16/03/2025
దుబాయ్: గల్ఫ్ పయనంలో తెలియని సమస్యలతో సతమతమవుతున్న బాధితులు.. వివరాల్లో కి వెళ్తే నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం, కూనపల్లి గ్రామానికి చెందిన గైనిపోశెట్టి ఫిబ్రవరి 27, నాడు దుబాయ్ కి చిన్న కంపెనీలో పలంబరు పనిమీద వచ్చారు. మురుసటి రోజు అతనిని అబుదాబికి ట్రాన్స్ఫర్ చేసి కంపెనీలో పని ఇచ్చారు. కుటుంబ సభ్యులతో ఆరోజు మాట్లాడిన పోశెట్టి సాయంకాలము తను బాగానే మాట్లాడి , రాత్రి వింతగ మాట్లాడినట్లు ఇంటి నుండి తెలిపారు, మరసటి రోజు నుండి కంపెనీలో పనిచేయడం గాని వెళ్లలేకపోయారు, మతిస్థిమితం కోల్పోయి వారం రోజులు కనపడకుండా పోయాడు. మిత్రులు శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన( మాజీ సర్పంచ్ ప్రమోద్) సాయన్న,(టీచర్) సాయి ప్రసన్న లు..దుబాయ్ లో ఉంటున్న సామాజిక కార్యకర్త , యూఏఈ తెలుగు హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ సభ్యులు.. జంగం బాలకిషన్ కు సమాచారం ఇచ్చారు వెతకమని, కంపెనీ వారు కూడా వెతకడం ప్రారంభించారు. వెంటనే దుబాయ్ లో ఉన్న యూఏఈ తెలుగు వాట్సాప్ గ్రూప్ ల్లో అతని ఆచూకీ కోసం తెలుపమని "కనబడుట లేదు" షేర్ చేశారు. రెండు రోజుల క్రితం అబుదాబిలోని ఇండస్ట్రియల్ ముసఫ ఏరియాలో అతని ఆచూకీ లభ్యం అయింది. కంపెనీకి అప్పగించడం జరిగింది, కంపెనీ వారు అతనికి టిక్కెట్టుకొని రెండు రోజుల్లో ఇంటికి పంపిస్తామని హామీ ఇచ్చారు. ఈమధ్య గల్ఫ్ కు వస్తున్న వారిలో చాలా వింత లక్షణాలు కనిపిస్తున్నాయి, మానసికంగా బాధపడుతున్నట్టు వ్యక్తం అవుతుంది. కుటుంబ సభ్యులను దూరం చేసుకుని.. గత సంవత్సరంలో కూడా పలువురు మతి స్థిమితం కోల్పోయిన వారిని చెరదీసి ఇంటికి పంపించే క్రమంలో సహాయపడ్డారు. పని కోసం గల్ఫ్ వచ్చేవారు మానసిక దృఢత్వాన్ని కోల్పోకూడదు అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు..✍🏼జంగం బాలకిషన్. సామాజిక కార్యకర్త యుఏఈ తెలుగు హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ సభ్యులు(దుబాయ్)