Sramika Sakthi శ్రామిక శక్తీ

Sramika Sakthi  శ్రామిక శక్తీ I am a trade unionist, writer General Secretary Forum for protection of the Constitution ,

10/05/2024
29/04/2024
04/01/2024

బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, ఇతర అగ్రకుల మహిళలలరా, మీరు చదువుకొని, ఉన్నత స్థాన్నాలలో ఉన్నారంటే, ఏదో ఉద్యోగాలు చేస్తూ, ఏదో పని చేస్తూ బ్రతుకు తున్నారంటే, రాజకీయ నాయకులు, ప్రెసిడెంట్, CM లు, మంత్రులు, MP లు MLA లు MLC లు, డాక్టర్స్, ఇంజనీర్లు, లాయర్లు, జడ్జీలు, టీచర్లు, లెక్చర్లు, ప్రొఫెసర్లు, సినిమా యాక్టర్లు, యాంకర్లు.... అయి బ్రతుకు తున్నారంటే దానికి కారణం మీ, తండ్రులు, అన్నలు, భర్తలు కాదు, మీ రాముడు, కృష్ణుడు, భగవద్గీత, మను ధర్మం, రామాయణం, మహాభారతాలు కాదు.

మహాతల్లి చదువుల తల్లి సావిత్రి బాయ్ ఫూలే, వారి మిత్రులు ఫాతిమ షేక్ , క్రైస్తవ మిషనరీలు. మహాత్మ జ్యోతిబా ఫూలే,

ఈ విషయం తెలీసుకోండి.

ముందుగా మీరు నమస్కారం చేయాలంటే, కృతజ్ఞత తెలియ చేయాలంటే ఆ మహానుభావులకు తెలియ చేయాలి.

జోహార్ చదువుల తల్లి సావిత్రి బాయ్ ఫూలే జోహార్.
జోహార్ మహాత్మ జ్యోతిబా ఫూలే జోహార్
జోహార్ ఫాతిమ బి జోహార్.

మద్యం వద్దు చదువు ముద్దు.
సంపూర్ణ అక్షరాశ్యత సాధించాలి.

వేల్పూరి కామేశ్వరరావు
ప్రధాన కార్యదర్శి
రాజ్యాంగ పరిరక్షణ వేదిక
9849008986

04/01/2024

*National Coordination Committee of Pensioners Associations*

Saturday, December 16, 2023

*_5th AIC of NCCPA_*

*NCCPA Holds its 5th AIC*

The 5th All India Conference was befittingly held in the Capital City of Chennai (Tamil Nadu) from 13-14, December 2023. The AIC was held in the absence of great leader and our former Secretary General of NCCPA and Confederation Comrade KKN.Kutty, who used to guide our movement in the correct lines.

The inaugural session of the Conference was presided over by the President of NCCPA comrade Shiva Gopal Mishra during the inaugural session despite his other tasks. The Subjects Committee sessions were presided over by the Working President Comrade S.K.Sharma.

The Reception Committee headed by the Honorable Mayor of Greater Chennai and Comrade P.Mohan as the General Secretary & Comrade C.K.Narasimhan as the Working Chairman has made excellent arrangements to the conduct of the AIC. The toil and the hard work of the Reception Committee volunteers had made it possible to hold the conference in a nice way. The Comrades of Tamilnadu Affiliates of NCCPA and Members need special thanks for their generous contributions which made this AIC possible in the State. The Medical Camp was organized nicely and the role of the Doctor and Comrade Mathivanan ex-SPM MMC Post Office was exemplary in running the camp.

After the flag hoisting in which the National Flag was hoisted by Comrade M.Kannaiyan Advisor of AIPRPA Tamilnadu and the NCCPA Flag by Comrade S.K.Sharma the NCCPA Working President and respects to the Martyrs Column the AIC was started in Maharashtra Bhawan, Chennai 600007.

Comrade Swadesh Dev Roye WFTU Deputy General Secretary and one of the leaders of CITU inaugurated the AIC. His speech was very much inspiring to all of us with highlights of Pensioners issues and the role of the Union Government in attacking the labour laws and rights of the pensioners.

Comrade C.Srikumar another WFTU Deputy General Secretary in India and the General Secretary of AIDEF and one of the leaders of AITUC spoke and touched the subjects of Pensioners and how the JCM is taking up those subjects and fighting for the Pensioners.

Comrade V.A.N.Namboodiri (Patron NCCPA); Janardhan Mazumdar (SG NFPE); C.K.Gundanna (AGS BSNLEU); N.L.Sridharan (GS AISGPF); Dr.S.Sridhar (President AIRRF); K.G.Jayaraj (GS AIBDPA); and K.Ragavendfran (SG NCCPA) delivered their special address in the inaugural session. Comrade Shiva Gopal Mishra delivered his presidential address and concluded the inaugural session.

The Report was placed by Comrade K.Ragavendran Secretary General in the Subjects Committee session chaired by Comrade S.K.Sharma Working President of NCCPA. Audited Accounts were submitted by ATR Comrade Sadhan Kumar Banerjee. 46 Delegates including the Office Bearers and Chief Executives of Affiliates spoke and intervened on the Report, Accounts and Amendments placed before the house.

After the summing up by the Secretary General Comrade K.Ragavendran the Report was unanimously adopted by the House. The Accounts also were unanimously adopted. The placed amendments and the addition for amending the constitution to include the selection of Patrons as our requirement without part of the Executive were unanimously approved by the House and decided to place the amendments for the acceptance and approval by the Registrar of TU.

Resolution Committee placed the Resolutions preposed by the CHQ and the amendments given by the Delegates and the same were approved and all the resolutions will be circulated to all the Affiliates and Office Bearers shortly. The Policy and Programme Resolution placed by the Secretary General was also approved unanimously by the House. Resolutions to start a new bank account in the name of NCCPA in a Nationalized Bank in the Joint names of the Treasurer G.Kumar and the Secretary General K.Ragavendran to be jointly operated by them has been approved unanimously. All resolutions in full form will be placed in our website shortly and sent to all Affiliates and Office Bearers also.

The following Office Bearers were elected unanimously:

President: Shiva Gopal Mishra

Working Presidents: (1) S.K.Sharma (Rajasthan CGPA)

(2) A.K.Ghosh ( West Bengal CCCCGPA)

Vice Presidents: (1) S.Rahman ( Assam CCCGPA)

(2) M.L.Gupta [ AI PNB Pensioners/Retirees Association (Regd)]

(3) T.S.Parameswaran ( Kerala CGPA)

(4) J.P.Dhandre (Nagpur Postal Audit & Accounts Pensioners)

(5) Basudev Sen Gupta ( Federation of CGPA West Bengal)

(6) K.B.Krishna Rao (Karnataka P&T Pensioners Association)

(7) R.Elangovan (DRPU)

(8) Reserved for AIRRF.

Secretary General: K.Ragavendran (AIPRPA)

Deputy Secretary General: (1) K.G.Jayaraj (AIBDPA)

(2) D.K.Debnath (AIPRPA)

(3) Basawanand (ITPF)

(4) P.Lahiri ( West Bengal CCCGPA)

Assistant Secretary General:

Jagmohan Thakur (AI Audit & Accounts Pensioners Association)

T.N.Venkatiswaran ( Kerala CGPA)

C.P.Shobana (AIPRPA)

S.Radhakrishna (AI Audit & Accounts Pensioners Association)

Ishwar Singh Dabas (AIPRPA)

S.Mohandas (AIBDPA)

P.Krishnamurthy ( Telangana APRPA)

M.R.Das (AIBDPA)

Treasurer: G.Kumar (AIPRPA)

Assistant Treasurer: Sadhan Kumar

Banerjee (West Bengal CCCGPA)

Organising Secretary: (1) B.P.Ganak (AIPRPA)

(2) S.C.Pandey (AI Audit & Accounts Pensioners Association)

(3) N.Somaiah (Telangana APRPA)

(4) N.Nageswara Rao (AIPRPA)

(5) M.Suresh (AKBRF)

(6) Manisha Biswas ( AIBDPA)

(7) S.C.Bhattacharya (AIBDPA)

Internal Auditor: R.Natarajan (Puducherry Pensioners Association)

Ex-Officio Executive:

Shok Haran Singh [(AI PNB P/R Association(regd)]

Ashok Salunghe (ITPF)

Chandrasekara Rao ( Vizag All CG Employees Pensioners Association)

Rajasekara Reddy (Defense Officers Pensioners Association)

Kalooram Jingar (Chittodgarh CGPA)

A.Murugesan (DRPU)

M.V.Naik ( Nagpur Central & State Pensioners Association)

K.Radhakrishnan ( Puducherry Pensioners Association)

Suryaprakash ( Coffee Board Pen Assn & Autonomous and Statutory Board Pen Assn)

U.V.Singh ( Ground Water Board Pensioners Association)

Krishna Gopal (Udaipur CGPA)

Nikilesh Mitra (Federation of CGPA West Bengal)

B.M.Sunda (Rajasthan CGPA)

General Secretary Ratlam CGPA

General Secretary Amaravati CGPA

General Secretary Nainital CGPA

General Secretary Rohtak CGPA

General Secretary CLTRIPA.

The AIC unanimously selected the following Patrons NCCPA:

V.A.N.Namboodiri

Pavitra Ranjan Chakraborti ( CCCGPA West Bengal)

C.L.Mathur (Ajmer Retired Railwaymen Association)

R.P.Sharma (Rajasthan CGPA)

H.N.Joshi ( Ratlam CGPA)

The AIC unanimously approved the following two Associations of Pensioners as our Affiliates from 2024:

All India Retired Railwaymen Federation

National Forum of Atomic Energy Retirees.

It was decided to refer to Executive the next venue of the AIC after discussions.

With formal vote of thanks, the AIC concluded.

-KR SG NCCPA-

National Coordination Committee of Pensioners Associations at 1:33 AM
Share

04/01/2024

కొత్త పునాదులు
**************
స్వజాతిని
చంపుకు తినే
(దోచుకుతినే )
జాతి ఒక్కటే
మానవజాతి!

వీడే శత్రువు
వీడే బానిస
వీడే కూలి
ఇదీ మనిషి!

వీడి ఆయుధాలు?
అవిద్య అజ్ఞానం
అబద్ధాలప్రచారం
ఆముష్మిక ప్రాప్తి!

ఇహం మిధ్య
పరం ముక్తి
భూసురుల
పాదార్పణం !

పునాదిలోనే
విషం పోసి
నిర్మించారు
సమాజ సౌధం!

విష ప్రభావం
బ్రెయిన్ క్యాన్సర్!
మత్తుమందు
ఇచ్చిన 'మనువు'!

అదే మత్తులో
నేటికీ మనిషి
జోగుతున్నాడు
వాగుతున్నాడు!

కులం మతం
సాటి మనిషి
దూరం దూరం
అస్పృశ్యత!

కుక్కల్ని పిల్లుల్ని
ప్రేమిస్తాడు !
సాటి మనిషిని
ద్వేషిస్తాడు !

మనిషిని మనిషి
వేటాడతాడు!
దోచుకు తినాలి
దాచు కోవాలి!

బాగుపడతామా?
జీవనమూలాలు
మారినప్పుడే!
ఎలామారతాయి?

ఇప్పటికే మనం
కుళ్ళి పోయాం
తుళ్లి పోయాం
హళ్లి పోయాం
మళ్ళి పోయాం!

అనాది నుండి
పునాదిలోనే
ఇదే సనాతనం
మన వినాశనం!

ఆ నిర్మాణాన్ని
కూల్చేయాలి!
విషం తీసేసి
నూతననిర్మాణం
చే పట్టాలి!

మార్క్స్ అంబేద్కర్
మన నిర్మాతలు!
విషం తొలగించే
భిషగ్రత్నలు!
నడవండి తవ్వుదాం
కొత్త పునాదులు!
*******
-మీవాడు
హైదరాబాద్
4-1-2024

.............. *ప్రచురణార్థం* .........సావిత్రిబాయి పూలే ఆశయం అయిన సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి. మద్యాన్ని బంద్ చేయాలి.భ...
04/01/2024

.............. *ప్రచురణార్థం* .........

సావిత్రిబాయి పూలే ఆశయం అయిన సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి. మద్యాన్ని బంద్ చేయాలి.

భారతదేశ మొట్టమొదటి మహిళా పంతులమ్మగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించాలని వర్కర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాయబండి పాండురంగ చారి, పార్టీ సలహాదారులు, రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి కామేశ్వరరావు గార్లు కోరారు.

3.1.2024 న సావిత్రిబాయి పూలే 193వ జయంతి ఉత్సవాలను కొత్తపేటలోని వర్కర్స్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు* .

ఈ సందర్భంగా *పాండురంగచారి* ప్రసంగిస్తూ భారతదేశ తొలి మహిళా సంఘసంస్కరణి,ఈ దేశపు మొదటి పంతులమ్మ తల్లి సావిత్రిబాయి పూలే అని, పీడిత ప్రజల ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలి మహిళ ఉద్యమకారునని అన్నారు.యుక్త వయసులోనే తన సౌఖ్యాలను వదులుకొని అణగారిన వర్గాల బాలికలకు పాఠశాలలు పెట్టి,మను వాదులు ఎన్ని ఆటంకాలు సృష్టించిన వాటిన అధిగమించి గొప్ప మాతృమూర్తి అని,మూడ విశ్వాసాలు ఆచరించనంత కాలం ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాదని గుర్తించి,హేతుబద్ధ కవితల్లో ప్రతిబింబించే వారని,క్రాంతి బాయిగా ప్రజలందరూ పిలుచుకునే సావిత్రిబాయి పూలే ఆధునిక భారతదేశ చరిత్రలో ధృవతారగా వెలుగుతూనే ఉంటుందని సావిత్రిబాయి పూలేను ప్రభుత్వం మొదటి పంతులమ్మగా ప్రకటించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో *వి.కామేశ్వరరావు* ప్రసంగిస్తూ మధ్యాన్ని బంద్ చేసి సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలని, ఈ దేశంలో విద్యనే ప్రధానమైన ఆయుధమని పాలకులను ప్రశ్నించే తత్వం రావాలంటే నాణ్యమైన విద్య ప్రతి ఒక్కరికి అందించాలని కోరారు సావిత్రిబాయి తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి విద్యా బోధనలకు బాలికలకు అంకితమైందని సాంఘిక దురాచారాల నిర్మూల కోసం పెద్దలతో ఘర్షణ పడవలసి వచ్చిన బెదరకుండా ఆమె శౌర్యాన్ని ప్రదర్శించే వారిని ఈ దేశం లో ప్రజలందరూ ఆమె ఆశయాలను కొనసాగించిన ప్పుడే నిజమైన నివాళులు అని కామేశ్వరరావు కోరారు.

*ఈ కార్యక్రమంలోఎస్వి. రాములు,కొప్పు యాదయ్య, మోత్కూరు మల్లాచారి,మట్టొజు స్వామి, అన్నదాన భాస్కర్,వెంకట్రెడ్డి,అనురాధ,కళ,అశ్విని,శ్రీలత, కీర్తి,కృష్ణమాచారి,తదితరులు పాల్గొన్నారు* .

*రాయబండి పాండురంగ చారి* .

*రాష్ట్ర అధ్యక్షుడు* ..

*వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా* ..

*తెలంగాణ రాష్ట్ర కమిటీ* .

సావిత్రి భాయి పులే193వ జయంతి.*********************************ది తేదీ 03/01/2024 బుధవారం ఖమ్మం పట్టణంలోని R&B గెస్ట్ హౌస...
04/01/2024

సావిత్రి భాయి పులే193వ జయంతి.
*********************************
ది తేదీ 03/01/2024 బుధవారం ఖమ్మం పట్టణంలోని R&B గెస్ట్ హౌస్ దగ్గరలో బహుజన దివిటీ జ్యోతి భా పులే,సావిత్రి భాయి పులే ప్రాంగణంలో చదువుల తల్లి సావిత్రి భాయి పులే 193 వ జయంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు బెజ్జంకి.ప్రభాకరాచారి మాట్లాడుతు దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి పులే
బహుజన సమాజంతో పాటు, అన్ని వర్గాల స్త్రీలు ''ఓనమాలు'' కూడ దిద్దలేని అజ్ఞానము, మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్న అంధకార యుగములో వేగుచుక్కగా ఉదయించిన సావిత్రిపూలే 1831వ సంవత్సరము జనవరి 3వ తేదీన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో గల నయగావ్‌ గ్రామంలో జన్మించారు. బాల్యం నుండే సహజాతంగా అబ్బిన పట్టుదల, కరుణ, సమత, జిజ్ఞాస వంటి గుణాలు భర్త జోతిరావ్‌ సాహచర్యంలో మరింతగా వికాసము చెంది జీవితాంతము శ్రేయోమార్గంలో శ్రమించిన భారతమాత ప్రియ పుత్రిక సావిత్రిభాయి పూలే. సావిత్రిభాయి స్వయంగా స్త్రీలలో చైతన్యం పెంపొందించేందుకు, మహిళా సేవామండలిని ప్రారంభించింది. అంటరానితనం నిర్మూలన, సతి, బాల్యవివాహం, వైధవ్యం, ఆడశిశు హత్యలు వంటి మూఢ సంప్రదాయాలను రూపుమాపటానికి భారత్‌లో స్థాపించిన తొలి సంస్థ. ఈ సంస్థ 1852 జనవరి 14న మకరసంక్రాంతి సందర్భంగా ''సార్వజనిక్‌ తిలగుండ్‌ సమారోహ్‌'' అనే ఉత్సవాన్ని కులమతాలకతీతంగా భాగస్వామ్యం చేసి నిర్వహించింది. హేతువాదం, మానవవాదం పునాదులుగా సమాజం పురోగమించడం కోసము శాయశక్తులా ప్రయత్నం చేసింది. వితంతువులు, అత్యాచార భాధితులు, వారి పిల్లలకు ఆశ్రయం కోసం ''బాల హత్య ప్రతిబందక్‌ గృహాన్ని 1853 జనవరి 1 న ఏర్పాటు చేసింది. వారికి ధైర్యం చెప్పి ఆత్మ విశ్వాసాన్ని నింపి ఆత్మహత్యలకు పాల్పడకుండా చూసేది. వీటితో పాటు జోతిరావ్‌ నిర్వహించిన రైతాంగ, కార్మిక హక్కుల పోరాటాలలో, ''సత్య శోధక్‌ సమాజ్‌'' నిర్వహణలో క్రియాశీల పాత్రను పోషించింది.
150 సంవత్సరాల క్రితమే ఈ భారతవనిలో మానవుడు మానవునిగా మనగలగాలని, ప్రతి మనిషికి ఒకే విలువ ఉండాలని, విద్య, ఆరోగ్యం ప్రజల హక్కు అని వంటి గొప్ప లక్ష్యాలతో సామాజిక విప్లవాన్ని ప్రారంభించి అనేక విజయాలను మనకు సమకూర్చిన పూలే దంపతుల ఆశయాల సంపూర్ణ సాధనకు పరిశ్రమించాల్సిన బాధ్యత పౌర సమాజం, ప్రభుత్వంపై ఉన్నది. సమకాలీన బారతంలో సామాజిక అభివృద్ధి సూచికలు అధమ స్థానాలలో ఉన్నాయి. లింగ నిష్పత్తి 943, అక్షరాస్యత రేటు 74% దీనిలో పురుషులది 82%, స్త్రీలది 65% గా ఉన్నది. ఇది ప్రపంచ సగటు మహిళల అక్షరాస్యత రేటు 79% కంటే తక్కువ, దేశంలో 40 శాతం బాలికలు 18 సంవత్సరాలు రాకముందే వివాహం చేసుకుంటున్నారు. పాఠశాల డ్రాప్‌ ఆవుట్స్‌లో బాలికల శాతం 63.5% గా ఉంది. విద్య, ఆరోగ్యం, ఉత్పాదక రంగం, రాజకీయ రంగములో స్త్రీల భాగస్వామ్యం ఆధారంగా ప్రపంచ ఆర్థిక వేదిక రూపొందించే లింగ వ్యత్యాస సూచిక-2017-18లో 108వ స్థానం ఉంది. దేశంలో ఇప్పటికీ అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం అందని ద్రాక్షగా మిగిలింది.
గత 75 సంత్సరాలకాలంగా నిర్లక్ష్యానికి గురి అవుతున్న అట్టడుగు వర్గాలకు జనాభా నిష్పత్తి ప్రకారం సామాజిక, ఆర్దికంగా,రాజకీయ రంగాల్లో న్యాయం జరగాలి అంటే కుల గణన జరగాల్సిన అవసరం వున్నది,సావిత్రి భాయి పులే మార్గాన్ని అనుసరించి అభివృద్ది ఫలాలు అందరికి అందే సమగ్ర సామాజిక విప్లవసాధనకు కృషి చేసి మానావాభివృద్ధి సూచికలో అగ్రస్థానం సాధించడమే వారికి మనమిచ్చే నిజమైన నివాళి. అదే క్రమంలో బీసీ సామాజిక వర్గానికి కూడ అసెంబ్లీ, పార్లమెంట్ వంటి చట్టసభలలో రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం వున్నది.కాబట్టి విద్యావంతులు,మేధావులు, విద్యార్థులు ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి,తగిన విధంగా పోరాట కార్యాచరణ ద్వారానే ఏదైనా సాధ్యం అవుతుంది.డబ్బు, మద్యం బహుమతులు ప్రలోభాలకు గురి చేసే అభ్యర్థులను రాజకీయ పార్టీలను అనర్హులు గా ప్రకటించాలి.కులం, మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్న వారి పట్ల జాగ్రతగా వుండాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

రాష్ట్ర ఉపాధ్యక్షులు
బెజ్జంకి. ప్రభాకరాచారి
రాజ్యాంగ పరిరక్షణ వేదిక,ఖమ్మం.

04/01/2024

మహిళల విద్యకు దారి దీపం
- యం.రాంప్రదీప్,
94927 12836

మనకు సేవా రంగం అనగానే ఒక ఫ్లోరెన్స్ నైటింగేల్, ఒక మదర్ థెరిస్సా గుర్తుకు వస్తారు. వారి స్థాయిలో, వారి కంటే ముందుగానే సావిత్రి బాయి ఫూలే మహారాష్ట్రలో గొప్ప సామాజిక విప్లవానికి పునాది వేశారు. దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి ఫూలే పేరు పొందారు. 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించింది. ఆమె తన తొమ్మిదవ ఏటనే పన్నెండేళ్ళ జ్యోతిరావు ఫూలేతో 1840లో వివాహం జరిగింది. నిరక్షరాస్యులైన ఆమె భర్త జ్యోతిరావు ఫూలే ప్రోత్సాహంతో వారి వద్దనే విద్యనభ్యసించి, విద్యావంతురాలు అయింది. ఉపాధ్యాయ శిక్షణపొంది, 1848 జనవరి 1న భర్త జ్యోతిబా ఫూలేతో కలిసి అణచివేతకు గురైన కులాల బాలికల కోసం పుణెలో సావిత్రిబాయి మొదటి పాఠశాలను ప్రారంభించింది.

అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు, సంపద లాంటి సమస్త హక్కులు నిరాకరించబడిన సమాజంలో ఆనాటి కట్టుబాట్లను, సాంప్రదాయాలను ఎదిరించి, విధి నిర్వహణ విషయంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొని నిలిచి, గెలిచారు. కేవలం నాలుగు సంవత్సరాల కాలంలోనే గ్రామీణ ప్రాంతాలలో 20 పాఠశాలలను ప్రారంభించి, ఉచిత విద్యనందించి, విద్యా ఉద్యమాన్ని ప్రారంభించిన ఆమె వయసు కేవలం 18 ఏళ్లు మాత్రమే. జీవిత కాలం మొత్తంలో 52 పాఠశాలను ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో ఆమె ఆధిపత్య భావజాలం గల వారి నుండి అనేక దాడులు, అవమానాలను ఎదుర్కొన్నది.ఈ నేపథ్యంలో చివరికి 1849 లో భర్తతో కలిసి గృహ బహిష్కరణకు గురి కావలసి వచ్చింది. స్త్రీ, పురుషులు కులమతాలకు అతీతంగా విద్య నభ్యసించడం సహజమైన హక్కు అని, అందుకే అందరూ చదవాలి, అందరూ సమానంగా బతకాలి అని అనునిత్యం తపించిన సామాజిక విప్లవమూర్తి సావిత్రి బాయి.

ఆమె మానవ హక్కుల గురించి, ఇతర సామాజిక సమస్యల గురించి, స్త్రీలను చైతన్య పరచడానికి 1852లో మహిళా సేవా మండల్ అనబడే మహిళా సంఘాన్ని స్థాపించింది. లింగ వివక్షలకు తోడుగా కుల, పితృస్వామ్య వ్యవస్థల అణచివేతకు వ్యతిరేకంగా, స్త్రీల సాధికారత కోసం ఈ సంస్థ పని చేసేది. మహిళా హక్కులే మానవ హక్కులు అని తొలిసారిగా నినదించిన గొప్ప విప్లవ వనిత సావిత్రి బాయి ఫూలే. అసత్యాలతో అగ్రవర్ణాల దురహంకారపు నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ నిర్మాణమైన సమాజంలో సత్యాన్ని శోధించడానికి 1873లో తన భర్త జ్యోతి బాఫూలేతో కలిసి సత్యశోధక్ సమాజ్‌ను ప్రారంభించింది. బాల్య వివాహాలు, మూఢ నమ్మకాలకు, సతీసహగమనానికి వ్యతిరేకంగా, వితంతు పునర్వివాహాల కోసం బలమైన ఉద్యమాన్ని నడిపారు. దాని మహిళా విభాగం సావిత్రి బాయి ఫూలే ఆధ్వర్యంలో నడిచేది. పురోహితులు లేకుండా వివాహాలు, ఇతర శుభకార్యాలను ఈ సంస్థ ద్వారా చేసేవారు. బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభవిస్తున్న ఎంతో మంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు.

గర్భవతులైన వారికి పురుళ్లు పోసి, వారి జీవితాలకు వెలుగు నిచ్చారు. ఆ విధంగా పురుడు పోసుకుని తన వద్దే వదిలేసిపోయిన ఓ బిడ్డను అక్కున చేర్చుకుని యశ్వంత్‌గా పేరు పెట్టి తమ ఆశయాలకు, ఆకాంక్షలకు తగ్గట్టుగా పెంచి పెద్ద చేశారు. డాక్టర్ గా సమాజానికి అందించారు. వితంతువులకు శిరోమండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించడమే కాక, క్షురకులను చైతన్యపరిచి వితంతువులకు శిరోముండనం చేయబోమని వారి చేత 1860లో సమ్మె కూడా చేయించారు. 1870లో ఒకసారి, 1896లో మరొకసారి దేశంలో తీవ్ర కరువు ఏర్పడినప్పుడు ఆమె చేసిన కృషి అనన్య సామాన్యం. కరువువాత పడిన కుటుంబాలలోని అనాథ బాలలను దాదాపు రెండు వేల మందిని అక్కున చేర్చుకొని వారికి తమ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని అందిచారు. మరో మిత్రురాలు ఫాతిమా బేగంతో కలిసి విద్యా విప్లవానికి నాంది పలికారు. ఆంగ్ల విద్యని నేర్చుకోవడం ద్వారా బహుజనులు తమ హక్కుల గురించి తెలుసుకోగలుగుతారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

1890లో భర్త జ్యోతిరావ్ ఫూలే మరణిస్తే అంత్యక్రియలు జరిపే సందర్భంలో బంధువులు, దత్తపుత్రులు ఘర్షణ పడుతుంటే సనాతన ఆచారాలకు విరుద్ధంగా తానే ఆయన చితికి నిప్పంటించి అంత్యక్రియలు చేసి, అభ్యుదయ భావాలు కలిగిన సంస్కరణవాదిగా చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయింది. సావిత్రీ బాయి మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలు మాత్రమే కాకుండా గొప్ప రచయిత్రి. 1854లో కావ్య ఫూలే అనే ఒక కవితా సంపుటి రచించారు. అభంగ్ అనే రచన ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండేది. సూటిగా, సరళంగా, ప్రకృతి వర్ణన, జానపద కళలు ప్రతిబింబించే కావ్య రచనలు చేశారామె. 1891లో ప్వాన్ కాశీ సుభోధ్ రత్నాకర్ 11 పేరిట కవితా సంపుటిని ప్రచురించారు. పండుగలు, పబ్బాలు వంటి ఆర్భాటాల కోసం శక్తికి మించిన ఖర్చులు చేసే వాళ్ళను విమర్శిస్తూ ‘కర్జ్’ అనే వ్యాసం రాశారు. మూఢ విశ్వాసాలు ఆచరించినంత కాలం ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పురాదని గుర్తించి తన కవితల్లో హేతుబద్ధత ప్రతిబింబించే విధం గా రచనలు చేశారు. క్రాంతి బాయిగా ప్రజలందరూ పిలుచుకునే సావిత్రిబాయి ఫూలే ఆధునిక భారత దేశ చరిత్రలో ధ్రువతారగా వెలుగొందుతూనే ఉంటుంది.

1897లో ఆమె మరణం కూడా ప్రజా సేవలోనే పొందింది. పుణె నగరంలో ఒక వీధిలో ప్లేగు వ్యాధి భయంకరంగా విలయతాండవం చేస్తున్న రోజులు. ఆమె వ్యాధిగ్రస్థులకు సేవ చేస్తున్న క్రమంలో పాండు రంగ గైక్వాడ్ కొడుకు ప్లేగు వ్యాధి బారినపడడం గమనించి, ఆసుపత్రికి తీసుకు వచ్చేవారు ఎవరూ లేక స్వయంగా తానే తన 66వ ఏట భుజంపై ఆ బాలుడిని వేసుకొని, ఆసుపత్రికి తీసుకు వస్తున్న సందర్భంలో ఆ బాలుడి శ్వాస ఆమె పీల్చడం వల్ల తాను కూడ వ్యాధి బారిన పడింది. ఆ బాలుడు బతికాడు కాని, ఆమె మరణించింది. సావిత్రి బాయిని స్ఫూర్తిగా తీసుకొని వివిధ రంగాలలో రాణించిన మహిళలు ఎందరో మనకు చరిత్రలో కనిపిస్తారు. వారు డాక్టర్ ఆనంది బాయి జోషి. ఈమె పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన మొట్టమొదటి మహిళా వైద్యురాలు. పండిత రమాబాయి సంఘ సంస్కర్తగా, మహిళల విద్య కోసం, విముక్తి కోసం మార్గదర్శకులుగా గుర్తింపు పొందింది. రమాబాయి రనాడే మహిళా హక్కుల కార్యకర్తగా, సామాజిక కార్యకర్తగా కూడా ప్రసిద్ధి చెందారు. తారాబాయి షిండే సామాజిక కార్యకర్తగా, మహిళా హక్కుల కార్యకర్తగా కృషి చేశారు.

సావిత్రి బాయి చేపట్టిన కార్యక్రమాలు ఈనాటికీ ఆచరణీయమే. మధ్యాహ్న భోజన పథకం, అందరికీ విద్య, పేరెంట్స్ మీటింగ్స్, సంక్షేమ హాస్టళ్లు, బోర్డింగ్ స్కూల్స్ నిర్వహణ ఇలాంటివి ఎన్నో. ఇలా చెప్పుకుంటూ పోతే, ఎంతైనా తక్కువే. వరకట్నం, గృహ హింస, లైంగిక వేధింపులు వంటివి ఆధునిక కాలంలో కూడా మహిళలపై జరుగుతూనే వున్నాయి. ఆమె ఆదర్శాలను నేటి సమాజంలోని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని మెరుగైన సమాజ నిర్మాణంలో మనవంతు కృషి చేద్దాం.

04/01/2024

భారత ప్రజలు ౼ కళ్ళుతెరిపించే వాస్తవాలు

"భారత ప్రజలు" పేరుతో ఆంత్రోపొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధించి ప్రచురించిన పత్రం భారతదేశం, భారత సమాజం, సంస్కృతిల మీద బి.జె.పి. చేస్తున్న వాదనలను త్రిప్పికొడుతోంది. ఈ సర్వేను అత్యంత జాగ్రత్తతో, సునిశితంగా నిర్వహించారు. మొత్తం 500 మంది శిక్షణ పొందిన పరిశోధకులు ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 284మంది ఆంత్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నవారు కాగా మరో 216మంది దేశవ్యాప్తంగా విస్తరించిన వివిధ పరిశోధనా సంస్థలు, యూనివర్శిటీలకు చెందినవారు. ప్రముఖ పరిశోధనా వేత్తగా ఆంత్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు డైరెక్టర్గా ఉన్న శ్రీ కె.ఎన్. సింగ్ సర్వేకు అధిపతిగాను, సమన్వయకర్తగాను వ్యవహరించారు.

ఈ సర్వేను ప్రధానంగా మానవ సంబంధాల అధ్యయన శాస్త్రజ్ఞులు, సాంఘిక పరిశోధకులు నిర్వహించారు. వీరితోపాటు భాషా శాస్త్రాలు, మానసిక శాస్త్రం, పరిసరాల పరిశోధనాశాస్త్రం, జీవరసాయన శాస్త్రాలకు సంబంధించిన అనేకమంది పరిశోధకులు పాల్గొన్నారు. వీరు సర్వే చేసి అందించిన సమాచారాన్ని ఆంత్రోపొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న చరిత్రకారులు సాంఘిక శాస్త్రవేత్తలు, రాజనీతి శాస్త్రవేత్తలు పరిశీలించి, విస్తృతంగా అధ్యయనం చేసి చర్చించారు. వివిధ జాతులకు చెందిన సమాచారాన్ని ఈ శాస్త్రజ్ఞులు ఆమూలాగ్రం పరిశీలించారు.

ఈ ప్రాజెక్టు 1985లో ప్రారంభమై దాదాపు దశాబ్దకాలం పాటు కొనసాగింది. తమ ప్రాథమిక పరిచయ పరిశోధనను 1992లో ప్రచురించారు. లోతైన, సుదీర్ఘ అధ్యయనం ద్వారా మనదేశంలో 91 సాంస్కృతిక జోన్లు ఉన్నాయని గుర్తించారు. ఒక సాంస్కృతిక జోన్ 4258 కమ్యూనిటీలు ఉన్నాయని కనుగొన్నారు. 331 సాంస్కృతిక జోన్లలో 45 సముదాయాల్ని అధ్యయనం చేశారు. ఈ మొత్తం సమాచారాన్ని 421 జిల్లాల నుండి సేకరించారు. ఈ అధ్యయనంలో ఒక జిల్లాలో 3972 సముదాయాలు, రెండు జిల్లాల్లో 512, రెండుకు మించిన జిల్లాల్లో 151 కమ్యూనిటీలు విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. కొన్ని సందర్భాలలో 1807 కమ్యూనిటీలు ఒకే గ్రామంలోను, 783 రెండు గ్రామాల్లోను, రెండుకు మించిన గ్రామాల్లో 475 సముదాయాలు ఉన్నట్లు తెలుసుకున్నారు. మొత్తంగా పరిశీలిస్తే ఒక పట్టణం లేదా నగరంలో 1794 కమ్యూనిటీలు, రెండు పట్టణాలు లేదా నగరాల్లో 393, రెండుకు మించిన పట్టణాలు లేదా నగరాల్లో 182 విస్తరించినట్లు తేల్చారు. వివిధ కమ్యూనిటీలు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయని, మొత్తంగా దేశంలో 4635 సముదాయాలు ఉన్నాయని నిర్ధారించారు. ప్రతి కమ్యూనిటీకి ఉన్న ప్రత్యేకతలు, అది అలా మారడానికి గల కారణాలు, ఇతర సముదాయాలతో సంబంధాలు, అంతర్గతంగా వస్తున్న మార్పులు అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి ప్రస్తావించారు.

మనం మాట్లాడుకుంటున్న భిన్నత్వంలో ఏకత్వాన్ని ఈ ప్రాజెక్టు నిరూపించింది. సంఘ్ పరివార్ చాలాకాలంగా చేస్తున్న అసంబద్ధ వాదల్ని, వక్రీకరణలను ఇది ఎండగట్టింది. ఈ సర్వే అసలు సారాంశం క్రింది విధంగా ఉంది.

మొత్తం ప్రజలంతా ఒకే సమూహానికి చెందిన వారని నిర్ధారించలేం. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ రకాల మనుషుల్లో మనమూ భాగమే. దేశవ్యాప్తంగా భిన్నమైన ఆకృతి, వస్త్రధారణ, భాష, వృత్తి, ఆహారపు అలవాట్లు, ఆచారాలు కలిగిన 4635 కమ్యూనిటీలు ఉన్నాయి. వాళ్ళందరి విభిన్నమైన జీవన విధానమే మన జాతీయ జీవన విధానంగా రూపొందింది.

ప్రతి ఒక్కరూ భారతదేశాన్ని తమ మాతృభూమిగానే నమ్ముతున్నారు. ఇక్కడ ఎవరూ స్వచ్ఛమైన ఆర్యులుకాని విదేశీయులు కాని లేరు. అనేక సముదాయాలు ఒక దానితో ఒకటి. కలిసి మిశ్రమ సంస్కృతిని రూపొందించాయి. వాటి మూలాలని తిరిగి విభజించడం అసాధ్యమైన పని, ప్రొటో-ఆస్ట్రలాయిడ్, పాలియో-మెడిటిరేనియన్, కాకసియన్, నీగ్రోయిడ్, మంగోలాయిడ్ లాంటి అనేక జాతులు కలిసి పోయాయి. ఆర్యులు, గ్రీకులు, హూణులు, అరబ్బులు, తురుష్కులు,ఆఫ్రికన్లు, మంగోలియన్లు, యూరోపియన్లు తదితర జాతులన్ని కలిసిపోయాయి. ఈ రోజున ఎవరినీ ఫలానా జాతికి చెందిన స్వచ్ఛమైన వారిగా నిర్ధారించలేం..

ఈ సముదాయాలలో అనేకం జన్యుపరంగాను, రక్తసంబంధాల పరంగాను కలిసిపోయాయి. ప్రాంతీయతను బట్టి ఐక్యత ఏర్పడిందికాని కులాన్ని బట్టి, మతాన్ని బట్టి కాదు. తక్కువ కులాల వాళ్ళు భిన్నమైన జాతులవారనే వాదన కూడా సరికాదని శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. ఉదాహరణకు తమిళ బ్రాహ్మణులకు ఉత్తర భారతంలోని ముఖ్యంగా కాశ్మీర్ పండితులకు గల జాతి సంబంధాలు పరిశీలిస్తే పోలికలు చాలా స్వల్పంగా మాత్రమే ఉన్నాయి. అనేక ప్రాంతాలలో నిమ్నకులాలు, బ్రాహ్మణులు ఒకేరకంగా ఉన్నారు. అనేక ప్రాంతాలలోని ముస్లింలు వలసవచ్చినవారు కాదు. స్థానికంగా ఉన్న ప్రజలే ముస్లింలుగా మారారు.

భారతదేశంలో ఉన్న కొన్ని సముదాయాలు తాము వలసవచ్చినదవిగానో లేదా పరాయిదేశాలకు చెందినవిగానో ఒప్పుకోవు. కానీ, ప్రతి సముదాయం జానపద గీతాలు, చరిత్రల్లో మాత్రం తాము వలస వచ్చినవారమని చెప్పుకుంటున్నది. ప్రతి ఒక్కరు తాము నివసిస్తున్న ప్రాంత ఆచారాల్ని సాంప్రదాయాల్ని తమవిగా చేసుకున్నారు. దురాక్రమణదారులు సైతం వలసదారులుగా మారిపోయారు. వలసవచ్చిన వారినుండి భారత సంస్కృతి అనేక అంశాలను గ్రహించింది. తాము నివశిస్తున్న ప్రాంత సంస్కృతిని మరింత సుసంపన్నం చేశారు. గ్రీకులు నుండి, ముస్లింల నుండి, ఆంగ్లేయుల నుండి అనేక సాంస్కృతిక సామాజిక రాజకీయా విషయా లను, భాష ను, శిల్పకళ ను ఇలా రకరకాల అంశాలను భారతదేశం సంస్కృతి లో ఇమిడిపోయాయి.
భిన్నత్వానికి, ఐక్యతకు భాష ప్రధానంగా దోహదపడుతుంది. దేశంలో 325 మాట్లాడే భాషలు ఉండగా 25 భాషలకు లిపి ఉంది. ఇవన్నీ విభిన్న భాషా కుటుంబాలనుండి ఉద్భవించాయి. ఇండో-ఆర్యన్, టిబెట్ జర్మన్, ద్రవిడియన్ ఆస్ట్రో-ఏషియాటిక్, అండమానీస్, సెమిటిక్, ఇండో-ఇరానియన్, సినో-టిబెటన్, ఇండో యూరోపియన్ భాషా కుటుంబాల నుండి ఇంకా అనేక వేల భాషల నుండి మన భాషలు ఉద్భవించాయి. 655మ్యూనిటీలు రెండు భాషలు మాట్లాడతాయి. అనేక ఆటవిక సముదాయాలు 3 భాషలు మాట్లాడతాయి.భావనల్ని వ్యక్తం చేయడానికి, తమ తమ మాతృభాషలు చాలా దోహదపడ్డాయి.

85% సముదాయాలు తమ వనరుల ఆధారంగా ఏర్పడ్డాయి. జీవనవిధానం. వారి వృత్తి, వస్త్రధారణ, ఇళ్ళ నిర్మాణం మొదలైనవన్నీ వారు నివసిస్తున్న భూమి స్వభావం, వాతావరణ పరిస్థితి. ఇతర వనరులను బట్టి రూపొందాయి. నిపుణులు చెప్పేదేమంటే🌄 "సముదాయాలు" పరిసరాలు సంస్కృతిని బట్టి రూపొందాయి తప్ప మతాన్ని బట్టి కాదు" అని వివరికి వలస వచ్చి స్థిరపడిన వారు కూడా స్థానిక అలవాట్లకు అనుగుణంగానే జీవిస్తున్నారు. ఇళ్లలో వారు మాట్లాడే భాషను బట్టి తప్ప సముదాయాల మధ్య తేడా గుర్తించలేము. 71.77% మంది ప్రజలు ఒకే ప్రాంతం లేదా భాషా ప్రాంతంలో నివసిస్తుండగా వారిలో కేవలం 3% సముదాయాల పేర్లు మాత్రమే మత సంబంధంగా ఉన్నాయి. కేరళ, లక్షద్వీపాలకు చెందిన ప్రజల ఆచార వ్యవహారాలు ఒకేరకంగా ఉన్నాయి. కేరళ, పంజాబ్ ప్రజల ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉన్నాయి. 55% శాతం సముదాయాలకు సాంప్రదాయంగా కొనసాగిస్తున్న వృత్తిపేర్లే ఉన్నాయి. కంసాలి, వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, మేదర, సాలె, వైశ్య, చాకలి, మంగలి మొదలైనవన్నీ వారు చేస్తున్న వృత్తిని బట్టి వచ్చిన పేర్లే, 14 శాతం సముదాయాలకు పరిసరాలు, కొండలు, నదులను బట్టి పేర్లు ఉన్నాయి. మరో 14శాతానికి ప్రాంతాన్ని బట్టి పేర్లు ఉన్నాయి. గోండులు, అల్వాలియా, కాన్పూరియా, ఛమోరి, షిమోగ మొదలైనవన్నీ ఇందుకు ఉదాహరణలు.

మతంతో నిమిత్తం లేకుండా కులాలను బట్టి వృత్తులు ఉన్నాయి. అనేక ఇంటిపేర్లు వారు చేస్తున్న వృత్తి, ఆచారంగా వస్తున్న పదవులు, స్వంత గ్రామం, ప్రాంతం తదితర అంశాలననుసరించి పెట్టబడ్డాయి. సింగ్, ఆచార్య, పటేల్, నాయక్, గుప్తా, శర్మ, ఖాన్ ఇలాంటివి ఉదాహరణలు.

సాంస్కృతిక అలవాట్లు మతాన్ని అధిగమించి ఏర్పడ్డాయి. మొత్తం 775రకాల అలవాట్లను గుర్తించగా అవన్నీ తమ పరిసరాలు, నివాసం, ఆచారాలు వ్యక్తిత్వం ఆహారం, వైవాహిక సంబంధాలు, సాంఘిక కట్టుబాట్లు, ఆర్థికాంశాలు, వృత్తి, ప్రాంత అభివృద్ధి, మతాల ప్రభావాలని బట్టి ఏర్పడ్డాయని తేలింది. హిందువుల ఆచారాలు అలవాట్లను 96.77 శాతం ముస్లింలు, 91,19శాతం బౌద్ధులు, 88.99శాతం సిక్కులు, 77.46శాతం జైనులు అనుసరిస్తున్నారు. ముస్లింల ఆచారాలు, అలవాట్లను 91.18శాతం బౌద్ధులు, 89.95శాతం సిక్కులు అనుసరిస్తున్నారు. 81.34శాతం జైనులు బౌద్ధుల ఆచారాలు, అలవాట్లను అనుసరిస్తున్నారు. షెడ్యూల్డ్ తెగలవారు 96.61శాతం వెనుకబడిన కులాలు 91.29శాతం, షెడ్యూల్డ్ కులాలు 95.82శాతం, ముస్లింలు 91.69శాతం, బౌద్ధులు 88.20శాతం సిక్కుల ఆచారవ్యవహారాలని అనుసరిస్తున్నారు.

వివిధ సముదాయాల గుర్తింపు మతంతో నిమిత్తంలేకుండానే జరిగింది. 3059 సముదాయాల ప్రజలు మృతదేహాలను ఖననం చేస్తుండగా, 2386 కమ్యూనిటీలు దహనం చేస్తున్నాయి. అనేక సముదాయాలు పై రెండు ఆచారాలనీ పాటిస్తున్నాయి. పెళ్ళి వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ, నృత్యం, సంగీత రూపాలు అనేక సముదాయాలలో ఒకేరకంగా జంతువులు, మొక్కలకు ఇతర వస్తువుల పేర్లు కూడా మతాలు, ప్రాంతాల, భాషలకతీతంగా ఉన్నాయి. భారతదేశంలోని కమ్యూనిటీలు దేనికది విడివిడి ఒంటరిగా లేవు. అవి ఒకదానికొకటి భౌతికంగాను, సాంఘికంగాను కలిసే ఉన్నాయి. అనేక శతాబ్దాల నుంచి ఐక్యంగా జీవనపోరాటం చేస్తున్నాయి. ఇదే మన దేశ సాంస్కృతిక 'భిన్నత్వంలో ఏకత్వం'. ఇదే మన ప్రత్యేకత.

౼౼నళినీ తనేజా(విద్యారంగం పై మతోన్మాదుల దాడి)(జనవరి,2000)నుండి.

Address

Rail Vihar Lingampally
Hyderabad
500019

Telephone

+19849008986

Website

Alerts

Be the first to know and let us send you an email when Sramika Sakthi శ్రామిక శక్తీ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sramika Sakthi శ్రామిక శక్తీ:

Share