All Telangana Sangh Editors

All Telangana Sangh Editors I believe if culture, tradition, and heritage were currency we would be the richest country in the world.

21/04/2025

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - సికింద్రాబాద్ భాగ్*🚩🚩🚩🚩🚩🚩🚩🚩
శాఖ సంగమం
(ఏప్రిల్ 20,2025, ఆదివారం)

సంఘ శతాబ్ది (2025 - 26)*
పూర్వతయారీలో భాగంగా సికింద్రాబాద్ భాగ్ లోని 78 బస్తీల నుండి 98 శాఖల నుండి 943 మంది స్వయంసేవకులు శాఖ సంగమంలో పాల్గొన్నారు...

కార్యక్రమంలో వక్తగా *శ్రీ లింగం శ్రీధర్ జి (ఆర్ఎస్ఎస్ - తెలంగాణ ప్రాంత ప్రచారక్) మాట్లాడుతూ......,
సంపూర్ణ హిందూ సమాజ సంఘటనే లక్ష్యంగా,సమాజ పరివర్తన కై భారత్ ను సశక్త సమర్థభారత్ గా తీర్చిదిద్ది విశ్వగురువుగా భారత్ ను తీర్చిదిద్దుటకై శాఖ మాధ్యమంగా సంఘ్ గడిచిన వంద సంవత్సరాలుగా ముందుకు సాగుతుంది.

ప్రస్తుత దేశ కాలమాన పరిస్థితులలో హిందూ సంఘటిత సమాజమే దేశానికి శ్రీరామరక్షయనీ, దేశ విచ్చిన్నకర శక్తులు ఎన్ని సమస్యలు సృష్టించిన సమాజసేవే లక్ష్యంగా సకారాత్మక దృక్పథంతో సమాజంలో అన్ని రంగాల వారిని కలుపుకుని స్వయంసేవకులు ముందుకు సాగుతున్నారని ఈ ఫలితం గానే దేశం అనేక సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రస్తుతం పరిష్కారం లభిస్తుందని తెలిపారు..

వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ప్రతిరోజు శాఖలో పాల్గొంటూ స్వయంసేవకులు తమను తాము తీర్చిదిద్దుకుంటూ సమాజ పరివర్తనకై పనిచేస్తున్నారని* కావున *నిత్య శాఖలో ఉపస్థితి ఉండడం స్వయంసేవకుల ప్రథమ కర్తవ్యం* అని తెలిపారు.

ఈ సంగమంలో....,
బాల, తరుణ, ప్రౌడ స్వయంసేవకులు పాల్గొన్నారు...

భారత్ మాతాకీ జై*🚩
సంఘ కార్యమే ఈశ్వరీయ కార్యం*🙏

09/03/2025

ఎన్నాళ్ళు దిద్దితే అక్షరాలు వచ్చాయి. ఎంత అధ్యయనం చేస్తే పండితుడు అవుతున్నాడు.
దేశకార్యంకూడా ఎంతో అభ్యాసం చేస్తేనే కాని అలవాటుగా మారదు..

హిందీని జాతీయ భాషగా చేసే అంశంపై దక్షిణ భారతదేశంలో పెద్ద ఎత్తున వివాదం నడుస్తున్న సమయం అది.  తమిళ సంస్కృతిని అభిమానించే ఒ...
07/03/2025

హిందీని జాతీయ భాషగా చేసే అంశంపై దక్షిణ భారతదేశంలో పెద్ద ఎత్తున వివాదం నడుస్తున్న సమయం అది.
తమిళ సంస్కృతిని అభిమానించే ఒక దినపత్రిక సంపాదకుడు
శ్రీ కరిముత్తు త్యాగరాజ చెట్టియార్ 1962 వ సంవత్సరంలో ఒక రోజున పూజనీయ శ్రీ గురూజీని ఇలా ప్రశ్నించాడు.,

హిందీని జాతీయ భాషగా చేయవలసిన అవసరం ఏమిటి ?

శ్రీ గురూజీ ఇలా వివరణ ఇచ్చారు ,

"మన సంస్కృతిలోని గొప్ప అంశాలను తెలియజేసే అన్ని భాషలు నూరు శాతం జాతీయ భాషలే, హిందీ ఒక్కటే జాతీయ భాష కాదు , తమిళం కూడా జాతీయ భాషలలో ఒకటి. అయితే విశాలమైన మన దేశంలో విదేశీ భాష అయిన ఆంగ్లం స్థానంలో అందరినీ కలుపగల భాష ఒకటి అవసరం కదా! అలాంటి అవసరం ఉందని మీకు అనిపించటం లేదా "..

ఈ సమాధానం విని సంతృప్తి చెందిన
శ్రీ చెట్టియార్ శ్రీ గురూజీ తో హృదయపూర్వకంగా ఏకీభవించాడు.

( శ్రీ గురూజీ దృష్టి - దార్శనికత నుండి)

మనమంతా పిచ్చోళ్ళమే.     1987 డిశంబర్ 26- 28 తేదీలలో బిఎంఎస్ అఖిల భారతీయ సమావేశాలు బెంగళూరు లో  జరిగాయి.బిఎంఎస్ కార్యకర్త...
02/03/2025

మనమంతా పిచ్చోళ్ళమే.

1987 డిశంబర్ 26- 28 తేదీలలో బిఎంఎస్ అఖిల భారతీయ సమావేశాలు బెంగళూరు లో జరిగాయి.బిఎంఎస్ కార్యకర్తలకు మార్గదర్శనం చేయడానికి అప్పటి ఆరెస్సెస్ సహ సర్ కార్యవాహ శ్రీ హొ.వె.శేషాద్రి జీ వచ్చారు. ఆయన ఉపన్యాసానికి ముందు, ఆయనను పరిచయం చేయడానికి ఒక కార్యకర్త వేదిక మీదకు రాగా శ్రీ దత్తోపంత్ జీ ,అతడిని ఆపి,నేను పరిచయం చేస్తాను అన్నారు. కార్యకర్తలనుద్దేశించి ,స్వాతంత్ర్యం రాకముందు దేశం కోసం తమకున్నదంతా సమర్పణ చేయాలనుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉండేది.‌అయితే నేడు దేశం స్వతంత్రమైంది కాబట్టి అలాంటి పిచ్చోళ్ళు నేడు లేరు. తెలివిగలవాళ్ళంతా తమకు, తమ కుటుంబానికి ఏదో ఒకటి సంపాదించాలని తమ జీవితమంతా ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో కూడా భారతదేశంలో ఒక పరిశ్రమ ( ఫ్యాక్టరీ ) నడుస్తోంది. అది దేశం కోసం అవసరమైతే అన్నింటినీ వదిలిపెట్టేయగల పిచ్చోళ్ళను తయారుచేస్తోంది.‌అక్కడ తయారైన పిచ్చోళ్ళు , భారతమాత కోసం తమ ప్రాణం, జీవితం తమ చదువు మొదలగు వాటన్నింటిని తృణప్రాయంగా వదలిపెట్టగలరు. అలాంటి పిచ్చోళ్ళను తయారుచేసే ఫ్యాక్టరీకి డిప్యూటీ డైరెక్టర్ , సంఘ భాషలోనైతే సహ సర్ కార్యవాహ అని పిలవబడే వ్యక్తి మనమధ్య ఉన్నారు అన్నారు. ఈ పరిచయ వాక్యాలు విన్న కార్యకర్తలంతా చాలాసేపు చప్పట్లు మారుమ్రోగించారు. ఆ తర్వాత ఉపన్యసించడానికి లేచిన శ్రీ శేషాద్రి జీ , ఈ రోజు నా అసలైన పరిచయాన్ని విని చాలా అనందపడుతున్నాను. నేను స్వయంగా పిచ్చోణ్ణి కావడంతోబాటు, నా అసలు పరిచయం తెలుసుకుని, నవ్వినవాళ్ళంతా కూడా పిచ్చోళ్ళే కావడం, చప్పట్లు కొట్టి నన్ను స్వాగతించినవాళ్ళూ పిచ్చోళ్ళే కావడం నాకు మరింత సంతోషాన్నిస్తోంది. ఒక మంచి సుసందర్భంలో ఒక పిచ్చోడు అనేకమంది పిచ్చోళ్ళ సభలో పాల్గొనడం మరింత సౌభాగ్యంగా భావిస్తున్నాను అన్నారు.

26/02/2025

హిందువులలో శక్తికి, యుక్తికి, భక్తికి కొదవలేదు... కానీ నేను అనే అహంకారాన్ని పక్కకు పెట్టి తోటి వారితో కలిసి పనిచేయగలిగితే హిందుత్వాన్ని ఎదిరించే శక్తి ఇంకెవరికి ఉండదు.

 #ఆరెస్సెస్ గురించి కొన్ని కఠోర నిజాలు....మొదటిది ఆరెస్సెస్ ఏమీ రుచికరమైన సంస్థ కాదు...మోదీని..మరో రాజకీయ నాయకుడ్ని చూసి...
26/02/2025

#ఆరెస్సెస్ గురించి కొన్ని కఠోర నిజాలు....

మొదటిది ఆరెస్సెస్ ఏమీ రుచికరమైన సంస్థ కాదు...

మోదీని..మరో రాజకీయ నాయకుడ్ని చూసి ఆరెస్సెస్ లో జేరితే ఏమీ అర్థం కాదు...

బీజేపీ లేదా ఏ అయోధ్య రామ మందిర నిర్మాణ సంస్థనో చూసి ఆరెస్సెస్ ను అర్థం చేసుకోలేరు...

ఆరెస్సెస్ నడిపే శాఖ చాలా విచిత్రంగా ఉంటుంది...

ఓ నలభై నిమిషాలు వ్యాయామాలే ఉంటాయి...

కాకపోతే సూర్యనమస్కారాలు...కబడ్డీ...కొద్దిగా యోగా ఇలాంటివి...

కాస్సేపు అడుగులో అడుగు కలిపి చేసే మార్చ్ ఫాస్ట్ లాంటి డ్రిల్ ఉండచ్చు...

మిగతా ఇరవై నిమిషాలు...దేశభక్తి పాట...ఒక మంచి శ్లోకం...కొంచెం సేపు చిన్న కథ..అంతే...

ఆదివారం కొద్దిగా ఓ అరగంట ఎక్కువ టైము ఉంటే...ఒక చర్చ...లేదా పెద్ద దేశ భక్తుని కథ...ఎవరైనా వస్తే చరిత్ర...సమకాలీన అంశం పై ఉపన్యాసం ఉండచ్చు...

అంతే...ఇంకేమీ ఉండదు...

వంద సంవత్సరాలుగా ఇదే తంతు...

రోజూ కలుస్తారు కాబట్టి...కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు ఉంటాయి...

నలుగురు కలిసి నాలుగు మంచిమాటలు మాట్లాడుకుంటారు కాబట్టి...అలా వెళ్ళి ఏవో నాలుగు మంచి పన్లు చేద్దాం అన్న ఫీలింగ్ కలిగితే అది ఆరెస్సెస్ తప్పు కాదు...

జిహ్వకో రుచి...పుర్రెకో బుద్ధి అన్నారు కాబట్టి...ఏదో ఒకటి నచ్చి ఆ పనిలో నిపుణత పెంచుకుంటే....ఆ శాఖకి వచ్చే ఎవరో ఒకరు సహాయ పడొచ్చు...ప్రోత్సహించచ్చు..అదీ ఆరెస్సెస్ తప్పు కాదు....

ఇంక శాఖకు వచ్చే వాళ్ళు కూడా ఈ గొప్ప సమాజం లోంచే కాబట్టి... ఆశలు.. గోసలు...ఎక్స్ట్రాలు అన్నీ ఉండచ్చు...

బుద్ధి కర్మానుసారిణే అన్నారు కాబట్టి...రాజకీయాలు... రొంపి...గొప్ప సమాజ సేవ...ఏదో ఒకటి పద్ధతిగా చెయ్యడం అలవాటు అవుతుంది...

బుద్ధిమంతుడు అయ్యే లక్షణాలు ఉన్నవాడు ఆరెస్సెస్ లోకి వస్తాడా...వచ్చిన తరువాత బుద్ధిమంతుడు అవుతాడా అన్నది నాకు ఇప్పటివరకూ అంతు బట్టలేదు...

ఆరెస్సెస్ బీజేపీలోకి వెళ్లడానికి చాలా దూరం దారి...

అదేదో షార్ట్ కట్ అనుకుని వచ్చాడా....వాడి పులుసు కారిపోతుంది...

ఇంకో గొప్ప చిత్రమైన స్థితి ఏమిటంటే...శాఖకి ఇప్పుడు మానేసిన ప్రతి వాడు నేను శాఖకి వెళ్ళినప్పుడు ఆరెస్సెస్ మా గొప్పగా ఉండేది అని చెప్పుకుంటాడు...

ఇప్పుడంతా అప్పటిలా లేదు అనుకుంటాడు...

మారింది వీడి ఫేసు...తెల్లబడిన మీసాలు తప్ప...అద్దం లాంటి ఆరెస్సెస్ కాదు అని తెలుసుకుని మళ్ళీ ఏదో ఒక పనిలో దూరి జీవితాంతం ఆరెస్సెస్ స్వయం సేవక్ ను అని బ్రతుకుతాడు...

ఇన్ని నిజాలు తెలుసుకుని కూడా శాఖకి వెళితే...ఇంక వాడ్ని ఎవ్వరూ బాగుచెయ్యలేరు...

అలా దేశం కోసం పరితపిస్తూ కన్ను ముయ్యాల్సిందే...వాడి స్వంతానికి ఏం లభించినా లభించక పోయినా...

ఇప్పుడు కూడా శాఖకి పోతున్నా...ఏమైనా కొత్తగా తెలుస్తుంది ఏమో అని...

మీ ఇష్టం మీది....

మర్చిపోయా...అరెస్సెలో చేరడానికి సభ్యత్వం గట్రాలు ఏమీ ఉండవు...డైరెక్ట్ గా వెళ్లిపోయి అక్కడ ఉన్న ధ్వజానికి ప్రణామం చెయ్యడమే...

ఇంత సింపుల్...

జైహింద్!

25/02/2025

కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలతో సమాజంలో పరివర్తన రాదు... ఆచరణాత్మక జీవితాన్ని స్వతహాగా మన నుండే ప్రారంభించాలి... అలా ఆచరించే వ్యక్తుల సముదాయమే సంఘ్...

24/02/2025
24/02/2025

నిష్కామ కర్మతో, నిస్వార్ధంగా సేవ చేస్తూ, సంఘాన్ని తన ఆస్తిగా భావించే స్వయంసేవకులతోనే సంఘ్ తన వికాస క్రమాన్ని ముందుకు సాగిస్తుంది. #కార్యకర్త

 #వలస జీవికి స్వయంసేవకుల అంతిమ సంస్కారంబతుకుదెరువు కోసం ఎక్కడో బిహార్‌ ‌నుంచి తెలంగాణకు వచ్చిన 57 ఏళ్ల వ్యక్తి ప్రమాదవశా...
24/02/2025

#వలస జీవికి స్వయంసేవకుల అంతిమ సంస్కారం

బతుకుదెరువు కోసం ఎక్కడో బిహార్‌ ‌నుంచి తెలంగాణకు వచ్చిన 57 ఏళ్ల వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణించాడు. ప్రభుత్వ ఆస్పత్రి మార్చురిలో ఉన్న అతడి పార్థివదేహానికి కన్నకొడుకుతో తలకొరివి పెట్టించడానికి, గౌరవ ప్రదంగా, సంప్ర దాయ బద్ధంగా అంతిమ సంస్కారాలు జరిపించడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌స్వయంసేవకులు ముందుకు వచ్చారు. ఈ విషయంలో ఢిల్లీ నుంచి తెలంగాణ దాకా యావత్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వ్యవస్థ అనిర్వచనీయమైన కృషి చేసింది. మానవత్వాన్ని మహోన్నత స్థానంలో నిలిపింది.
దీనికి దారితీసిన ఆ విషాద ఘటన ఫిబ్రవరి 2న తెలంగాణలో పెద్దపల్లి జిల్లా, ఓదెల సమీపంలో రాయ్‌పూర్‌ ‌సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ ‌రైలులో చోటుచేసుకుంది. బిహార్‌లో కటిహార్‌ ‌జిల్లా, రాంపదకు చెందిన 57 ఏళ్ల సంతోష్‌ ‌మహతో కదులుతున్న రైలు నుంచి ప్రమాదవ శాత్తూ జారిపడి మరణించారు. సంతోష్‌ ‌బిహార్‌లో ఉన్న తన కుటుంబానికి అండగా ఉండ టం కోసమని హైదరాబాద్‌లోని ఓ బేకరిలో పని చేస్తున్నారు.
సంతోష్‌ అకాల మరణం ఆయన 19 ఏళ్ల కుమారుడు రోహిత్‌ ‌మహతో, ఇతర కుటుంబ సభ్యుల్లో పెను విషాదాన్ని నింపింది. రోహిత్‌ ‌స్వయంసేవక్‌. ‌సాటి స్వయంసేవక్‌కు సాయపడ డానికి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సకాలంలో ముందుకు వచ్చింది.
రాంపదలో స్వయంసేవకులు విషాద వార్తను ఢిల్లీలోని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పెద్దలకు వెంటనే చేర వేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌స్వయంసేవకులు అక్కడి నుంచి తెలంగాణలో గోదావరిఖని దాకా చకచకా పనులు చేయడం మొదలుపెట్టారు.
సంతోష్‌ ‌మృతదేహం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో ఉండగా మిగిలిన ఏర్పాట్లు జరిగిపో సాగాయి. గోదావరిఖని, రామగుండంలోని స్వయం సేవకులు బాధితులకు భావోద్వేగ పూరితమైన ఊరటను అందించడంతో సరిపుచ్చక కీలకమైన రవాణా ఏర్పాట్లు, తదితరాలకు ఆర్థిక సాయం అందించారు.
రోహిత్‌ ‌మహతో స్వయంసేవకుల సమ న్వయంతో ఫిబ్రవరి 3న బిహార్‌ ‌నుంచి హైదరా బాద్‌కు విమానంలో చేరుకున్నారు. తోడ బుట్టినవారి కన్నా మిన్నగా ఆదుకున్న స్వయం సేవకుల సమక్షంలో అదే రోజు 3 గంటలకు తన తండ్రికి అంతిమ సంస్కారాలు చేశారు. స్వయంసేవకులు రోహిత్‌ ‌మహతో తిరిగి స్వస్థలానికి చేరుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను అవిశ్రాంతంగా చేశారు. అడు గడుగునా అతడికి అండగా ఉన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో బాధిత కుటుంబం మోయ లేని భారాన్ని తమదిగా చేసుకున్నారు. చోటు కాని చోటులో కన్నుమూసిన సంతోష్‌ అనాథలా మిగిలిపోకుండా అన్నీ తామైన స్వయంసేవకులు గౌరవప్రదమైన రీతిలో అంతిమ సంస్కారాలు జరిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చారు. రోహిత్‌తో తలకొరివి పెట్టించడం ద్వారా అతడితో తండ్రి రుణం తీర్చుకునేలా చేశారు.

24/02/2025

నిర్మాణాత్మక పనులు ఉద్వేగాలతో జరుగవు. వెయ్యి సం"రాల విదేశీ మతాల దాడిలో ఆత్మవిస్మృతికి లోనైన హిందూ సమాజ పునర్నిర్మాణం జరగాలంటే నిత్య నిరంతర సాధన అవసరం.

23/02/2025

ధర్మం కోసం ఏమైనా చేస్తాం అనేవారు ఉదయం లేచి శాఖలో ఒక గంట సేపు శారీరిక, బౌద్ధిక కార్యక్రమాల్లో పాల్గొనలేరా..?? #వ్యక్తి నిర్మాణమే దేశ నిర్మాణం #సంఘ శాఖ

Address

Namapalli
503111

Website

Alerts

Be the first to know and let us send you an email when All Telangana Sangh Editors posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share