Telangana Gulf Workers Association

Telangana Gulf Workers Association Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Telangana Gulf Workers Association, Non-Governmental Organization (NGO), Flat No: #501, Srinilaya Enclave, Ameerpet, Hyderabad.

Telangana Gulf Workers Association (TeGWA) has Launched to serve Deprived and Migrant Victims,

We brought almost 48Dead Bodies from Various Countries back to India,

We also are given Pre-Departure Orientation Seminars at Gulf Migrants Effected Areas.

పుట్టిన మట్టిలో కలిసిపోవడానికి: గల్ఫ్ నుంచి స్వదేశీ ప్రయాణానికి ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న శవం! ◉ బహరేన్ మార్చురీలో 'గుర్త...
23/10/2025

పుట్టిన మట్టిలో కలిసిపోవడానికి: గల్ఫ్ నుంచి స్వదేశీ ప్రయాణానికి ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న శవం!

◉ బహరేన్ మార్చురీలో 'గుర్తింపు' సమస్యతో ఐదేళ్లుగా నిల్వచేయబడ్డ మెట్‌పల్లి వాసి మృతదేహం

◉ 18 ఏళ్లుగా కడు పేదరికంలో ఒంటరిగా నివసిస్తున్న మృతుడి భార్య

◉ జన్మనిచ్చిన తల్లిదండ్రులు, దత్తత తల్లిదండ్రులూ చనిపోయారు

◉ సహాయం కోసం 'సీఎం ప్రవాసీ ప్రజావాణి' ని ఆశ్రయించిన మృతుడి సోదరుడు

బతుకుదెరువు కోసం గల్ఫ్ గడ్డపై అడుగుపెట్టిన ఒక వలసజీవి ఐదేళ్లుగా విగతజీవిగా, బహరేన్ శవాగారంలో 'గుర్తింపు' కోసం వేచిచూస్తున్నాడు. ఆయన కథ, ఆయన కుటుంబ కష్టం పగవాడికి కూడా రావద్దు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణం రాంనగర్ కు చెందిన శ్రీపాద నరేష్ 18 ఏళ్ల క్రితం 2007లో బహరేన్ వెళ్లి, అక్కడ వివిధ పనుల్లో జీవనోపాధి కోసం శ్రమించారు. ఓ దశలో కంపెనీ వదిలి అక్రమ వలసదారుడిగా మారినట్లు సమాచారం. మొదట్లో కుటుంబంతో సమాచార సంబంధాలు కొనసాగించినా, తరువాత పూర్తిగా సంబంధాన్ని కోల్పోయారు.

బహరేన్ లోని ఇండియన్ ఎంబసీ అధికారులను ఉటంకిస్తూ ఇటీవల ఒక పత్రికలో వార్త రావడంతో... శ్రీపాద నరేష్ ఐదేళ్ల క్రితం బహరేన్ లో మృతి చెందిన విషయం వెలుగులోకి వచ్చింది. మృతుడి సోదరుడు ధర్మపురి ఆనంద్ సహాయం కోసం మంగళవారం (21.10.2025) హైదరాబాద్ లో ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ ని ఆశ్రయించారు. నరేష్ మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు సత్వార చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

నరేష్ భార్య శ్రీపాద లత (మునికోట నాగమణి), పిల్లలు లేక ఒంటరిగా తల్లిదండ్రుల ఊరు కలికోట, కథలాపూర్ మండలంలో కడు పేదరికంలో నివసిస్తున్నారు. ఏనాటికైనా తన భర్త వస్తాడని 18 ఏళ్లుగా ఆమె ఎదిరిచూస్తోంది, చివరికి ఇప్పుడు శవమై రాబోతున్నాడు.

ఈ ఆపద సమయంలో మెట్‌పల్లి కి చెందిన గల్ఫ్ కార్మిక హక్కుల కార్యకర్త బొక్కెనపల్లి నాగరాజు, సామాజిక సేవకులు మాడిశెట్టి రాకేష్, మొరపు తేజ లు మృతుడి సోదరుడి ద్వారా ముఖ్యమంత్రికి దరఖాస్తు చేయించారు. తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి వారికి అండగా నిలిచారు. బహరేన్ లోని సోషల్ వర్కర్ కోటగిరి నవీన్ ఇండియన్ ఎంబసీతో సమన్వయం చేస్తున్నారు.

కువైట్‌లో కొత్త వీసాలకు ఇకపై డిపాజిట్‌ అవసరం లేదుకువైట్‌ సిటీ,సెప్టెంబర్ 22: ప్రైవేట్‌ సెక్టార్‌లో కొత్త వీసాలు జారీ చేయ...
19/10/2025

కువైట్‌లో కొత్త వీసాలకు ఇకపై డిపాజిట్‌ అవసరం లేదు

కువైట్‌ సిటీ,సెప్టెంబర్ 22: ప్రైవేట్‌ సెక్టార్‌లో కొత్త వీసాలు జారీ చేయడానికి ఇప్పటివరకు ప్రతి కార్మికుడికి ఒక నిర్దిష్ట డిపాజిట్‌ మొత్తాన్ని స్పాన్సర్లు మానవ వనరుల అభివృద్ధి అధికారికి జమ చేయాల్సిన నిబంధన ఉండేది.

👉 అయితే, ఈ చట్టాన్ని సస్పెండ్‌ చేస్తున్నట్లు మానవ వనరుల అభివృద్ధి అధికారి ఇంజినీర్‌ రబాబ్ అల్-ఆష్మి (21-09-2025) ప్రకటించారు.

🔹 గతంలో, కార్మికుడు మోసపోతే లేదా వేతనం రాకపోతే ఆ డిపాజిట్‌ సొమ్ముతో ప్రభుత్వమే కార్మికుడిని స్వదేశానికి పంపించే ఏర్పాట్లు చేసేది.
🔹 ఒప్పంద కాలం పూర్తి చేసి సురక్షితంగా స్వదేశానికి చేరిన తర్వాత ఆ డిపాజిట్‌ మొత్తాన్ని తిరిగి స్పాన్సర్లకు ఇవ్వబడేది.
🔹 ఇప్పుడు ఈ నిబంధనే పూర్తిగా నిలిపివేయబడిందని అధికారికంగా ప్రకటించారు.

#కువైట్_ముఖ్యాంశాలు #కువైట్_వార్తలు

విజిట్ వీసా ముగిసి మలేషియాలో చిక్కుకున్నాడు భారత్ కు వాపస్ తెప్పించాలని సీఎం కు విజ్ఞప్తి★ తిరుచిరాపల్లి నుంచి కౌలాలంపూర...
05/08/2025

విజిట్ వీసా ముగిసి మలేషియాలో చిక్కుకున్నాడు
భారత్ కు వాపస్ తెప్పించాలని సీఎం కు విజ్ఞప్తి

★ తిరుచిరాపల్లి నుంచి కౌలాలంపూర్ కు తరలించారు

★ ప్రవాసీ ప్రజావాణి ని ఆశ్రయించిన బాధితుడి భార్య

★ నెల క్రితం ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా... చర్యలు లేవు

★ వీసా గడువు ముగిసింది. జరిమానా, రిటర్న్ టికెట్ కోసం డబ్బులు లేవు

మలేషియాలో చిక్కుకుపోయిన నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రానికి చెందిన దేవుసారి శ్రీనివాస్ ను భారత్‌కు వాపస్ తెప్పించాల్సిందిగా ఆయన భార్య లక్ష్మి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేరిట మంగళవారం (05.08.2025) హైదరాబాద్ లో ప్రవాసీ ప్రజావాణి లో ఒక వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ ('తెగువ') ప్రతినిధి బషీర్ అహ్మద్ ఫిర్యాదుదారు లక్ష్మికి తగిన మార్గదర్శనం చేశారు.

2025 మే 8న శ్రీనివాస్ విజిట్ వీసా పై తమిళనాడు లోని తిరుచిరాపల్లి నుంచి మలేసియా రాజధాని కౌలాలంపూర్ కు తరలించారు ఈ ప్రయాణానికి ముందు మాక్లూర్ మండలం చిక్లీ గ్రామానికి చెందిన ఒక రిక్రూటింగ్ ఏజెంట్ కు ₹1 లక్ష కు పైగా చెల్లించాడు. రెస్టారెంట్‌లో పాత్రలు కడిగే ఉద్యోగం, నెలకు ₹30,000 జీతం, ఉచిత భోజనం, వసతి కల్పిస్తానని ఆ ఏజెంట్ హామీ ఇచ్చాడు. అయితే మలేషియాకు చేరుకున్నాక ఏజెంట్ మాట తప్పడంతో శ్రీనివాస్ గత మూడు నెలలుగా ఉద్యోగం లేకుండా ఆహారం, వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

విజిట్ వీసా గడువు ముగియడంతో శ్రీనివాస్‌పై 500 రింగిట్‌ (₹10,000) జరిమానా విధించబడింది. తిరిగి భారత్ రావడానికి సుమారు ₹15,000 అవసరమని లక్ష్మి తెలిపారు. సహాయం కోసం ఏజెంట్‌ను సంప్రదించగా ఆయన ఫోన్ బ్లాక్ చేశారని ఆరోపించారు. ఈ మోసంపై లక్ష్మి నెల క్రితం 2025 జూలై 8న ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

మలేషియాలోని భారత హైకమిషన్, విదేశాంగ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని తన భర్తను త్వరితగతిన భారత్‌కు రప్పించాలని బాధితుడి భార్య లక్ష్మి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. మలేషియాలోని సామాజిక కార్యకర్తలు బురెడ్డి మోహన్ రెడ్డి, వైజాగ్ మల్లేష్ లు శ్రీనివాస్‌కు సహాయం చేస్తున్నారని ఆమె తెలిపారు.

జై శ్రీ రామ్ 🚩 జై భారత్ 🇮🇳తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణనపై ప్రజా ప్రతినిధులు,  కుల సంఘాల మ...
05/11/2024

జై శ్రీ రామ్ 🚩 జై భారత్ 🇮🇳

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణనపై ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల మేధావులతో నిర్వహిస్తున్న సదస్సుకు విచ్చేస్తున్న ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వక స్వాగతం.. సుస్వాగతం.

మీ,
నంగి దేవేందర్ రెడ్డి
ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ ఎన్ఆర్ఐ అఫైర్స్
టీపీసీసీ ఎన్అర్ఐ సెల్.



వివిధ శాఖల ఆధ్వర్యంలోని హాస్టళ్లు, గురుకులాలు, ఇతర విద్యా సంస్థల్లోని విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతి నెలా చెల్లించే డ...
01/11/2024

వివిధ శాఖల ఆధ్వర్యంలోని హాస్టళ్లు, గురుకులాలు, ఇతర విద్యా సంస్థల్లోని విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతి నెలా చెల్లించే డైట్ మరియు కాస్మోటిస్ చార్జీలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రజా ప్రభుత్వం.

డైట్ చార్జీలు: Girls and Boys
3 నుంచి 7వ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు రూ.950 నుంచి రూ.1330కు పెంపు

8 నుంచి 10వ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు రూ.1100 నుంచి రూ.1540కు పెంపు

ఇంటర్ నుంచి పీజీ వరకు విద్యార్థినీ విద్యార్థులకు రూ.1500 నుంచి రూ. 2100కు పెంపు

కాస్మొటిక్ చార్జీలు:
Girls
3 నుంచి 7వ తరగతి విద్యార్థినులకు రూ.55 నుంచి రూ.175కు పెంపు.

8 నుంచి 10వ తరగతి విద్యార్థినులకు రూ.75 నుంచి రూ.275కు పెంపు.
-------
Boys
3 నుంచి 7వ తరగతి విద్యార్థులకు రూ.62 నుంచి 150కు పెంపు

8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.62 నుంచి రూ.200కు పెంపు.

30/10/2024

పబ్లిక్ కోర్ట్ న్యూస్ : అమరావతి,

టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు..

24 మంది సభ్యులో టీటీడీ బోర్డును ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడిని నియమించింది. ఈ మేరకు బుధవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలిలో మొత్తం 24 మంది సభ్యులు ఉండగా.. వీరిలో తెలంగాణ నుంచి ఐదుగురు, కర్ణాటక నుంచి ముగ్గురు, తమిళనాడు నుంచి ఇద్దరు, గుజరాత్, మహారాష్ట్రల నుంచి ఒక్కొక్కరు చొప్పున అవకాశం కల్పించారు. ఈసారి టీటీడీ పాలకమండలిలో సగం మంది పొరుగు రాష్ట్రాల వారికి అవకాశం కల్పించడం విశేషం. కాగా, 24 మంది సభ్యులను ప్రకటించిన ఆంధ్రప్రభుత్వం.. మరొక సభ్యుడిని నియమించాల్సి ఉంది. బీజేపీ నుంచి మరో పేరు ప్రతిపాదన వచ్చిన వెంటనే ఆ సభ్యుడిని కూడా నియమించనున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు వీరే..

సాంబశివరావు (జాస్తి శివ)

శ్రీసదాశివరావు నన్నపనేని

ఎం.ఎస్‌ రాజు (మడకశిర ఎమ్మెల్యే)

జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే)

ప్రశాంతిరెడ్డి (కొవ్వూరు ఎమ్మెల్యే)

పనబాక లక్ష్మి (మాజీ కేంద్ర మంత్రి)

మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌

జంగా కృష్ణమూర్తి

బురగపు ఆనందసాయి

సుచిత్ర ఎల్లా

నరేశ్‌కుమార్‌

డా.అదిత్‌ దేశాయ్‌

శ్రీసౌరబ్‌ హెచ్‌ బోరా

కృష్ణమూర్తి

కోటేశ్వరరావు

దర్శన్‌. ఆర్‌.ఎన్‌

జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్‌

శాంతారామ్‌

పి.రామ్మూర్తి

జానకీ దేవి తమ్మిశెట్టి

బూంగునూరు మహేందర్‌ రెడ్డి

అనుగోలు రంగశ్రీ

ప్రభుత్వానికి ధన్యవాదాలు..

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా తమను నియమించడంపై పలువురు సభ్యులు స్పందించారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీటీడీ కొత్త సభ్యుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ.. టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమిచండం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. వెంకటేశ్వర స్వామి సేవలో తరించడానికి దొరికిన గొప్ప అవకాశం ఇది అని పేర్కొన్నారు. బోర్డు సభ్యుడిగా తనను నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు జ్యోతుల నెహ్రు. టీటీడీ బోర్డు ద్వారా వెంకన్న భక్తులకు మరింత ఉన్నత సేవలు అందించడానికి కృషి చేస్తామన్నారు. ప్రతి భక్తుడికి వెంకన్న సులభ దర్శనం జరిగేలాగా బోర్డు ద్వారా చర్యలు చేపడతామన్నారు.

🌍 BRICS Launches New Global Payment System with 75% of Countries On Board!The BRICS group has introduced a new blockchai...
26/10/2024

🌍 BRICS Launches New Global Payment System with 75% of Countries On Board!

The BRICS group has introduced a new blockchain-based payment platform, with 159 out of 195 countries (that’s over 75% of the world!) joining in.

This platform aims to boost BRICS' role in the global economy and offer an alternative to big payment networks like the SWIFT system, which is widely used in the West.


Address

Flat No:#501, Srinilaya Enclave, Ameerpet
Hyderabad
500073

Telephone

+918143588886

Website

Alerts

Be the first to know and let us send you an email when Telangana Gulf Workers Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telangana Gulf Workers Association:

Shortcuts

Share