బెల్డోణ గ్రామము

బెల్డోణ గ్రామము బెల్డోణ గ్రామవాసుల ఆత్మీయ వేదిక

తెలుగు వారి సంస్కృతి సంప్రదాయ నిలయాలు, అనురాగ అప్యాయతలకు అనవాళ్ళు మన పల్లెటూళ్ళు. పట్నం మోజులో పల్లె తన ప్రభావాన్ని కోల్పొతుంది తద్వారా మన అచార్య వ్యవహరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది కావున వాటిని కాపాడుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. తెలుగు తల్లి ఆశీర్వదంతో, రైతన్న బిడ్డలుగా నాటి పల్లె వెలుగులను, మన అచారవ్యవహరాలను భవిష్యత్ తరాలకు అందించవలసిన బాద్యత మనందరి మీద ఉంది. అందుకోసం మా వంతుగా, మా గ్రామం

పేరు మీద మన తెలుగింటి వెలుగు దివ్వె అయిన పల్లెటూరిని మరియు తెలుగు సంస్కృతి , సంప్రదాయలను కాపాడాలి అన్నసంకల్పంతో ఈ విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని భాగస్వాములను చెస్తూ ఈ బెల్డోణ గ్రామము అనే కమ్యూనిటిని ప్రారబించడం జరిగింది.

భక్త మహాశయులారా...శ్రీ భీమలింగేశ్వరస్వామి వారి జీవిత చరిత్ర మరియు వారి మహిమల గురించి మీ అందరికీ తెలియపరచాలి అనే సదుద్దేశ...
17/03/2026

భక్త మహాశయులారా...

శ్రీ భీమలింగేశ్వరస్వామి వారి జీవిత చరిత్ర మరియు వారి మహిమల గురించి మీ అందరికీ తెలియపరచాలి అనే సదుద్దేశంతో ప్రారంభించిన వాట్సాప్ ఛానల్ మరియు గ్రూప్ లకు విశేష స్పందన వచ్చింది. ఇందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏

ఇంకా ఎవరైనా మన చానల్ ను ఫాలో కాకపోతే, దయచేసి వారు ఈ లింక్ మీద క్లిక్ చేసి ఫాలో అవ్వవచ్చు.

Follow the శ్రీ భీమలింగేశ్వరస్వామి జీవిత చరిత్ర channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VbBwRFdE50UcbCIj8Q2V

రండి అందరం కలిసి స్వామి వారి జీవిత చరిత్ర మరియు వారి మహిమలను ప్రాపంచికం చేద్దాం.

ఓం నమో శ్రీ భీమలింగేశ్వరాయ నమః 🙏

#భీమకవి #వేములవాడభీమకవి #శ్రీభీమలింగేశ్వరస్వామి శ్రీ భీమలింగేశ్వరాయ స్వామి దేవస్థానం. బెల్డోన్ గ్రామం శ్రీ వేములవాడ భీమలింగేశ్వర స్వామి అధ్యయన కేంద్రం

Follow శ్రీ భీమలింగేశ్వరస్వామి జీవిత చరిత్ర's WhatsApp channel. ప్రియ భగవద్ బంధువులారా 🙏🙏

అందరికీ నమస్కారం

శ్రీ భీమలింగేశ్వరస్వామి జీవిత చరిత్రను మరియు వారి మహిమలను అందరికీ తెలియజేయాలి అనే సద్దుదేశ్యం తో ఈ ఛానల్ ను ఏర్పాటు చేయడం జరిగింది.

ఇక్కడ ఛానల్ లో చేరిన వారు, మీ కుటుంబ సభ్యులను, మిత్రులను, బంధువులను, తెలిసిన వారిని ఈ ఛానల్ ఫాలో అవ్వమని చెప్పండి.

ఈ ధార్మిక ప్రచార కార్యక్రమంలో మీ అందరి సహకారం కోరుతూ...🙏🙏

సదా స్వామి వారి సేవలో...
భీమేష్ కాచరగడ్ల (రఘు)
వ్యవస్థాపకులు
శ్రీ భీమలింగేశ్వరస్వామి జీవిత చరిత్ర ప్రచార సమితి
https://shribheemalingeswaraswamy.blogspot.com. Join 65 followers for the latest updates.

ప్రియ భగవద్ బంధువులారా 🙏🙏అందరికీ నమస్కారం శ్రీ భీమలింగేశ్వరస్వామి జీవిత చరిత్రను మరియు వారి మహిమలను అందరికీ తెలియజేయాలి ...
14/03/2026

ప్రియ భగవద్ బంధువులారా 🙏🙏

అందరికీ నమస్కారం

శ్రీ భీమలింగేశ్వరస్వామి జీవిత చరిత్రను మరియు వారి మహిమలను అందరికీ తెలియజేయాలి అనే సద్దుదేశ్యం తో ఈ ఛానల్ ను ఏర్పాటు చేయడం జరిగింది.

ఇక్కడ ఛానల్ లో చేరిన వారు, మీ కుటుంబ సభ్యులను, మిత్రులను, బంధువులను, తెలిసిన వారిని ఈ ఛానల్ ఫాలో అవ్వమని చెప్పండి.

ఈ ధార్మిక ప్రచార కార్యక్రమంలో మీ అందరి సహకారం కోరుతూ...🙏🙏

సదా స్వామి వారి సేవలో...
భీమేష్ కాచరగడ్ల (రఘు)
వ్యవస్థాపకులు
శ్రీ భీమలింగేశ్వరస్వామి జీవిత చరిత్ర ప్రచార సమితి
https://shribheemalingeswaraswamy.blogspot.com

Follow శ్రీ భీమలింగేశ్వరస్వామి జీవిత చరిత్ర's WhatsApp channel. ప్రియ భగవద్ బంధువులారా 🙏🙏

అందరికీ నమస్కారం

శ్రీ భీమలింగేశ్వరస్వామి జీవిత చరిత్రను మరియు వారి మహిమలను అందరికీ తెలియజేయాలి అనే సద్దుదేశ్యం తో ఈ ఛానల్ ను ఏర్పాటు చేయడం జరిగింది.

ఇక్కడ ఛానల్ లో చేరిన వారు, మీ కుటుంబ సభ్యులను, మిత్రులను, బంధువులను, తెలిసిన వారిని ఈ ఛానల్ ఫాలో అవ్వమని చెప్పండి.

ఈ ధార్మిక ప్రచార కార్యక్రమంలో మీ అందరి సహకారం కోరుతూ...🙏🙏

సదా స్వామి వారి సేవలో...
భీమేష్ కాచరగడ్ల (రఘు)
వ్యవస్థాపకులు
శ్రీ భీమలింగేశ్వరస్వామి జీవిత చరిత్ర ప్రచార సమితి
https://shribheemalingeswaraswamy.blogspot.com. Join 65 followers for the latest updates.

31/08/2025
'ఏరువాక పున్నమి' విశిష్టత :సాధారణంగా మనం మత సంబంధమైన పండుగలు, జాతీయ పండుగలు, పూజలు, నోములు, వ్రతాలు వంటివి ఎన్నో చేసుకుం...
11/06/2025

'ఏరువాక పున్నమి' విశిష్టత :

సాధారణంగా మనం మత సంబంధమైన పండుగలు, జాతీయ పండుగలు, పూజలు, నోములు, వ్రతాలు వంటివి ఎన్నో చేసుకుంటూ ఉంటాము. కానీ రైతులకు మాత్రమే ప్రత్యేకమైన ఓ పండుగ ఉంది. 'ఏరువాక పున్నమి' పేరిట జరుపుకునే ఈ పండుగ విశేషాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

రైతే రాజు!
మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం. దేశ ప్రగతి మొత్తం వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకే మన దేశంలో ఎన్నటికీ రైతే రాజు. అలాంటి అన్నదాతలకు ప్రత్యేకమైన పండుగ ఒకటుంది. అదే ఏరువాక పౌర్ణమి.

ఏరువాక పౌర్ణమి ఎప్పుడు వస్తుంది?
జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని అంటారు. ప్రతి ఏటా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజును మనం ఏరువాక పౌర్ణమిగా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఏడాది జూన్ 11వ తేదీన జరుపుకోనున్న ఏరువాక పౌర్ణమి విశేషాలను తెలుసుకుందాం.

ఏరువాక పౌర్ణమి అంటే?
రోళ్ళు పగిలే రోహిణి కార్తె వెళ్లి, తొలకరి చినుకులను తెచ్చే మృగశిర కార్తె రాకను స్వాగతిస్తూ జరుపుకునేదే ఏరువాక పౌర్ణమి. వర్ష ఋతువు ప్రారంభంలో వచ్చే ఏరువాక పౌర్ణమి రోజు రైతులు ఎద్దులను, నాగలిని పూజించి దుక్కి దున్నడం ప్రారంభించేవారని ఈ పండుగ గురించి ఋగ్వేదంలో వివరించారు.

కర్షకుల పండుగ
ఏరువాక పౌర్ణమి సహజంగా కర్షకుల పండుగ. భూదేవిని నమ్ముకొని పంటలు పండించే రైతులు వర్ష ఋతువు ఆరంభంలో తొలకరి చినుకు కోసం ప్రార్థిస్తూ వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండి దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఏరువాక పౌర్ణమి రోజును వేడుకగా జరుపుకుంటారు.

ఏరువాక పూజ
ఏరువాక పున్నమి రోజున మట్టిని నమ్మి కష్టించి పని చేసే రైతులు భూమి పట్ల, సమస్త ప్రకృతి పట్ల తన భక్తి ప్రపత్తులు చాటుకుంటూ తమకు వ్యవసాయంలో చేదోడుగా ఉండే ఎద్దులను శుభ్రంగా కడిగి వాటి కొమ్ములకు రంగులు పూసి, రకరకాల గజ్జెలు, గంటలు, పూసల దండలతో, పూల దండలతో సర్వాంగసుందరంగా అలంకరిస్తారు. అనంతరం పొంగలి ప్రసాదాలతో, మంగళ వాయిద్యాలతో పొలాలకు ఊరేగింపుగా వెళ్లి అంగరంగ వైభవంగా పొలం దున్నడం ప్రారంభిస్తారు.

గోగు నార తోరణాలు
అదే రోజు సాయంత్రం గ్రామంలో ఊరి ముంగిట గోగు నారతో చేసిన తోరణాలను కడతారు. ఈ తోరణాల మధ్యలో అక్కడక్కడా జిలేబీలు, గారెలు, కరెన్సీ కాగితాలు ఎత్తులో కడతారు. దీనినే 'ఏరువాక తోరణం' అని అంటారు. రైతులు తమ తమ పశువులను ఈ ఏరువాక తోరణం కిందుగా పరుగులు పెట్టిస్తారు. అప్పుడు వారు ఏరువాక తోరణం నుంచి తమకు దొరికిన వాటిని తీసుకు వెడతారు. దీనిని వారు అత్యంత పవిత్రంగా భావించి తమ పొలాల్లో, ధాన్యాగారంలో దాచి ఉంచుతారు. అలా చేయడం వలన పంటలు సమృద్ధిగా పండి కరువు ఉండదని రైతుల విశ్వాసం.

విదేశాలలో కూడా
యూరప్ వంటి విదేశాలలో కూడా 'మే పాన్' అనే పేరుతో ఈ ఏరువాక పూర్ణమిని జరుపుకుంటారు.

వృక్షో రక్షతి రక్షితః
మానవ జీవితమే ప్రకృతి ప్రసాదం. ప్రకృతి మీద ఆధారపడి జీవించే మానవుడు ప్రకృతిని రక్షించాలి. వర్షాలు కురవడం కోసం చెట్లను విరివిగా పెంచాలి. ప్రకృతి ఆగ్రహిస్తే ప్రళయం తప్పదు. కరువు కాటకాలతో ప్రజలు అల్లాడిపోతారు. అందుకే ప్రకృతిని పరిరక్షించుకోవడం మన బాధ్యత. ప్రకృతిని మనం రక్షిస్తే అదే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది.

మనందరి పండుగ
ఏరువాక పౌర్ణమి పండుగ ఒక్క అన్నదాతకు మాత్రమే కాదు. మనందరికీ పండుగే! ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. దేశమంటే మనమందరం కదా! అందుకే ఈ పండుగ మనందరికీ కూడా పండుగే! ఈ ఏడాది వర్షాలు బాగా కురవాలని పంటలు బాగా పండాలని దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అందరం ఏరువాక పౌర్ణమి పండుగను ఆనందంగా జరుపుకుందాం. -

సర్వే జనా సుఖినోభవంతు లోక సమస్తా సుఖినోభవంతు స్వస్తి

#ఏరువాకపున్నమి #ఏరువాక #రైతు #అన్నదాత #ప్రకృతి #రైతేరాజు #వ్యవసాయం

Address

శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామి ఆధ్యయన కేంద్రం, శ్రీ భీమలింగేశ్వరస్వామి దేవాలయం
Kurnool
518396

Alerts

Be the first to know and let us send you an email when బెల్డోణ గ్రామము posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to బెల్డోణ గ్రామము:

Share