలిగించి.. కాలభైరవ అష్టకం ఎనిమిది సార్లు చదువుకొని.. మీ సమస్యలు కాలభైరవ స్వామికి చెప్పుకోవడం ద్వారా.. కాలభైరవ స్వామి అనుగ్రహం లభిస్తుంది అని చెప్పవచ్చు... *శని గ్రహ పీడ వలన ఇబ్బంది పడేవారు.*
*అర్ధాష్టమ శని, అష్టమ శని ఏలినాటి శని దోషం ఉన్నవారు..*
*శని మహాదశ నడుస్తూ శని వలన ఇబ్బంది పడేవారు.. ఇటువంటివారు అందరికీ అద్భుతమైన వరం అనే చెప్పాలి..*

కాలభైరవ అష్టకం
************
1--దేవ రాజ సేవ్య మాన పావనాగ్రీ పంకజం.!
వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం!
నారదాది యోగి బృంద వందితం దిగంబరం!
కాశి కాపురాధినాధ కాలభైరవం భజే!
2-- భాను కోటి భాస్వరం బావాబ్ది తారకం పరం!
నీలకంఠ మిప్సి తార్ధదాయకం త్రిలోచనం!
కాల కాల మంబుజాక్ష మక్షశూల మక్షరం!
కాశికా పురాదినాధ కాలభైరవం భజే!
3-- శూలటంక పాశ దండ పాణిమాది కారణం!
శ్యామ కాయ మాది దేవ మక్షరం నీరామయo!
భీమ విక్రమం ప్రభుత్వం విచిత్ర పాండవప్రియo!
కాశి కా పురాదినాథ కాలభైరవం భజే!
4-- భుక్తి ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం!
భక్తవత్సలం స్థితం సమస్త లోక విగ్రహం!
నిక్వణ న్మ నోజ్ఞ హేమ కింకిణి ల సత్కటిం!
కాశికా పురాదినాధ కాలభైరవం భజే!
5-- ధర్మసేతు పాలకం త్వ ధర్మ మార్గ నాశకం!
కర్మ పాశ మోచకం సుశర్మదాయకం విభుం!
స్వర్ణ వర్ణ కేశపాశ శోభితాంగ మండలం!
కాశికా పురాదినాధ కాలభైరవం భజే!
6-- రత్నపాదుక ప్రభాభిరామ పాదయుగ్మకం!
నిత్యమద్వితీయ మిష్ట దైవతం నిరంజనం!
మృత్యుధర్ప నాశనం కారాళ ధంస్ట్ర భీషణం!
కాశికాపురాధినాధ కాలభైరవం భజే!
7-- అట్టహాస భిన్న పద్మ కాండ కోటి సంతతిం!
దృష్టి పాత నష్ట పాప జాలముగ్ర నాశనం!
అష్టసిద్ధిదాయకం కపాల మాలికాధరం!
కాశికాపురాధినాధ కాలభైరవం భజే!
8-- భూత సంఘ నాయకం విశాల కీర్తి దాయకం!
కాశి వాసి లోక పుణ్య పాప శోధకం విభుం!
నీతి మార్గ కోవిదం పురాతనం జగత్ప్రభం!
కాశికాపురాధినాథ కాలభైరవం భజే!.
----------
కాలభైరవాష్టకం పటం కాలభైరవాష్టకం పఠం తియే మనోహరం!
జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం!
శోక మోహ దైన్య లోభ కోప తాప నాశనం!
తే ప్రయాంతి కాలభైరవాంగ్రీ సన్నిధం ధ్రువం!!...
ఈ కాలభైరవ అష్టకం కనీసం7 8సార్లు ప ఠిo వలన మేలు కలుగుతుంది......
కాల కాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏....

20/12/2025

మార్గశిర అమావాస్య సందర్భంగా పుష్పగిరి గిరివలయం లోని కాలభైర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి,అన్నప్రసాదం వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది.

అన్నప్రసాదం కి సహాయం అందించినటువంటి దాతలందరికి మా ధన్యవాదాలు..

శ్రీపాద శ్రీ వల్లభ అక్షయ సేవా సమితి.
9030656667

15/12/2025

కాలభైరవ స్వామి జయంతి (మార్గశిర బహిళ అష్టమి) సందర్భంగా పుష్పగిరి గిరివలయం లోని కాలభైరవ స్వామి దేవస్థానం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి .. భక్తులకు అన్నప్రసాదం వితరణ కార్యక్రమము నిర్వహించడం జరిగినది... 9030656667.

ప్రతినెల బహుళ అష్టమి,అమావాస్య, అష్టమి నాడు అన్నదానం నిర్వహించబడును..

Address

Lingapuram Village
Proddatur Locality
516362

Telephone

+918688188191

Website

Alerts

Be the first to know and let us send you an email when S.S Akshaya Seva Samithi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to S.S Akshaya Seva Samithi:

Shortcuts

Share