Alampur Modi Team

Alampur Modi Team Alampur Mandal MODI Team for NEWINDIA

10/01/2024

Take the Jan Man Survey on NaMo app

Join me on NaMo App in the journey to transform India.Click https://n-m4.in/FJX2 & enter code HTW4O4-F
27/06/2023

Join me on NaMo App in the journey to transform India.

Click https://n-m4.in/FJX2 & enter code HTW4O4-F

Join me on NaMo App in the journey to transform India. Click

రెండు వేర్వేరు సంఘటనలు కానీ పోలిక మాత్రం ఒకటే !2005 లో ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఉప ఎన్నికలో బహుజన సమాజ్ పార్టీ తరుపున పోట...
19/04/2023

రెండు వేర్వేరు సంఘటనలు కానీ పోలిక మాత్రం ఒకటే !
2005 లో ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఉప ఎన్నికలో బహుజన సమాజ్ పార్టీ తరుపున పోటీ చేసి గెలిచాడు రాజు పాల్ ! రాజు పాల్ గెలిచింది అతిక్ అహ్మద్ సోదరుడు అయిన అష్రాఫ్ ని !
తన సోదరుడి ఓటమికి కారణం అయిన రాజు పాల్ ని చంపేయాలని నిర్ణయించాడు అతిక్ అహ్మెద్ !
MLA గా ఎన్నిక అయ్యాక రాజు పాల్ తన స్వగ్రామంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని టొయోటా కలీస్ వాహనంతో పాటు మరో వాహనంలో అతను అనుచరులు కలిసి వెళుతుండగా 2005 ఫిబ్రవరి 25 న అతిక్ అహ్మద్ అనుచరులు రెండు మహీంద్రా స్కార్పియో వాహానాలతో వెంబడించడం మొదలుపెట్టారు. ప్రజలు ఎక్కువగా లేని చోటకి వచ్చేసరికి అతిక్ అహ్మద్ అనుచరులు తమ రెండు స్కార్పియో వాహానాలని రాజు పాల్ ప్రయాణిస్తున్న టొయోటా కలీస్ వాహానానికి అడ్డుగా పెట్టి ఆపేసి AK-47 మరియు 9MM రివాల్వర్ లతో గుళ్ళ వర్షం కురిపించారు రాజు పాల్ మీద ! రెండు మహీంద్రా స్కార్పియో వాహనాలలో మొత్తం 12 మంది వచ్చారు రాజు పాల్ ని చంపడానికి. అందరూ షార్ప్ షూటర్స్ ! అందరి దగ్గరా AK-47, 9 MM రివాల్వర్లు ఉన్నాయి!PSP
***********************************
రాజు పాల్ శరీరంలోకి మొత్తం 19 బుల్లెట్లు దిగాయి. రక్తం వొడుతున్న రాజూ పాల్ ని అతని అనుచరులు [మరో ముగ్గురు చనిపోయారు ] మిగిలిన వారు అదే దారిలో వెళుతున్న ఒక టెంపో ని ఆపి అందులో రాజు పాల్ ని తీసుకొని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లడం మొదలుపెట్టారు ! రాజు పాల్ ని హాస్పిటల్ కి ఒక టెంపో లో తీసుకెళ్తున్నారు అని తెలుసుకున్న అతిక్ అహ్మద్ మళ్ళీ తన అనుచరులకి ఫోన్ చేసి రాజు పాల్ శరీరం ముక్కలు ముక్కలుగా చేయమని ఆదేశించాడు! మళ్ళీ వెనక్కి వచ్చిన అతిక్ అహ్మెద్ అనుచరులు టెంపో మీద విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు ! Ok ! ఈ సారి కాల్పులు నిముషాలకే పరిమితం కాలేదు ! టెంపో ప్రయాణిస్తున్న 5 కిలోమీటర్ల వరకు వందల కొద్దీ బుల్లెట్ల వర్షం కురిపించారు !
2003 నుండి 2007 వరకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసింది సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ ! మరి 2005 లో భారత దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడలేదా ? పడలేదు ! ఎందుకంటే అప్పుడు కేంద్రంలో UPA-1 ప్రభుత్వం ఉంది ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సదరు సొ కాల్డ్ జర్నలిస్టు లకి అది స్థానిక రాజకీయ కక్షలుగా కనపడ్డాయి !
*****************************
Well ! తాను ముఖ్యమంత్రిగా అధికారం వెలగబెడుతున్నప్పుడు అఖిలేష్ యాదవ్ బహిరంగంగానే ఒక ప్రకటన చేశాడు గుర్తుందా ?
‘’ఉత్తర ప్రదేశ్ అంటే యాదవులు మరియు ముస్లిములు మాత్రమే ‘’ !
*************************
ఇప్పుడు అతిక్ అహ్మద్ ని హత్య చేసిన తీరు ని ఒకసారి పరిశీలిద్దాం !
హత్య చేయడానికి వచ్చిన ముగ్గురూ ఒకటికి రెండు సార్లు అతిక్ అహ్మద్ మరియు అష్రాఫ్ ల తల మీద కాల్పులు జరిపారు ఎందుకంటే వాళ్ళు మెడికల్ కాలేజీ కి దగ్గరలోనే ఉన్నారు కాబట్టి కొన ఊపిరితో ఉన్నా అయిదు నిముషాలలో హాస్పిటల్ లోకి తీసుకెళ్తారు పోలీసులు!
2005 లో రాజు పాల్ ని క్రూరంగా హత్య చేసిన తరువాత అంటే 18 ఏళ్ల వరకు ఆ కేసు విచారణ ఎందుకు కొనసాగింది ? అబ్దుల్ కావి [Abdul Qavi ] అనే నిందితుడు 2005 నుండి 2023 వరకు పరారీలో ఉన్నాడు ! ఎవరు అబ్దుల్ కావి కి సహకరించారు ?
మొత్తం 10 మంది హై కోర్టు న్యాయమూర్తులు ఆతిక్ అహ్మద్ కేసుని విచారించడానికి నిరాకరించారు ! అతిక్ అహ్మద్ బహిరంగము గానే న్యాయమూర్తులని బెదరించాడు ! ఒక MLA ని క్రూరంగా హత్య చేసినప్పుడు కానీ, హై కోర్టు న్యాయమూర్తులని బెదిరించినప్పుడు కానీ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడలేదా ?
***********************
2017 లో యోగి ఆదిత్యనాధ్ గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కో మాఫియా లీడర్ లొంగిపోవడమో లేదా ఎనకౌంటర్ లో చనిపోవడమో జరిగినప్పుడు మాత్రం వీళ్ళకి మానవహక్కులు గుర్తుకు వస్తూ వచ్చాయి !
అసలు విషయం ఏమిటంటే అతిక్ అహ్మద్ నేర సామ్రాజ్యం లో 140 మంది సభ్యులు ఉన్నారు ! అధికారికంగా 1400 వందల కోట్లు అక్రమ సంపాదన అని ప్రకటించారు ! కానీ బినామీ ల రూపంలో 11,600 కోట్ల ఆస్తులు ఉన్నాయి ! అవి ఇప్పుడు ఎవరికీ పనికిరాకుండా పోయాయాని ఏడుపు తప్పితే ఇంకోటి కాదు ! ఎవరి పేరుతో ఆస్తులు ఉన్నాయో వాళ్ళు ఎన్నటికీ బయటికి చెప్పరు. ఒక వేళ సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ బెదిరించడానికి ప్రయత్నించినా బెదిరి పోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు ! ఇప్పట్లో అఖిలేష్ యాదవ్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు కాబట్టి బినామీలు సంతోషంగా ఉంటారు. బినామీలు అందరూ ఆస్తులు అనుభవిస్తూ ఉంటారు లేదా వేరే వాళ్ళకి అమ్మేసి కాష్ చేసుకుంటారు యోగి ఆదిత్యనాధ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ! ఒక వేళ ఆ ఆస్తి నీది కాదు అని బహిరంగగా బెదిరించడానికి ప్రయత్నిస్తే సదరు ఆస్తులని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది !
******************
మానవహక్కులు,ప్రజాస్వామ్యం అనేవి కొంతమందికి అలవాటుగా మారిన ఒక రోగం ! ఇలా మాట్లాడే వాళ్ళకి అతిక్ అహ్మద్ అంతో కొంత డబ్బు ఇస్తూ వెళ్ళాడు తన ఆటలు సాగినంత కాలం ! ఇప్పుడు ఆ ఆదాయం రాదు అని తెలిసాక మానవహక్కులు,ప్రజాస్వామ్యం అంటూ గొంతు చించుకుంటున్నారు !
******************
2002 లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మోడీజీ కూడా గుజరాత్ లో మాఫియా గ్యాంగ్ ల పని పట్టిన సంగతి అంతగా ప్రచారం కి నోచుకోలేదు ! కానీ మోడీజీ ముందు చేసినపని మాఫియా గ్యాంగ్ లని ఏరిపారవేయడమే ! ఆ తరువాతే గుజరాత్ లో స్వేచ్ఛగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు పారిశ్రామిక వేత్తలు !
కానీ ఉత్తర ప్రదేశ్ దగ్గరికి వచ్చే సరికి ఒకటికి పది మంది మాఫియా ముఠాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ! దశాబ్దాలుగా వెళ్ళూనుకొని పోయి ఉన్న మాఫియాని అంతం చేయాలంటే అది సాదా సీదా రాజకీయ నాయకుల వల్ల అయ్యే పని కాదు !
‘ఒక్క సన్యాసి వల్లనే సాధ్యం అవుతుంది ‘’ !
అతిక్ అహ్మద్ హత్య వలన ఉత్తర ప్రదేశ్ లో ఇక మాఫియా అంతం అయినట్లేనా ?
ఇంకో అర డజనుమంది మాఫియా నాయకులు పశ్చిమ బెంగాల్,ఢిల్లీ రాష్ట్రాలలో ఆశ్రయం పొందుతున్నారు అజ్ఞాతంగా ! యోగి ఆదిత్యనాధ్ ఉత్తర ప్రదేశ్ నుండి కేంద్రానికి వెళ్ళగానే మళ్ళీ వీళ్ళు ఉత్తర ప్రదేశ్ కి వచ్చేసి యధా తధంగా తమ కార్యకలాపాలని మొదలు పెడతారు !
అందువలన ఉత్తర ప్రదేశ్ కి యోగి ఆదిత్య నాధ్ అవసరం ఉంది ఇంకో సారి ముఖ్యమంత్రిగా !
అతిక్ అహమద్ ని హత్య చేయడం వలన యోగి ఆదిత్య నాథ్ కి వచ్చిన నష్టం ఏమీ లేదు ! ఎందుకంటే అతిక్ అహ్మద్ లాంటి మాఫియా నాయకుడి వలన బాధింపబడ్డ వారిలో హిందువులతో పాటు ముస్లిమ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు!
కోర్టులో అతిక్ అహ్మద్ నోరు విప్పితే ఎవరికి నష్టమో వాళ్ళే హత్య చేయించారు! ఎవరికి నష్టం ?
జైహింద్ ! జై భారత్ !

  * * for * * click below link
16/04/2023

* * for * * click below link

Address

Alampur
Alampur

Alerts

Be the first to know and let us send you an email when Alampur Modi Team posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Alampur Modi Team:

Share