27/08/2026
జై శ్రీమన్నారాయణ!
పరమహంస పరివ్రాజకులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనములతో…
విజయకీలాద్రి దివ్యక్షేత్రముపై
శ్రావణమాస మహోత్సవాలలో భాగంగా 27.08.2026 గురువారం శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి తిరునక్షత్ర మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారికి విశేషంగా అభిషేకం, అలంకరణ, వివిధ పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన మరియు హయగ్రీవ హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వామివారి దివ్యదర్శనం చేసుకొని, పూజా కార్యక్రమాలలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారి దివ్య అనుగ్రహంతో భక్తులందరికీ జ్ఞానం, విద్య, విజయం, సుఖసంతోషాలు, ఐశ్వర్యం సిద్ధించాలని ప్రార్థిస్తూ…
🙏 జై శ్రీమన్నారాయణ! 🙏