John Peta Youth Association

John Peta Youth Association John Peta Youth Association is a Non-Profit Organization, Located at John Peta Kaikakru Eluru AP

SC వర్గీకరణ మాదిగ మరియు ఉపకులాల  #మానవ_హక్కులకు సంబంధించిన అంశం. 🏛️ స్వతంత్ర భారతదేశంలో 77 సంవత్సరాలు గడిచినా, ఇంకా రిజర...
01/09/2024

SC వర్గీకరణ మాదిగ మరియు ఉపకులాల #మానవ_హక్కులకు సంబంధించిన అంశం.

🏛️ స్వతంత్ర భారతదేశంలో 77 సంవత్సరాలు గడిచినా, ఇంకా రిజర్వేషన్ల గురించి స్పష్టమైన అవగాహన లేని ఎస్సీ కులాలు వేలల్లో ఉన్నాయి. కేవలం కొన్ని ఎస్సీ కులాలు మాత్రమే తిరిగి తిరిగి రిజర్వేషన్ల లాభాలు పొందుతుండటంతో, అందరికీ సమానంగా రిజర్వేషన్ ప్రయోజనాలు అందించాలని ఈ తీర్పు ఇచ్చింది.

🎉 ఈ తీర్పు మాదిగ ఉపకులాల హక్కుల కోసం 30 సంవత్సరాలుగా పోరాడిన #మందకృష్ణ_మాదిగ గారి సుదీర్ఘ కృషి ఫలితం #మేమెంతో_మాకంత అనే నినాదంతో ప్రారంభమైన #మాదిగ_దండోరా ఉద్యమ విజయం.

🐘 ఈ తీర్పును నార్త్ లో వ్యతిరేకిస్తుంది మాదిగ సమాంతర కులం అయిన చమార్లు అయితే సౌత్ లో వ్యతిరేకిస్తుంది కొందరు మాలలు. ఇద్దరూ వ్యతిరేకిస్తుంది ఒకటే కారణం - ఇప్పటి వరకు తమ జనాభా కన్నా వారు ఎక్కువ రిజర్వేషన్ ఫలాలు పొందడమే.

🪜 నిచ్చెన మెట్ల కులవ్యవస్థలో దళితులు అడుగున ఉంటే వారిలో కొన్ని ఉప కులాలు ఈ సమాజానికి అందనంత దిగువున ఉన్నాయి, దళితుల్లో కుడా పైకులానికి ఊడిగం చేస్తూ కింద కులాన్ని నిర్దయగా తొక్కేసే మనువాద భావజాలం బలంగా వుంది. ఇక్కడ ఒకటి స్పష్టం ఏ రెండు కులాలు ఒకటి కాదు, కొన్ని అంశాల్లో కలసి పని చేసినా మెజారిటీ అంశాల్లో అనేక అంతరాలు వున్నాయి. ముందుగా దళితుల్లో ఈ కుల భావన పోకుండా కలసి పోరాటం చేయడం రాజ్యాదికారం వైపు ప్రయాణం చేయడం అసాద్యం, ఈ భావన వదలకపోతే కుల వివిక్షలో భాగంగా మిగిలిపోవడం ఖాయం.

✨ ఈ సందర్భంగా అన్ని వర్గాలు సమన్వయం పాటిస్తూనే, రిజర్వేషన్ ఫలాలు అన్ని వర్గాలకు సమానంగా దక్కేలా ఆయా కులాల నాయకులు ప్రణాళికలు వేయాల్సిన సమయమిది.

✅ రిజర్వేషన్స్ వున్నాయి కానీ వాటిని పొందే విద్యావంతులు ఆయా కులాల్ల్లో వున్నారా?

ఆయా సమూహాల్ల్లో రిజర్వేషన్ ఫలాలు పొందటానికి ఆవసరమైన నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వ సహకారంతో మారుమూల గ్రామాల్లో కుడా ఆధునిక లెర్నింగ్ సెంటర్స్ ఏర్పాటుకి అవసరమైన సహాయ సహకారాలు అందించాలి. ( - Human Rights Initiative ద్వారా ప్రతి వెనకబడిన గ్రామాల్లో లెర్నింగ్ సెంటర్స్ ఏర్పాటుకి కృషి చేస్తున్నాం )

✅ #కుల_గణన: ఈ దేశంలో ప్రతి విషయంలో కుల అడ్డొస్తుంది, మన సమాజంలో బలంగా పాతుకుపోయింది అనే విషయాన్ని గుర్తించాలి. "మేమెంతో మాకంత" లెక్క తేలాలి అంటే దేశంలో కుల గణన జరగాలి. ప్రతి పది సంవత్సరాలకు జన గణన జరుగుతుంది కానీ కుల గణన జరగడం లేదు. వాటి ఆధారంగా రిజర్వేషన్స్ అమలు కావాలి. కుల గణన జరిగేలా ప్రభుత్వం పైన వత్తిడి తేవాలి.

✅ #ప్రైవేటు_రిజర్వేషన్స్ : ప్రస్తుతం ప్రభుత్వ నిర్వహణలో ఉన్న అనేక సంస్థలు క్రమంగా ప్రైవేటీకరణ దిశగా సాగుతున్నాయి. ఈ సందర్భంలో, ప్రైవేటీకరణకు గురవుతున్న ప్రభుత్వ సంస్థల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయడం చాలా కీలకం. రిజర్వేషన్లు సామాజిక న్యాయం, సమాన అవకాశాలను అందించేందుకు సహాయపడే ముఖ్యమైన సాధనాలు. ఇవి వివిధ సామాజిక వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఇచ్చేలా, వారి ఆర్థిక మరియు సామాజిక స్థితిని మెరుగుపరచడానికే ఉద్దేశించబడ్డాయి. కనుక, ప్రైవేటీకరణ జరుగుతున్నా కూడా, ఈ రిజర్వేషన్ల ప్రాధాన్యతను కొనసాగిస్తూ, అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు అందించేందుకు ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించాలి. ఈ విధంగా, సమాజంలోని ప్రతి వర్గం ప్రగతి పథంలో ముందుకు సాగేందుకు ప్రైవేటు రిజర్వేషన్స్ కొరకు ప్రభుత్వాల మీద వత్తిడి తేవాలి.

✅ #కుల_నిర్మూలన: సమాజంలో ఉన్న కులపరమైన వివక్షలను, అసమానతలను పూర్తిగా తొలగించాలంటే కుల నిర్మూలన అత్యవసరం. కులవ్యవస్థ కారణంగా ఇంకా అనేక సామాజిక సమస్యలు ఉన్నాయి, అవి సామాజిక అభివృద్ధికి పెద్ద అడ్డుకట్ట అవుతున్నాయి. కాబట్టి, కుల నిర్మూలనతో పాటు భూమిని జాతీయం చేసి భూసమానత్వాన్ని తీసుకురావడం ద్వారా కులపరమైన, ఆర్థికపరమైన వివక్షలను తొలగించవచ్చు.

✅ #రిజర్వేషన్స్_అంతం_కావాలి: కుల నిర్మూలన జరిగింది, భూమి జాతీయం అయింది, అందరికి సమాన హోదా వుంది, ఇక రిజర్వేషన్స్ తో పనేముంది? ఈ దేశంలో రిజర్వేషన్ల వ్యవస్థను పునరాలోచించి, నిజమైన సమాన సమాజం కోసం వాటి రద్దును కూడా పరిగణించాలి. ఈ చర్యలన్నీ కలిపి ఒక సమానత్వ సమాజం నిర్మాణానికి దారితీస్తాయి.

🤝 గమనిక: ఈ తీర్పు పై నా అభిప్రాయాలను మరియు భవిష్యత్ కోసం నా అభిప్రాయాలను ఇక్కడ పంచుకున్నాను. భారతదేశంలో కుల వివక్షను పూర్తిగా నిర్మూలించడానికి, సమాన హక్కులు మరియు అవకాశాలు ప్రతి వర్గానికి అందేలా చేయడానికి సామాజిక ఉద్యమాలు, ప్రభుత్వ విధానాలు, మరియు న్యాయవ్యవస్థలు సమన్వయంతో ముందుకు సాగాలని నేను భావిస్తున్నాను. ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లు, కుల గణన, మరియు సమాన విద్యా అవకాశాలు అందించడం వంటి అంశాలు ఎంతో కీలకం. కుల నిర్మూలన సాధించడంలో ప్రతి ఒక్కరికి కీలక పాత్ర ఉంది. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే, మన సమాజంలో సమానత్వం సాధించడానికి మనందరం కలసి కృషి చేయాలి.

సామాజిక ఉద్యమాభివందనాలు
విజయ్ వంగలపూడి - మానవ హక్కుల కార్యకర్త
- Director - ProjectNAVAYAN

పిక్ సందర్భం: వర్గీకరణ తీర్పు అనంతరం హైదరాబాద్ విజయోత్సవ ర్యాలి తర్వాత ప్రొఫెసర్ కాశిం అన్నగారితో కలసి మందకృష్ణ మాదిగ గారి నివాసంలో కలిసి అభినందించిన సందర్భంగా...

వర్గీకరణ విజయ సారది మంద కృష్ణ మాదిగ అన్న గారు హైదరాబాద్ MRPS కార్యాలయం నందు జాతీయ జెండా  ఎగురవేసిన అనంతరం దళిత ఉద్యమ సహచ...
15/08/2024

వర్గీకరణ విజయ సారది మంద కృష్ణ మాదిగ అన్న గారు హైదరాబాద్ MRPS కార్యాలయం నందు జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం దళిత ఉద్యమ సహచరుడు, ఆప్త మిత్రుడు జయ కుమార్ తో కలిసి ఫోటో దిగిన సందర్భం..

12/08/2024

🎉 Excited to share a special moment! 🎉Today, we celebrated the audio launch of the Telugu movie "Revu" at Prasad Film La...
24/07/2024

🎉 Excited to share a special moment! 🎉

Today, we celebrated the audio launch of the Telugu movie "Revu" at Prasad Film Labs in Hyderabad. I had the privilege of congratulating my dear friend John K Joseph on his incredible achievement as the Music Director for his first film! 🎶

John, your talent and dedication have truly shone through, and we are all so proud of you. Wishing you and the entire "Revu" team all the success and looking forward to the amazing music you’ve created! 🌟🎵



---

🌼 మాదిగ దండోరా - MRPS జెండా ఆవిష్కరణ కార్యక్రమం - జాన్ పేట, కైకలూరు నియోజకవర్గం, ఏలూరు జిల్లా 🌼వర్గీకరణ మాదిగల చిరకాల స్...
08/07/2024

🌼 మాదిగ దండోరా - MRPS జెండా ఆవిష్కరణ కార్యక్రమం - జాన్ పేట, కైకలూరు నియోజకవర్గం, ఏలూరు జిల్లా 🌼

వర్గీకరణ మాదిగల చిరకాల స్వప్నం, దానిని నెరవేర్చడానికి మాదిగ దండోరా ద్వారా "మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి - MRPS" హక్కుల ఉద్యమం ఆవిర్భవించి జూలై 7 తో 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అభినవ అంబేద్కర్, మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారి ఆదేశానుసారం జూలై 7 ఆదివారం ఉదయం పార్టీలకతీతంగా జాన్ పేట గ్రామంలోని బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి, మాదిగ దండోరా - MRPS జెండా ఆవిష్కరణ చేసి ఉద్యమానికి సంఘీభావ సభ నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా కైకలూరు నియోజకవర్గ మాదిగ దండోరా - MRPS ఇంచార్జి విజయ్ వంగలపూడి మాట్లాడుతూ కైకలూరు నియోజకవర్గంతో పాటు తెలుగు రాష్ట్రాలలోని ప్రతి మాదిగ గ్రామంలో MRPS కమిటీలు ఏర్పాటు చేసి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహకారంతో మాదిగ రిజర్వేషన్ల పోరాటాన్ని ఉదృతం చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జాన్ పేట గ్రామ పెద్దలు శరత్ గోన, సతీష్ పిల్లనగ్రోవి, మదన్ కుమ్మరికుంట TDP పార్టీ నాయకులు వేల్పుల విజయ్, సునీల్ రాయినూతల, జాన్ పేట MRPS నాయకులు పిల్లనగ్రోవి అభ్రహాం, రాజేష్ పాలపర్తి, సురేష్ పాలపర్తి, యోహాను కొదమల, నాగేశ్వరరావు కొండిపోగు పాల్ల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

🙏 సామాజిక ఉద్యమాభివందనాలు 🙏
~ విజయ్ వంగలపూడి
MRPS - కైకలూరు ఇన్ఛార్జ్
మానవ హక్కుల కార్యకర్త
ఏలూరు జిల్లా.

SC సామాజిక వర్గ సమీకరణలో భాగంగా అనితక్కకి హోం శాఖ కేటాయించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విజనరీ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబ...
16/06/2024

SC సామాజిక వర్గ సమీకరణలో భాగంగా అనితక్కకి హోం శాఖ కేటాయించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విజనరీ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు కూటమి నాయకులకు MRPS నాయకత్వం తరపున ధన్యవాదాలు.

విజయ్ వంగలపూడి
డైరెక్టర్ - అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం
MRPS నాయకులు

శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా, నూతన మంత్రిమండలి ప్రమాణస్వీకార మహోత్సవానికి...
12/06/2024

శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా, నూతన మంత్రిమండలి ప్రమాణస్వీకార మహోత్సవానికి MRPS అధినేత గౌ శ్రీ మంద కృష్ణ మాదిగ గారు ముఖ్య అతిదిగా హాజారు కాగా, రాష్ట్ర నాయకత్వంతో కలిసి ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరు కావడం జరిగింది.

ఈ సందర్భంగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన వంగలపూడి అనిత గారికి కేబినెట్ లో స్థానం కల్పించినందుకు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి MRPS నాయకత్వం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పిఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మరియు రాష్ట్ర స్థాయి MRPS నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

~ విజయ్ వంగలపూడి - MRPS
PH: 9492739099

MRPS జాతీయ రచయితల సంఘం అద్యక్షుడు, మిత్రుడు రాజేష్ పచ్చల మరియు ఏలూరు జిల్లా MRPS నాయకులతో ఆత్మీయ సమావేశం. ఈ సమావేశంలో MR...
11/06/2024

MRPS జాతీయ రచయితల సంఘం అద్యక్షుడు, మిత్రుడు రాజేష్ పచ్చల మరియు ఏలూరు జిల్లా MRPS నాయకులతో ఆత్మీయ సమావేశం.

ఈ సమావేశంలో MRPS IT Cell నిర్మాణం, వర్గీకరణ ఉద్యమ కార్యాచరణ , కమిటీల నిర్వహణ గురించి చర్చించడం జరిగింది.

దినేష్ శ్రీరాములు కి జాన్ పేట యూత్ అసోసియేషన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు...
06/06/2024

దినేష్ శ్రీరాములు కి జాన్ పేట యూత్ అసోసియేషన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు...

Buddha Purnima Greetings from Navayan Buddhist SocietyProject Navayan is dedicated to empowering marginalized communitie...
23/05/2024

Buddha Purnima Greetings from Navayan Buddhist Society
Project Navayan is dedicated to empowering marginalized communities through education, awareness, and social justice. Inspired by the teachings of Gautama Buddha, Dr. B.R. Ambedkar, Jyotirao Phule, and Periyar, we aim to create a more equitable society. Join us in our mission to promote knowledge, equality, and human rights.

🏡 మిత్రుడు వంగేవరపు రవి నూతన గృహ ప్రవేశ ప్రత్యేక సందర్భంలో, దేవుని రక్షణ మరియు ఆశీర్వాదాల స్వాస్థ్యము కొరకు బలి అర్పణగా,...
19/05/2024

🏡 మిత్రుడు వంగేవరపు రవి నూతన గృహ ప్రవేశ ప్రత్యేక సందర్భంలో, దేవుని రక్షణ మరియు ఆశీర్వాదాల స్వాస్థ్యము కొరకు బలి అర్పణగా, వారి తండ్రి స్వర్గీయ ఏసుపాదం గారిని గుర్తు చేసుకుంటూ స్వయంగా ఒక కోడిని సమర్పించి మన పురాతన ఆచార సాంప్రదాయాల ప్రకారం శాంతి జరిపించారు.

ఈ చర్య మన గృహాలను మరియు జీవితాలను దేవుని సంరక్షణ మరియు సమృద్ధి కోసం అర్పించుకోవలసిన ప్రాముఖ్యతను మనకు గుర్తు చేస్తుంది.

అది ప్రేమ, ఆనందం మరియు దేవుని యొక్క సమృద్ధి ఆశీర్వాదాలతో నిండి ఉండాలని కోరుతూ నూతన గృహ ప్రవేశం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు!
🙏

ఇట్లు
విజయ్ వంగలపూడి

Address

John Peta, Kaikaluru
Eluru
521333

Alerts

Be the first to know and let us send you an email when John Peta Youth Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to John Peta Youth Association:

Share