Unofficial: telangana tnews

Unofficial: telangana tnews pvsrinivas tnews input editor

నాకు నా కుటుంబానికి అత్యంత ఆత్మీయులు..మనస్సున్న మహారాజు ..స్నేహితుల కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తిత్వం ..వయస్సు తో ఆర్థిక స్థ...
09/10/2024

నాకు నా కుటుంబానికి అత్యంత ఆత్మీయులు..మనస్సున్న మహారాజు ..స్నేహితుల కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తిత్వం ..వయస్సు తో ఆర్థిక స్థితిగతుల తో కులం మతం తో సంబంధం లేకుండా అందరితో స్నేహం చేసే గుణం.. వందల ఎకరాలు ఉన్న భూస్వామి..అయినా, జీవిత కాలం అంతా పేదప్రజలకు సేవ చేయడం కోసం కుటుంబాన్ని వదిలి ఒంటరిగా తన స్వగ్రామం అయిన పురుషోత్తయగూడెం (మరిపెడ దగ్గర చిన్న గ్రామం ) లోనే ఉండే వారు.. ఆ చట్టుపక్కల సుమారు మూడు నియోజకర్గాలలోని వందలాది గ్రామాల సాధారణ ప్రజలతో నిత్య సంబంధాలు కలిగిన నాయకుడు..వారికి ఏ ఆమపద వచ్చినా నేను ఉన్నాను అన్నట్లుగా ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు వారికి తక్షణ సహాయం అందించేవాడు.. చాలా విలక్షణ మైన వ్యక్తిత్వం కలిగిన నాయకుడు..స్నేహితులు ఎవరైనా తన గ్రామానికి వస్తే తానే స్వయంగా వెజ్- నాన్ వెజ్ కూరలు చేసి వడ్డిస్తే కాని ఆయనకు తృప్తి ఉండదు..తన వంట మనిసికి డ్రైవర్ కి ఇతర పనిమనుషులకు కావాల్సిన డ్రెస్స్ లను తానే స్వయంగా షాపింగ్ చేసి కొనేవాడు.. షాపింగ్ చేయడం ఆయన హాబీ.. తన దగ్గర పనిచేసే వాళ్ళను సొంత మనుషులులాగా ప్రేమ గా చూసుకుంటాడు.. నరేష్ అన్న గురించి ఎన్ని అని చెప్పాలి! ఏమని చెప్పాలి! నా జీవితంలో ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకుడిని,వ్యక్తిని భవిష్యత్లో చూడలేనని అనిపిస్తుంది.. చాలా అరుదైనా గుణ గణాలు కలిగిన వ్యక్తి..అన్న మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్న.. దుఖాన్ని ఆపులేకపోతున్న... ఎందుకు ఇలా జరిగింది? మంచి మస్సున్న వాళ్లు ఎక్కువ కాలం ప్రజల మధ్య ఉండడం ఎవరికీ ఇష్టం లేదు.. చాలా చాలా ప్రశ్నలు నన్ను వెంటడుతున్నాయి..నా ద్వార పరిచయం అయిన నా మిత్రులను కూడా నాకన్నా ఎక్కువగా ప్రేమిచేవాడు అలా నా ద్వార పరిచయం అయిన వారే CPRO ( cmరేవంత్ రెడ్డి గారి) అయోధ్య రెడ్డి అన్న నరేష్ అన్న నేను మరో ఆత్మీయులు బుడాన్ బేగ్ ( కరోనా సమయంలో కోవిడ్ బారిన పడి మరణించారు) నేను నరేష్ అన్న బేగ్గారు ముగ్గురం చాలా ఆత్మీయులు గా ఉండేవాళ్లం మాతో పాటు అయోధ్య అన్న కూడా గోవా ట్రిప్ కి వచ్చాడు..నరేష్ అన్న లాగా గొప్ప వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవడం ఎవరికి సాధ్యం కాదేమో అనిపిస్తుంది స్నేహం చేసే విషయంలో కులం ఆర్థిక స్థితిగతులు వయస్సు చూడని ఆ గుణం ఎంత మందికి సాధ్యం? అన్న నీ మరణం నాకు నా కుటుంబానికి వ్యక్తిగతంగా చాలా నష్టం అంతకన్నా నిన్ను నమ్ముకుని నీవే దిక్కు అనుకున్న ప్రజలకు తీరని నష్టం ఏపదవి లేకపోయినా ఒక్క ఫోన్ కాల్ తో తక్షణమే సహాయం చేసే నాయకులు దొరకరు.. నిన్ను అన్ని పార్టీలు వాడుకొని వదిలేసాయి చిన్న పదవి ఇవ్వలేదు మీరు ఎప్పుడూ అంటుండే వారు నా అంత దురదృష్టవంతుడు ఉండడు అని ఆ మాటలు మమ్మల్ని వెంటాడుతున్నాయి నూకల నరేష్ రెడ్డి అన్నకు నిండు మనస్సు తో నివాళి

 #తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటరియేట్ ముందు పెట్టాలి అంటూ  #కవులు కళాకారులు మేధావులు  #రాహుల్ గాంధీ కి లేఖ రాయడం నిజంగా స...
21/08/2024

#తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటరియేట్ ముందు పెట్టాలి అంటూ #కవులు కళాకారులు మేధావులు #రాహుల్ గాంధీ కి లేఖ రాయడం నిజంగా సంతోషం.. కాకపోతే ఇప్పుడే వీరికి # Telangana Thalli గుర్తుకి రావడం కొంత ఆశ్చర్యం కలిగించింది. కొత్త సెక్రటరియేట్ నిర్మించే సమయంలోనే ఈ డిమాండ్ ను నాటి ముఖ్యమంత్రి గారి ముందు పెట్టి ఉండాల్సింది. పాత సచివాలయం బయట నాడు #తెలుగు తల్లి విగ్రహం ఉందని అందరికి తెలుసు..ఈ ప్రభుత్వం #రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలి అని నిర్ణయించిన తరువాత తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి, రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే మీము అధికారంలోకి వచ్చాక తొలిగిస్తాం. అంతే కాదు ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ కి ఉన్న పేరును కూడా తొలిగిస్తాం,అని ప్రకటించాక ఇది రాజకీయ సమస్య గా మారిన తరువాత ఆ సందర్బంలో మేధావులు ఈ లేఖ రాయడం BRS ను బలపరిచ్చినట్లు అయ్యింది.. పైగా Telangana CMO తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియేట్ ప్రధాన ద్వారం ముందు పెడతామని ప్రకటించింది.. Anumula Revanth Reddy - Telangana CM కూడా స్వయంగా ప్రకటించారు.ఈ లేఖలో సంతకం చేసిన చాలా మంది మేధావులు (అందరు కాదు ) పదేళ్ల కాలంలో తెలంగాణ ఆస్థిత్వానికి దెబ్బ తగిలినప్పుడు లేదా ప్రమాదంలో పడినప్పుడు మౌనంగా ఉన్నారు...వీరిలో కొందరికి ఇప్పుడే తెలంగాణ భాఉదేవ్వగాలు గుర్తుకి రావడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియడం లేదు.తెలంగాణ సోయి రావడం తప్పు కాదు.. కాకపొతే ఒక సమయంలో సందర్భంలో లేకుండా పోయి,, మరో సమయంలో సందర్భంలో రావడమే చర్చనీయంశ... నాకు వచ్చిన ఆలోచన షేర్ చేసుకున్న ఎవరిని తక్కువ చేయాలని మాత్రం కాదు..పాజిటివ్ చర్చ కోసం మాత్రమే..

గద్దర్ అన్న బిగ్ ఇంటర్వ్యూ లింక్
28/05/2023

గద్దర్ అన్న బిగ్ ఇంటర్వ్యూ లింక్

Telangana Folk Singer Gaddar Exclusive Interview Live | Folk Singer Gaddar Big Interview | BIG TV BIG TV Telugu Ne...

Address

Bajara Hills Road No 10
Hyderabad
500032

Telephone

+918919877795

Website

Alerts

Be the first to know and let us send you an email when Unofficial: telangana tnews posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share