National Human Rights NSHR

National Human Rights NSHR Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from National Human Rights NSHR, Non-Governmental Organization (NGO), Youth Bhavan, Delhi.

*తెల్గి తరహా ఈ స్టాంపుల కుంభకోణం పై సమగ్ర విచారణ చేపట్టాలి !!!_(ఎన్ ఎస్ హెచ్ ఆర్)* గౌరవ అధ్యక్షుడు శివ శంకర్ ఆదేశాల మేరక...
25/07/2025

*తెల్గి తరహా ఈ స్టాంపుల కుంభకోణం పై సమగ్ర విచారణ చేపట్టాలి !!!_(ఎన్ ఎస్ హెచ్ ఆర్)*

గౌరవ అధ్యక్షుడు శివ శంకర్ ఆదేశాల మేరకు నేషనల్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్ ఎన్ఎస్ హెచ్ఆర్ ఆధ్వర్యంలో స్థానికంగా నిర్వహించిన సమావేశంలో ప్రతినిధులు మాట్లాడుతూ తెల్గి కుంభకోణం 200 బిలియన్లైతే కళ్యాణదుర్గం ఈ స్టాంపుల కుంభకోణాన్ని ఇంకా తీవ్రంగా పరిగణలోకి తీసుకోవాలని సదరు జాతీయ, రాష్ట్ర అధికారులకు విజ్ఞప్తి చేశారు. అలాగే కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ నారాయణ స్వామి పాత్ర కూడా ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆ అనుమానాలను సుమోటో గా తీసుకొని సమగ్ర విచారణ చేపట్టాలని త్వరలో ఈ కుంభకోణానికి పాల్పడిన వారు ఎవరైనా సరే ఉపేక్షించకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని
మరియు ఇదే విషయం పై రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ను కలుస్తామని ఇలాంటి అధికారులను సస్పెండ్ కాకుండా రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయాలని చట్టపరమైన చర్యలు చేపట్టాలని నేషనల్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్ (ఎన్ఎస్ హెచ్ఆర్) తరపున కోరారు. ఇటీవల జరిగిన ఏ సి బి దాడిలో అవినీతి అధికారిని పట్టుకున్న వైనంపై ఏ సి బి అధికారులను నేషనల్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్ (ఎన్ఎస్ హెచ్ఆర్) తరపున అభినందనలు తెలియచేశారు. ఏ సి బి అధికారుల పని తీరు భేష్ అని కొనియాడారు. అంతేకాకుండా జిల్లాలో ఇలాంటి అధికారులు ముసుగులో ఉన్నారని వారిని కూడా నిర్ధాక్షిణ్యంగా పట్టుకుని అవినీతి నిరోధక రాష్ట్రంగా మార్పు తేవాలని వారు కోరారు. అలాగే రాష్ట్ర, జిల్లా ప్రజలు ఎవరైనా అధికారులు లంచం అడిగితే వెంటనే నేషనల్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్ (ఎన్ఎస్ హెచ్ఆర్) ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ న్యాయ సలహాదారుడు ఓబులపతి, ఉమ్మడి జిల్లాల యూత్ వింగ్ అధ్యక్షుడు కేశవ్, విద్య శాఖ ఉపాధ్యక్షుడు చంద్ర మోహన్, హరీష్, గురు తదితరులు పాల్గొన్నారు.

Address

Youth Bhavan
Delhi
110001

Alerts

Be the first to know and let us send you an email when National Human Rights NSHR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to National Human Rights NSHR:

Share