Tsrtcswf

Tsrtcswf unity-struggle.unite the workers and struggle unitely is our motto.

06/02/2026

కార్మిక హక్కులు నిలబెట్టుకునేందుకు, లేబర్ కోడ్ లు రద్దు చేయాలని 2026 12న ఫిబ్రవరి దేశశ్యాప్త సమ్మెలో పాల్గొందాం.TGSRTC కార్మిక సంఘాల పిలుపు
**********************

సోదరీ, సోదరులారా!

కార్మిక హక్కులు నిలబెట్టుకునేందుకు, లేబర్ కోడ్ లను తిరస్కరిస్తూ ఫిబ్రవరి 12న జరిగే అఖిల భారత సార్వత్రిక సమ్మెలో పాల్గొనవలసిందిగా TSRTC SWU (INTUC), TSRTC SWF (CITU) రాష్ట్ర కమిటీలు పిలుపునిస్తున్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవడం కోసం జరిగే ఈ సమ్మెలో ఆర్టీసి కార్మికులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

_ఏమిటీ లేబర్ కోడ్స్ ?:

కార్మికవర్గం 1920 నుండి పోరాడి అనేక హక్కులు సాధించుకున్నది. ఈ హక్కులన్నీ సమానపనికి సమానవేతనం, గ్రాట్యుటీ చట్టం, వర్క్ మెన్ కాంపెన్సేషన్ ఆక్టు, షాప్స్ & ఎస్టాబ్లిష్మెంటు యాక్టు, కనీస వేతన చట్టం, బోనస్ యాక్ట్, కాంట్రాక్టు ఎబాలిష్మెంటు యాక్టు, పి.ఎఫ్., ఇ.ఎస్.ఐ మొదలగు 44 చట్టాల రూపంలో పొందుపర్చబడియున్నాయి. ఈ హక్కులు అన్నీ ఎవరి దయాధర్మం కాదు. దేశంలోని కార్మికులు పోరాటాలు- త్యాగాలు చేసి, నష్టాలు భరించి సంపాదించుకున్నవే. 2014 లో కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలు పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చాలని ప్రయత్నిస్తూనే వచ్చింది. 44 కార్మిక చట్టాలలో 15 చట్టాలు జిఎస్టి చట్టంలో కలిసిపోగా, మిగిలిన 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 2019, 2020 సం॥రాలలో 4 లేబర్ కోడ్స్ బిజెపి తెచ్చింది. (1) వేజ్ కోడ్ 2019 (2) ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020 (3) సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020, (4) ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ & వర్కింగ్ కండీషన్స్ కోడ్ 2020. చట్టంగా వున్నప్పుడు ఏమైనా మార్పులు చేయాలంటే మరలా రాష్ట్రాలను సంప్రదించడంతో పాటు, పార్లమెంటులో ఆమోదం పొందాల్సి వుంటుంది. 'కోడ్' లుగా తీసుకొస్తే ఒక 'ఎగ్జిక్యూటివ్ ఆర్డర్' ద్వారా ఏమైనా మార్పులు చేయవచ్చు. అందుకే బిజెపి ప్రభుత్వం కోడ్స్ ను తెచ్చింది.

_కొత్త లేబర్ కోడ్స్న ఎందుకు తిరస్కరించాలి?:

కాలానుగుణంగా మార్పులు రావాలని, కార్మికులకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకే పాత కార్మిక చట్టాల స్థానంలో కొత్త లేబర్ కోడ్స్ తీసుకొచ్చామని బిజెపి ప్రభుత్వం చెబుతున్నది. చాలా లాభాలు ఉన్నాయహో అంటూ పత్రికల్లో, సోషల్ మీడియాలో కథనాలు వండి వారుస్తున్నది. మార్పులు కాలానుగుణంగా రావల్సిందే! కార్మికులకు కూడా మార్పుల వల్ల ప్రయోజనాలు చేకూరవలసిందే! నిజంగా కార్మికుల మేలు చేయాలన్న తపన బిజేపి ప్రభుత్వానికి ఉంటే, లేబర్ కోడ్స్ రూపొందించే టప్పుడు, దేశంలోని కార్మిక సంఘాలతో ఎందుకు చర్చించలేదు? 2014 కంటే ముందు ప్రతి ఏటా ఇండియన్ లేబర్ కాంగ్రెసు నిర్వహించేవారు. మహా ఘనత వహించిన బిజెపి అధికారంలోకి వచ్చిన పుష్కరకాలంలో ఒక్కటంటే ఒక్కటి కూడా కార్మిక సంఘాలతో లేబర్ కాంగ్రెస్ సమావేశం జరుపలేదు. కరోనా కాలంలో లేబర్ కోడ్స్ బిల్లులు పార్లమెంటులో ప్రవేశపెట్టి, ఎం.పి. లను పార్లమెంటు నుండి సస్పెండ్ చేసి మరీ లేబర్ కోడ్స్ పై ఒక్కమాట కూడా చర్చించకుండా చట్టాలు చేసిన పాప చరిత్ర కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానిది.

__లేబర్ కోడ్స్ లో ఏముంది?:_

నేషనల్ ఫ్లోర్ లెవెల్ వేజ్ గా (కనీస వేతనం) రోజుకి రూ.178/-లుగా కేంద్రం నిర్ణయించింది. అంతకుమించి ఉంటే వేతనం పెంచవలసిన అవసరం లేదు. ప్రస్తుతం 12 రోజులకు ఒక ఇ.ఎల్ వస్తున్నది. దాన్ని 20 రోజులకి ఒక ఇ.ఎల్ గా మార్చారు. ఒక సంవత్సరానికి గ్రాట్యుటీ ఇస్తామని చెప్పి, 240 రోజుల తర్వాత పర్మినెంటు చేసే పద్దతిని రద్దు చేశారు. ఇక నుండి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంటు మాత్రమే ఉంటుంది. అంటే నెల/మూడు నెలలు/ ఆరు నెలలు / సంవత్సరం/మూడు / ఐదేళ్ళు మాత్రమే ఉద్యోగం ఇస్తున్నట్లు అపాయింట్మెంటు లెటర్ ఇస్తారు. లేబర్ కోడ్స్ లో గొప్పగా చెప్పిన అపాయింట్మెంటు లెటర్ల అర్థం ఇదే! డి.ఎ., పి.ఎఫ్., ఇ.ఎస్.ఐ లాంటివి దీనికి వర్తించవు. యూనియన్ల బదులు వెల్పేరు కమిటీలను మేనేజిమెంట్ నామినేట్ చేస్తుంది. యూనియన్లతో మేనేజిమెంట్ మాట్లాడదు. లేబర్ డిపార్టుమెంటు నిర్వహించే గుర్తింపు ఎన్నికలు కూడా యాజమాన్యమే నిర్వహిస్తుంది. ఒకవేళ మాట్లాడాలంటే ఆ సంస్థలో 51% ఓట్లు వచ్చిన యూనియన్ తో మాత్రమే మాట్లాడుతుంది. ఇలాంటి చట్టం చేసిన బిజెపి కి 36% ఓట్లు మాత్రమే వచ్చాయని మనం మర్చిపోవద్దు.

పైవన్నీ చదివిన ఆర్టీసి కార్మికులకు ఇందులో కొత్తేమి ఉంది! ఇవన్నీ, గత ఐదేళ్ళుగా ఆర్టీసిలో ఉన్నవే కదా అన్పిస్తుంది. నిజమే మనం 2019 లో సమ్మె చేసిన తర్వాత ఆనాటి నియంత ప్రభుత్వం ఇవన్నీ ఆర్టీసిలో అమలు చేయాలని 2019 చివరిలోనే ఆదేశించింది! అవే అంశాలతో 2019, 2020 సం॥రాలలో బిజెపి లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. చూశారా? మన కార్మికుల హక్కులను తొక్కెయ్యటానికి రాజకీయ పార్టీలు ఎంత ఐక్యంగా పని చేస్తాయో?

_లేబర్ డిపార్టుమెంటు, కోర్టులు మనకు న్యాయం చేయవా?:

చెయ్యవు! ఎందుకంటే లేబర్ కోడ్స్ అమలులోకి వస్తే లేబర్ డిపార్టుమెంటుకి ఎలాంటి అధికారాలు వుండవు. అసలు ఉనికే ఉండదు. కార్మికుల కోసం లేబర్ కోర్టులే వుండవు. అన్ని ట్రిబ్యునల్కు పోవాల్సిందే. కార్మికులకు అనుకూలంగా ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోదని, కేవలం ఫెసిలిటేటర్ (సులభతరం చేసేవారు)గా ఉంటారని, లేబర్ కోడ్ లోనే పేర్కొన్నది. చట్టాల ప్రకారమే కోర్టులు తీర్పులు ఇస్తాయి. చట్టాన్ని అమలు చేయటమే న్యాయం అంటాయి కోర్టులు. కాబట్టి అక్కడా మనకు న్యాయం జరుగదు. ఈ సంగతి 2019 సమ్మెలో మనకు అర్థమైంది కదా!"

_మనమేం చేయాలి?:_

ఫిబ్రవరి 12న సమ్మెలో పాల్గొనాలి! 1991 నుండి దేశవ్యాపితం గా జరిగిన సమ్మెలలో ఆర్టీసి కార్మికులు అరకొరగా పాల్గొంటున్నారు. జరిగిన 23 సమ్మెలు. కార్మిక వ్యతిరేక విధానాలను ధిక్కరిస్తూ, ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ జరిగిన సమ్మెలే. ప్రభుత్వ విధానాల వల్ల వచ్చే కష్ట, నష్టాలను ఆర్టీసి కార్మికులుగా మనం పట్టించేకోలేదు. ఆర్టీసిలోని జీతభత్యాలు, క్యాటగిరీ సమస్యలూ మొదలగు వాటికే పరిమితమై పోరాడాము! సమ్మెలు చేశాము. మనం ఎంతో బలంగా సమ్మె పోరాటాలు చేసినా, ఆర్టీసికి మాత్రమే పరిమిత మయ్యాయి. ఒంటరిగా మిగిలిపోయాం. అందుకే తొలి దెబ్బ మన మీదే పడింది. లేబర్ కోడ్స్ అప్రకటితంగా ఆర్టీసిలో అమలు జరుగుతున్నాయి. ఆర్టీసి కార్మికులను పీల్చిపిప్పి చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఆర్టీసి కార్మికుల ప్రాణాలు పొట్టన పెట్టుకుంటున్నవి. ఆర్టీసి కుటుంబాలను అరిగోస పెడుతున్నవి ఆంక్షల ముసుగులో ఉన్న లేబర్ కోడ్ లేనని గుర్తించాలి.

అందుకే, ఇప్పటికైనా కదులుదాం! దేశవ్యాపితంగా లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ప్రకటించిన యుద్ధంలో పాల్గొందాం. ఫిబ్రవరి 12 సమ్మె ఆర్టీసిలో సంపూర్ణంగా జరిగితేనే ఆర్టీసిలో కోల్పోయిన హక్కులను, యూనియన్లను తిరిగి పొందగలుగుతాము. సమ్మెలో పాల్గొంటే ఒక రోజు జీతం పోతుంది. కానీ పోయిన హక్కులు సాధించుకుంటాము. ధన్యవాదములతో

రాష్ట్ర కమిటీలు

టీఎస్ ఆర్టీసి స్టాఫ్ & వర్కర్స్ యూనియన్ (INTUC).

టిఎస్ ఆర్టీసి స్టాఫ్ & వర్కర్స్ ఫెడరేషన్ (CITU).

https://youtu.be/61VKiyWy3Pc?si=EY0Ny4PjkndU2nez
06/02/2026

https://youtu.be/61VKiyWy3Pc?si=EY0Ny4PjkndU2nez

కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ కార్మికుల హక్కులపై నేరుగా దాడి చేస్తున్నాయి.పని గంటల.....

06/02/2026

Address

Zamisthanpur
Hyderabad
500020

Opening Hours

9am - 5pm

Telephone

+919490098894

Website

Alerts

Be the first to know and let us send you an email when Tsrtcswf posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category