07/09/2025
లంబాడీలు ను తొలగించాలని ఆర్ట్స్ కళాశాల ఎదుట మీడియా మిత్రులు నిర్వహించిన కార్యక్రమంలో
"ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు" బట్టా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.......
ఈరోజు "అత్యున్నత న్యాయస్థానం ఐన సుప్రీమ్ కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు షెడ్యూల్ ట్రైబ్ గా చలామణిలో ఉన్న లంబాడీలకు ఎటువంటి ఆధారాలు ఉన్నాయి అని నోటీసు" ఇచ్చిన తరువాత ఇప్పుడు ఈ రాష్ట్రం లో ఉన్నటువంటి లంబాడి, బంజారా, సుగాలీ అనేటువంటి వాళ్ళు ఈరోజు ఇక్కడున్నటువంటి తెలుగు ప్రజలను, తెలంగాణ వాదులను, ప్రజాస్వామిక వాదులను, జాతీయ వాదులను కూడా కుట్రలు పన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం కనిపిస్తా ఉన్నది.
"ఆదివాసులు అంటే చరిత్రపుటల్లోకి ఎక్కినటువంటి చరిత్ర ఉన్నది. ఇవ్వాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అంటే తెలంగాణ లో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజానీకం యొక్క త్యాగాల తల్లుల నుండి వచ్చినదే తెలంగాణ. ఇవ్వాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకం అయినటువంటి "నీళ్ళు, నిధులు, నియామకాలు" అనేటువంటి అంశం కూడా మా "కొమురం దాదా ఇచినటువంటి జల్, జంగిల్, జమీన్" అనే నినాదం నుండి వచ్చినదే".
ఇవ్వాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ట్రైబల్ మినిస్టర్ గా పది సంవత్సరాల కాలం పాటు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళే మంత్రి హోదాలో ఉన్నప్పుడు మేము వెళ్ళలేనటువంటి పరిస్థితి మా ఆదివాసులది.
"ఇవ్వాళ మా ఆడపడుచు, మా అడబిడ్డ, ఆదివాసీ ముద్దుబిడ్డ, సమ్మక్క సారక్క వారసురాలు మా అక్క "సీతక్క" గారు కేబినెట్ హోదాలో ఉంటే మాజీ పార్లమెంటేరియన్ సీతారామ్ నాయక్ మాట్లాడుతూ.....సీతక్క తన సొంత కానిస్టిట్యుయన్సీలో తిరిగే విషయం గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ.....గతంలో BRS ప్రభుత్వాన్ని కూలగొట్టినటువంటి చరిత్ర మాది, మేము తలచుకుంటే ఏదైనా చేయగలుగుతాం అనేటువంటి పరిస్థితిని రెచ్చగొడుతున్నాడు. అసలు ఆయన పోటీ చేసినటువంటి పార్లమెంట్ స్థానం మహబూబాద్ కానిస్టిట్యుయన్సీ, ఆయన పోటీ చేసినటువంటి పార్లమెంట్ స్థానం లో ఆదివాసుల ప్రజానీకం ఎంత ఉన్నారు అనేది ఆయన గుర్తుపెట్టుకోవాలి, మరి ఆయన ఎట్లా తిరుగుతాడు అనే విషయం ఆయన గుర్తుపెట్టుకోవాలి, ఆలోచించుకోవాలి.
"ఇవ్వాళ ఆదివాసులకు పోరాటం అంటే కొత్తేమీ కాదు, ఆదివాసులంటే ఉద్యమం, ఉద్యమం అంటే ఆదివాసులు అనేటువంటి చరిత్ర ఉన్నది". అది ఆయన గుర్తు పెట్టుకోవాల్సిన విషయంగా తెలియజేస్తున్నాము.
అయ్యా మేధావులారా, ప్రజాస్వామికవాదులారా, తెలంగాణ వాదులారా, జాతీయవాదులారా ఒక్కసారి మా గొంతుకతో మా ఈ ఆవేదన వెల్లబుచ్చుకునేటువంటి ఈ ప్రయతం, న్యాయస్థానం ద్వారా న్యాయపోరాటం ఎప్పుడైతే మేము తీసుకున్నామో ఆరోజునుండి కూడా మాకున్నటువంటి, మాతో కలిసివచచ్చేటువంటి వాళ్ళను కూడా....."మేము 40 లక్షల జనాభా ఉన్నాము, మేము తలచుకుంటే ఏదైనా చేయగల్గుతాము అని రాజకీయ నాయకులను, రాజకీయ పార్టీలను ఒక తప్పుదోవ పట్టించే పరిస్థితి కనిపిస్తున్నది".
"ఒక క్రిమినల్ క్యారెక్టర్ కలిగినటువంటి వాళ్ళు ఈరోజు ఈ రాష్ట్రం లో ఏర్పడి "మా రిజర్వేషన్ను" ఉపయోగించుకొని ఉన్నతమైన అవకాశాలను అందిపుచ్చుకొని విద్య, ఉద్యోగం, ఉపాధి రంగాలలో వాళ్ళే, అదికాక రాజకీయ రంగం లో కూడా వాళ్ళే, అదీ సరిపోదు అన్నట్టు చివరికి మా "అస్థిత్వం" లో కి చొరబడ్డారు.
ఇవ్వాళ మా "సమ్మక్క సారక్క ట్రస్టు బోర్డులోకి" కూడా చేరుకుని వాళ్ళ మంత్రి ఉన్నప్పుడు మాకు కూడా వాటా కావాలి అని మాట్లాడినటువంటి దౌర్భాగ్యపు స్థితి కనిపిస్తున్నది. "మా విద్య, ఉద్యోగం, ఉపాధి రంగాలకు మేము దూరం ఐన కూడా ఇబ్బంది పడలేదు, రాజకీయం లోకి చేరి దోచుకున్న కూడా ఇబ్బంది పడలేదు కానీ ఇవ్వాళ "మా అస్తిత్వమే ప్రశ్నార్థకం" ఐన తరువాత "మేము, మా అస్థిత్వం ఏంటి అనే పరిస్థితి నెలకొన్నది" అందుకే మేము పోరాటానికి సిద్ధమయ్యము".
అయ్యా మేధావులారా, ప్రజాస్వామిక వాదులారా, తెలంగాణ వాదులారా గుర్తుపెట్టుకోండి "ఇంత అన్యాయం జరుగుతున్నది కావున మేము నిజాయితీగా, రాజ్యాంగబద్దంగా కోట్లాడుతున్నాము, రాజ్యాంగం లో మాకు ఆ హక్కు ఉన్నది, మా హక్కుల కోసం మేము కోట్లాడుతున్నాము".
ఈరోజుకి ఐన కూడా న్యాయంవైపు నిలబడాలి అని, మా గొంతులో గొంతుక అయ్యి మీరు మాతో కలిసిరావాలని కోరుకుంటున్నాము. "వాళ్ళను చట్టబద్ధంగా కలిపితే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, చట్టబద్ధంగా కలపలేదు అనేదే మా వాదన".
"1956 లో తెలంగాణ మరియు ఆంధ్రా కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడినప్పుడు ఆంధ్రాలో ఉన్న సుగాలీలను చేర్చాలనే ప్రతిపాదనను గడి లింగన్న గౌడ్ అనే ఒక MP ప్రవేశపెట్టడం జరిగింది కానీ అది నెగెటివ్ బిల్లు అవ్వడం జరిగింది కానీ......దాని కూడా వీళ్ళు ఆసరాగా చేసుకుని మమ్మల్ని ST జాబితాలో కలిపారు అంటున్నారు, మరి 1971 లో BC A జాబితాలో ఎలా ఉన్నారు? మరియు 1976 లో ST జాబితా అని వాళ్ళే అంటారు, ఇంకొక పెద్దమనిషి మేము 1931 నుండి నిజాం ప్రభుత్వం లో ఉన్నామంటాడు", అంటే తెలంగాణ ప్రజానీకాన్ని, ప్రజాస్వామికవాదుల్ని, మేధావుల్ని, రాజకీయ పార్టీలను సైతం కుట్ర పూరితంగా
తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
కాబట్టి "ఈరోజు RTI చట్టం ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే తెలియజేసింది ఏమనగా ఆంధ్రప్రదేశ్ లో ST హోదా కల్పించబడలేదు అని కేవలం DNTsగా మాత్రమే పరిగణించబడ్డారు అని", ఐతే ఈ రాష్ట్ర గవర్నర్లను, రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మా గోస, ఆవేదన వెలిబుచ్చుకున్నా కూడా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో న్యాయపోరాటం చేద్దాం అని నిర్ణయించుకోవడంతో ఈరోజు "సుప్రీమ్ కోర్టు" వరకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.
"ఇప్పటికీ.....తప్పుదోవ పట్టించే కుట్రలు జరుగుతున్నాయి, తెలంగాణ ప్రజానీకాన్ని,మేధావుల్ని, రాజకీయ పార్టీలను తమ జనాభా చూపి బెదిరించడం, మభ్యపెట్టడం జరుగుతుంది".
"ఇవ్వాళ ఆదివాసి ప్రజాప్రతినిధులు మన జాతి మన అస్తిత్వ సమస్య అని ముందుకు వస్తే వాళ్ళను వ్యక్తిగతంగా దూషిస్తున్నారు, వాళ్ళను గురిపెడుతున్నారు. ఆదివాసీ ప్రజానీకం పై, ఆదివాసీ ప్రజాప్రతినిధుల పై, ఆదివాసీ మద్దతుదారుల పై ఎలాంటి దాడులు జరిగినా పోరాటం చేయడం మాకు కొత్తకాదు. చరిత్రపుటల్లోకి చూస్తే తెలుస్తుంది ఆదివాసుల పోరాట చరిత్ర".
"ఆదివాసుల జీవితమే పోరాటం". రాజకీయ నాయకులను, రాజకీయ పార్టీలను అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని మభ్యపెట్టే కుట్ర జరుగుత్తున్నది.
వాళ్ళు 1976లో 108 యాక్ట్ ప్రకారం కలిపారు అంటున్నారు, అసలు "108 యాక్ట్" అనేది "ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ " కదా,
‘‘ఈ చట్టంలో ఎక్కడైనా ఈ కులాలు నీ కలపండి అని కలిపినం అని చెప్పలేదు".....
అంతేకానీ మిమ్మల్ని కలపడానికి
"ఒక కమిటీ వేయలేదు",
"ఒక ఆంత్రోపాలాజికల్ సర్వే కూడా జరగలేదు", "రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ కూడా రాలేదు"
అటువంటిది ఇవ్వాళ
"మా రిజర్వేషన్ ను ఉపయోగించుకొని విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాలలో అభివృద్ధి చెందడమే కాకుండా మా అస్థిత్వం పై దాడి చేస్తూ మమ్మల్ని తప్పుదోవ పట్టి మమ్మల్నే ఆదివాసులు కాదు అని మాట్లాడుతున్న పరిస్థితి".
కాబట్టి "తెలుగు ప్రజల్లారా, తెలంగాణ ప్రజల్లారా, విప్లవోద్యమకారులు, ప్రజాస్వామికవాదులు, మేధావులు "మా ఆదివాసీ" సమాజానికి గొంతుక అయ్యి మీ మద్దతు తెలియజేయాలని మా ఆదివాసీ సమాజం తరపున విన్నవించుకుంటున్నాం.
"దయచేసి ఒక్కసారి ఆలోచించండి నేటికీ మా ఆదివాసుల నుండి ఒక్క IAS , IPS ఒక గ్రూప్ 1 ఆఫీసర్ లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి."
మా ఆదివాసులు ఇంకా "50 ఏళ్ళు" వెనక్కి "నెట్టివేయబడ్డారు" అని గమనించగలరు. చట్టబద్ధంగా కలిపితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ...అలా జరగలేదు.
"రాజ్యాంగబద్ధంగా మేము సుప్రీమ్ కోర్టు కి మా గోడును తెలిజేసాము అంతేకానీ మేము ఎన్నడూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు".
ఇప్పుడు ఈ విషయాన్ని కూడా తెలుగు ప్రజలకు, తెలంగాణవాదులకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతున్నది అని తెలియజేస్తున్నాను.
"ఇవ్వాళ కాకపోతే రేపైనా మాకు న్యాయం జరుగుతుంది. అని ఈ రాజ్యాంగ మీద ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మీద మాకు నమ్మకం ఉంది.
"1976 లో యానాది, ఎరుకల, లంబాడీలు DNTలుగా ఉన్నారో వాళ్ళకు కేవలం విద్యాపరంగా రిజర్వేషన్ G O 149 ద్వారా కల్పించడం జరిగింది. దాన్నే పొందుపరచండి, దాన్నే ఇవ్వండి అంతకుమించి కొత్తగా ఏదైనా ఇచ్చిన కూడా అది చెల్లుబాటు కాదు సరికదా అది మీ రాజకీయలకు చెందిన ప్రోద్బలమో లేక వీళ్ళు మభ్యపెట్టినటువంటి మాటలకు మీ రాజకీయ సౌలభ్యం కోసం లేక మీ సొంత ప్రయోజనాలకోసం చేసినటువంటి తప్పిదం అవుతుంది".
ఇది దృష్టిలో పెట్టుకొని మీరు
"ఆదివాసుల పక్షమా?"
"న్యాయం పక్షమా?"
"అన్యాయం పక్షమా?"
అనేది మీరు నిర్ణయించుకోవాల్సిన బాధ్యతగా
ఈ ఆర్ట్స్ కాలేజీ వేదికగా తెలంగాణ
"ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరం" విద్యార్థుల నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరం OU కమిటీ విద్యార్థులు
కొడెం పాపారావు
బాడిషా లక్ష్మీపతి
కొమరం సాగర్
పెండకట్ల మహేందర్
హరిత
జీవన్
హరిత విద్యార్దిని విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు...